Home
How to

కొత్త నంబర్‌కు వాట్సాప్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేస్తున్నారా.. పాత డేటా డిలీట్‌ కాకుండా ఏం చేయాలి?

ప్రస్తుతం అనేక మంది స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు మెసేజ్‌ లు పంపేందుకు, వీడియోలు, ఫోటోలు షేర్‌ చేసేందుకు ‌అనేక యాప్‌లను వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్‌ ను (Whatsapp) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మెరుగైన భద్రత, ఫీచర్లు, సులభమైన యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ వంటి కారణాలతో స్నేహితులు, కుటుంబ సభ్యులతో అందుబాటులోకి ఉండేందుకు వాట్సాప్‌ ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌ లో భారీ సంఖ్యలో వాట్సాప్‌ వినియోగదారులు ఉన్నారు.

తరచూ మొబైన్ నంబర్లు మారుస్తున్నారా? :
వాట్సాప్‌ తన యూజర్ల కోసం అనేక ఫీచర్‌ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భద్రత మరియు వివిధ అవసరాల కోసం విడుదల చేస్తోంది. అయితే చాలా మంది యూజర్లు ఓకే ఫోన్‌ నంబర్‌ ను వినియోగిస్తుంటారు. ఫలితంగా ఒకటే వాట్సాప్‌ ఖాతాను కలిగి ఉంటారు. అయితే మరికొంత మంది యూజర్లు వివిధ అవసరాలు, ప్రైవసీ కోసం తరచూ ఫోన్‌ నంబర్లను మారుస్తుంటారు.

how to transfer whatsapp account

పాత వాట్సాప్‌లో ఉన్న డేటా డిలీట్ కానుందా ?
అలాంటి సమయాల్లో సరైన అవగాహన లేకుంటే.. పాత వాట్సాప్‌ నంబర్‌ లో ఉండే డేటాను కోల్పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్‌ లో వచ్చిన ఫొటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్‌ లు డిలీట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వాట్సాప్‌ నంబర్‌ ను మార్చినా.. డేటా కోల్పోయే అవకాశం ఉండదు.

ఈ ఫీచర్‌ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్‌ సులభం :
పాత నంబర్‌ నుంచి కొత్త ఫోన్‌ నంబర్‌కు వాట్సా్‌ప్‌ అకౌంట్‌ ను క్రియేట్‌ చేసేందుకు.. తొలుత సెట్టింగ్స్‌ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం అకౌంట్ పైన క్లిక్‌ చేయాలి. తర్వాత Change Number పైన క్లిక్‌ చేయాలి. అనంతరం Next ఆప్షన్‌ పైన ట్యాప్‌ చేయాలి.

అనంతరం అక్కడ పాత, కొత్త ఫోన్‌ నంబర్‌ లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు నమోదు చేసిన సమాచారం మొత్తాన్ని తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. సరి చూసుకున్నాక చివరగా Done పైన క్లి్క్‌ చేయాలి. దీంతో మీ పాత వాట్సాప్‌ అకౌంట్‌ లోని డేటా అంతా కొత్త నంబర్‌కు బదిలీ అవుతుంది.

ఈ పద్ధతి ద్వారా వాట్సాప్‌ నంబర్లు మారుస్తున్న ప్రతిసారి డేటా డిలీట్‌ కాకుండా అప్రమత్తం కావచ్చు. దీంతోపాటు డేటా బదిలీ కి కూడా వాట్సాప్‌ చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ అనే ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఇటీవలే QR స్కానర్‌ ద్వారా వాట్సాప్‌ ఛానళ్ల లో జాయిన్‌ కావచ్చు. దీంతోపాటు వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్సిప్షన్ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.

ఈ ఫీచర్ ద్వారా వాయిస్‌ నోట్‌ను టెక్స్ట్‌ ఫార్మాట్‌ లోకి మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాయిస్‌ నోట్‌ ఏ భాషలో ఉంటుందో.. అదే భాషలో టెక్ట్స్‌ ను పొందవచ్చు. అయితే కేవలం వాయిస్‌ నోట్‌ను అందుకున్న వాట్సాప్ యూజర్‌ మాత్రమే.. టెక్ట్స్‌ రూపంలో చూసేందుకు అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how to transfer whatsapp account to new number without loosing data here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X