Vodafone టాక్‌టైమ్ బ్యాలెన్స్‌ను మరొకరికి ట్రాన్సఫర్ చేయడం ఎలా?

|

భారతదేశంలో విశ్వసనీయ టెలికాం ఆపరేటర్లలో వోడాఫోన్ ఒకటి. ఈ సర్వీస్ ప్రొవైడర్ తమ వినియోగదారులకు ఎల్లప్పుడూ అద్భుతమైన సేవలను అందించడానికి భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో వంటి ఇతర టెల్‌కోస్‌లతో నేరుగా పోటీపడుతుంది. వోడాఫోన్ తన వినియోగదారులకు అందించే అద్భుతమైన సేవలలో ఒకటి వోడాఫోన్ బ్యాలెన్స్ ట్రాన్సఫర్ మరియు క్రెడిట్ సపోర్ట్. ఈ ఫీచర్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల అకౌంటులోని బ్యాలెన్స్ ను షేరింగ్‌ చేయడానికి ఈ సర్వీసును ప్రత్యేకంగా రూపొందించింది. మీరు వొడాఫోన్ వినియోగదారు అయితే కనుక వొడాఫోన్ బ్యాలెన్స్ ను మరొకరికి ఎలా ట్రాన్సఫర్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఎలా చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వోడాఫోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సర్వీస్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

వోడాఫోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సర్వీస్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

బ్యాలెన్స్ బదిలీ సర్వీసును ఉపయోగించే ముందు వోడాఫోన్ వినియోగదారులు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ సేవను ఉపయోగించడానికి మీరు కనీసం ఐదు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వోడాఫోన్ కస్టమర్ అయి ఉండాలి. మీరు రూ.5 నుండి రూ.30 మధ్య కేవలం ఒక బదిలీ ఎంపికను మాత్రమే చేయగలరు. వోడాఫోన్ కనీస బదిలీ ఛార్జీలను తీసివేస్తుంది. ఇది బదిలీ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ బదిలీ ప్రయోజనంను స్వీకరించేవారు కూడా వోడాఫోన్ యొక్క చురుకైన వినియోగదారుగా 30 రోజులకు మించి ఉండాలి.

వోడాఫోన్ టాక్‌టైమ్ బ్యాలెన్స్‌ను ట్రాన్సఫర్ చేసే విధానం

వోడాఫోన్ టాక్‌టైమ్ బ్యాలెన్స్‌ను ట్రాన్సఫర్ చేసే విధానం

వోడాఫోన్ బ్యాలెన్స్ ట్రాన్సఫర్ సర్వీసులు వినియోగదారుల యొక్క ప్రీపెయిడ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను మరొక వోడాఫోన్ ప్రీపెయిడ్ అకౌంటుకు పంచుకునేందుకు అనుమతిస్తాయి. మీరు మీ వోడాఫోన్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్‌ను మరొకరికి షేర్ చేయాలనుకుంటే కనుక డయలర్ లో ‘* 111 * 3 * 5 # కోడ్‌ను డయల్ చేయండి. ప్రత్యామ్నాయంగా వోడాఫోన్ అకౌంట్ బ్యాలెన్స్‌ను మరొక నెంబర్ కు బదిలీ చేయడానికి మీరు నిర్వచించిన ఫార్మాట్ * 131 * బదిలీ మొత్తం * # ను ఉపయోగించవచ్చు.

వొడాఫోన్ యాప్ తో బ్యాలెన్స్‌ను బదిలీ చేసే చర్యలు
 

వొడాఫోన్ యాప్ తో బ్యాలెన్స్‌ను బదిలీ చేసే చర్యలు

మీరు మై వొడాఫోన్ యాప్ ను ఉపయోగించి కూడా మీ వొడాఫోన్ అకౌంట్ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. ఇందుకోసం మొదట యాప్ ను డౌన్‌లోడ్ చేయండి మరియు మీ వోడాఫోన్ ప్రీపెయిడ్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి. తరువాత యాప్ ను ఓపెన్ చేసి బ్యాలెన్స్ ట్రాన్సఫర్ ఎంపికకు నావిగేట్ చేయండి. మీరు టాక్‌టైమ్ బ్యాలెన్స్‌ను భాగస్వామ్యం చేయాలనుకుంటున్న సంబంధిత వోడాఫోన్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత 'ok' ఎంపికను క్లిక్ చేయడంతో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to Transfer Vodafone Talktime Balance to Your Friends Account

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X