మీ అకౌంట్‌లోని డబ్బును ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో, మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ నెంబర్, మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ కాని పక్షంలో వెంటనే మీ బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైన వెంటనే మీకో మొబైల్ మనీ ఐడెంటీఫైర్ (MMID) నెంబర్ అందుతుంది.

మీ అకౌంట్‌లోని డబ్బును ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

Read More : రెడ్మీ ఫోన్‌లకు షాకిచ్చేలా లెనోవో కే6 పవర్ లాంచ్ అయ్యింది

ఈ 7 అంకెల నెంబరును బ్యాంక్ వారు ఇష్యూ చేయటం జరుగుతుంది. ఈ నెంబర్ ద్వారానే మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందగలుగుతారు. USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో ఈ MMID నెంబర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే సమయంలో 4 డిజట్లతో కూడిన MPINను కూడా మీకు బ్యాంక్ వారు అందించటం జరుగుతుంది. దీనికి పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవల్సి ఉంటుంది. డీఫాల్ట్ MPINను పొందిన వెంటనే నచ్చిన అంకెలతో పిన్‌ను మార్చుకోవచ్చు. USSD మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా మీ అకౌంట్‌లోని డబ్బును వేరొకరి అకౌంట్‌లోకి ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..

Read More : ఇంటర్నెట్‌తో పనిలేకుండా మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందటం ఎలా.?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

అత్యంత రహస్యంగా మైక్రోసాఫ్ట్ ఫోన్!

ముందుగా మీ ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి *99# టైప్ చేసి మీ బ్యాంక్‌కు సంబంధించి మొదటి మూడు అక్షరాలను ఎంటర్ చేయండి. మీకు స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉన్నట్లయితే SBI అనే టైప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ HDFCలో ఉన్నట్లయితే HDF అనే టైప్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసిన వెంటనే మరో ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుంది. అందులో మూడు ఆప్షన్‌ (Send Money Using MMID)ను సెలక్ట్ చేసుకుని సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2

మీరు నగదు ట్రాన్స్‌ఫర్ చేయబోయే లబ్ధిదారునికి సంబంధించి మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. (ముఖ్య గమనిక : USSD మొబైల్ బ్యాంకింగ్ విధానంలో మీరు నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ కూడా మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. అంతే కాకుండా ఆ వ్యక్తి కూడా MMID నెంబర్‌ను కలిగి ఉండాలి)

స్టెప్ 3

జీవితాంతం ఉచిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్ ఆఫర్?

ఇప్పుడు ఓపెన్ అయ్యే మరొక ఇంటర్‌ఫేస్‌లో లబ్ధిదారునికి సంబంధించిన MMID నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4

ఇప్పుడు ఓపెన్ అయ్యే మరొక ఇంటర్‌ఫేస్‌లో మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనకుంటున్న నగదు విలువను ఎంటర్ చేయండి. ఒక్కో లావాదేవీకి రూ.5000 వరకు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నగదు విలువను ఎంటర్ చేసిన తరువాత సెండ్ బటన్ పై క్లిక్
చేయండి.

స్టెప్ 5

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు ఓపెన్ అయ్యే మరొక ఇంటర్‌ఫేస్‌లో మీకు కేటాయించబడిన MPINతో పాటు మీ అకౌంట్ నెంబర్ చివరి నాలుగు అంకెలను స్పేస్ ఇస్తు ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయడంతో మనీ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ విజయవంతంగా ముగుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to transfer money From Your phone by using USSD short codes. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot