కొత్త ఫోన్ కొంటున్నారా? పాత ఫోన్ డేటా మొత్తం 20 నిమిషాల్లో కొత్త ఫోన్‌లోకి మార్చుకోండిలా!
ఆగస్టు 22, 23 తేదీల్లో కొత్త ఫోన్ కొంటున్నారా? వీకెండ్ సేల్స్ సమయంలో మన దేశంలో చాలామంది పాత ఫోన్లు వదిలేసి కొత్త స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుంటారు. అయితే మీ పాత ఫోన్‌లోని డేటాను కొత్త ఫోన్‌లోకి మార్చుకోవడం కేవలం 20 నిమిషాల పని! ముఖ్యంగా వాట్సాప్, ఫొటోలు, కాంటాక్ట్లు, యూపీఐ (UPI), ఈ-సిమ్ (eSIM) వంటి వివరాలను భద్రంగా ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. కొత్త ఫోన్‌లో డేటా అంతా సరిగ్గా రీస్టోర్ అయ్యిందో లేదో చూసుకున్నాకే పాత ఫోన్‌ను రీసెట్ చేయాలి. లేదంటే యూపీఐ పేమెంట్లు నిలిచిపోవడం, పాత చాట్లు పోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
డేటా ట్రాన్స్‌ఫర్ మొదలుపెట్టే ముందు రెండు ఫోన్లలోనూ వైఫై ఆన్ చేయండి, రెండింట్లోనూ తగినంత ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే మీ ప్రైమరీ సిమ్ కార్డ్ యాక్టివ్‌గా ఉండాలి. వీలైనంత వరకు డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకోండి, అలాగే సేఫ్టీ కోసం క్లౌడ్ బ్యాకప్ కూడా ఒక ఆప్షన్‌గా పెట్టుకోండి. కాంటాక్ట్ వివరాల కోసం VCF ఫైల్, క్యూఆర్ (QR) కోడ్లను దాచుకోవడం మంచిది. బ్యాంక్ ఎస్ఎమ్‌ఎస్‌లు, నెట్‌వర్క్ ఎస్ఎమ్‌ఎస్‌లు సరిగ్గా వస్తున్నాయో లేదో గమనించండి. చివరగా పాత ఫోన్ సైన్ అవుట్ చేసేటప్పుడు 'ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్' లేదా 'యాక్టివేషన్ లాక్' పడకుండా జాగ్రత్త పడండి.

వాట్సాప్ బ్యాకప్ & రీస్టోర్ చెక్‌లిస్ట్
ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరొక ఆండ్రాయిడ్ ఫోన్‌కి వాట్సాప్ మారుస్తుంటే.. 'వాట్సాప్ చాట్ ట్రాన్స్‌ఫర్' ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఫొటోలు, వీడియోలు ఓపెన్ అవుతున్నాయో లేదో ఒకసారి సరిచూసుకోండి. సేఫ్టీ కోసం గూగుల్ డ్రైవ్‌లో కూడా బ్యాకప్ తీసి ఉంచండి. అలాగే పాస్‌వర్డ్ లేదా 64-డిజిట్ కీతో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ను ఆన్ చేయండి. బిజినెస్ ఖాతాదారులు ముఖ్యమైన చాట్‌లను ముందే ఎక్స్‌పోర్ట్ చేసుకోవడం మంచిది. దీనివల్ల కొత్త డివైజ్‌లో లాగిన్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు రావు.
గూగుల్ ఫొటోస్ ఫోల్డర్లు, మీడియా క్వాలిటీ
గూగుల్ ఫొటోస్ యాప్ ఓపెన్ చేసి, 'బ్యాకప్ క్వాలిటీ'కి వెళ్లి ఒరిజినల్ లేదా స్టోరేజ్ సేవర్ ఆప్షన్ ఎంచుకోండి. వాట్సాప్ ఇమేజెస్, ఇన్‌స్టాగ్రామ్, స్క్రీన్‌షాట్స్ వంటివి కూడా బ్యాకప్ అయ్యేలా 'బ్యాకప్ డివైస్ ఫోల్డర్స్' ఆప్షన్ ఆన్ చేయండి. ఇటువలే ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనలు మారడం వల్ల గూగుల్ స్టోరేజ్ త్వరగా నిండిపోయే అవకాశం ఉంది. అందుకే పెద్ద మొత్తంలో ఫైల్స్ అప్‌లోడ్ చేసే ముందు మీ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ పరిమితిని ఒకసారి చెక్ చేసుకోండి. దీనివల్ల వీకెండ్‌లో బ్యాకప్ ప్రాసెస్ మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది.
కాంటాక్ట్స్, ఎస్ఎమ్‌ఎస్, కాల్ హిస్టరీ సింక్ ప్రొసెస్
మీ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ గూగుల్ కాంటాక్ట్స్ లేదా ఐక్లౌడ్ (iCloud)తో సింక్ అయ్యాయో లేదో చూసుకోండి. ముందుజాగ్రత్తగా కాంటాక్ట్స్‌ని 'VCF' ఫైల్‌గా ఎక్స్‌పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ బ్యాకప్‌లో ఎస్ఎమ్‌ఎస్‌లు, కాల్ హిస్టరీ కూడా వస్తాయి, కానీ ఇవి ఫోన్ ప్రారంభంలో సెటప్ చేసేటప్పుడు మాత్రమే రీస్టోర్ అవుతాయి. అందుకే పాత ఫోన్‌ను రీసెట్ చేసేకంటే ముందే కొత్త ఫోన్‌లో ఇవన్నీ సరిగ్గా వచ్చాయో లేదో చెక్ చేసుకోవడం మంచిది.
యూపీఐ, ఈ-సిమ్ (eSIM) ట్రాన్స్‌ఫర్ ఇలా..
యూపీఐ యాప్‌లు కొత్త డివైజ్‌లో యాక్టివేట్ అవ్వాలంటే మీ బ్యాంక్ రిజిస్టర్డ్ సిమ్ నుండి వెరిఫికేషన్ ఎస్ఎమ్‌ఎస్ వెళ్లాల్సి ఉంటుంది. అందుకే మీ సిమ్‌లో అవుట్‌గోయింగ్ ఎస్‌ఎమ్‌ఎస్ సౌకర్యం ఉందో లేదో చూసుకోండి. మీ యూపీఐ క్యూఆర్ కోడ్‌తో పాటు బ్యాంక్ పాస్‌బుక్ లేదా స్టేట్‌మెంట్ పీడీఎఫ్ కాపీలను దాచుకోండి. ఇక ఈ-సిమ్ (eSIM) విషయానికొస్తే.. జియో యూజర్లు 'MyJio' యాప్ ద్వారా, ఎయిర్‌టెల్ యూజర్లు 121కి మెసేజ్ చేయడం ద్వారా, వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులు యాప్ ద్వారా ఈ-సిమ్ ట్రాన్స్‌ఫర్ మొదలుపెట్టవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తయి యాక్టివేట్ కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కాస్త ముందే ప్లాన్ చేసుకోండి.
ఐఫోన్↔ఆండ్రాయిడ్ డేటా షిఫ్టింగ్.. జాగ్రత్తలు!
ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి మారుతుంటే 'స్విచ్ టు ఆండ్రాయిడ్' (Switch to Android) యాప్ ఉపయోగించండి. అదే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారితే 'మూవ్ టు ఐఓఎస్' (Move to iOS) యాప్ వాడండి. ఒకవేళ ఐఫోన్ వదిలేస్తుంటే మెసేజ్లు మిస్ కాకుండా ఉండటానికి ముందే iMessageని డిసేబుల్ చేయండి. పాత ఆండ్రాయిడ్ ఫోన్ రీసెట్ చేసే ముందు గూగుల్ అకౌంట్లను తొలగిస్తే FRP లాక్ పడకుండా ఉంటుంది. అదే ఐఫోన్ అయితే 'Find My' ఆఫ్ చేసి, ఆపిల్ ఐడీ నుంచి లాగౌట్ అయ్యాకే డేటాను ఎరేజ్ (Erase) చేయాలి. కొత్త ఫోన్‌లో మీ డేటా అంతా రీస్టోర్ అయినట్లు నిర్ధారించుకున్నాకే పాత ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయండి.


Click it and Unblock the Notifications