WhatsApp Tips:వాట్సాప్‌లో చాటింగ్ బ్యాకప్‌ను ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కు బదిలీ చేయడం ఎలా??

|

మీరు తరచూ ఫోన్‌లను మారుస్తూ ఉంటారా?? ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ల మధ్య మారేటప్పుడు వాట్సాప్ యూజర్లు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఒక పరిష్కారం ఉంది. ప్రస్తుతానికి వాట్సాప్ వినియోగదారులు ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి మారేటప్పుడు ప్రొఫైల్ ఫోటో, పేరు, వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌లు మరియు సెట్టింగులతో సహా వారి అకౌంట్ సమాచారాన్ని ఉంచడానికి అనుమతిస్తుంది.

 

వాట్సాప్ చాట్‌ బ్యాకప్

కానీ చాట్ యొక్క హిస్టరీను తరలించడానికి అనుమతించదు. అయినప్పటికీ చాలా మంది వినియోగదారులకు ముఖ్యంగా వ్యాపార సంభాషణలను ఉపయోగించే వారికి చాట్ హిస్టరీ చాలా ముఖ్యం. మీరు ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కు మారుతుంటే మరియు మీ యొక్క వాట్సాప్ చాట్‌లను బ్యాకప్ చేయడానికి మరియు బదిలీ చేయాలనీ చూస్తుంటే కనుక క్రింద పేర్కొన్న పద్ధతులను అనుసరించండి.

ఐఫోన్
 

ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కు మారినప్పుడు వాట్సప్ లో చాట్ హిస్టరీను బదిలీ చేయడానికి స్థానిక ఎంపిక లేదు. IOS వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం ఐక్లౌడ్‌లో బ్యాకప్‌లను స్టోర్ చేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్‌లను కలిగి ఉంది. అయినప్పటికీ వినియోగదారులు వారి మొత్తం చాట్ హిస్టరీను మెయిల్ ద్వారా ఎక్సపోర్ట్ చేసి ఆపై వారి క్రొత్త డివైస్ లో రిస్టోర్ చేయవచ్చు. ప్రతి చాట్ ఒక్కొక్కటిగా ఎక్సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కావున ఇది గజిబిజిగా ఉండే ప్రక్రియ. కానీ చాట్‌లను రిస్టోర్ చేయడానికి హామీని ఇచ్చింది. ఏ చాట్‌లు ముఖ్యమైనవో మీరు ఎంచుకుని ఆ చాట్‌లను ఎక్సపోర్ట్ చేసి ముఖ్యమైనవి లేని వాటిని వదిలివేయమని సిఫార్సు చేయబడింది. వాట్సాప్ చాట్ హిస్టరీను ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కు బదిలీ చేసే దశలు కింద ఉన్నాయి.

Poco F3 GT ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది ! ధర, ఫీచర్లు చూడండి.Poco F3 GT ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది ! ధర, ఫీచర్లు చూడండి.

వాట్సాప్‌లో చాటింగ్ బ్యాకప్‌ను ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కు బదిలీ చేసే విధానం

వాట్సాప్‌లో చాటింగ్ బ్యాకప్‌ను ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కు బదిలీ చేసే విధానం

*** మీ ఐఫోన్‌లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి మీరు ఎక్సపోర్ట్ చేయాలనుకుంటున్న చాట్‌లో ఎడమవైపు స్వైప్ చేయండి.

*** కనిపించే మెనులో మోర్ ఎంపిక మీద నొక్కండి. తరువాత ఎక్సపోర్ట్ చాట్ ఎంపికను ఎంచుకోండి.

*** షేర్ ను నుండి మెయిల్ ఎంపికను ఎంచుకోండి. ఇప్పటికే జతచేయబడిన చాట్ ఫైల్‌తో మెయిల్‌బాక్స్ కనిపిస్తుంది.

*** మీ Android ఫోన్‌లో ఉన్నప్పుడు మీకు యాక్సిస్ ఉన్న ఇమెయిల్ ఐడిను నమోదు చేయండి. తరువాత సెండ్ ఎంపిక మీద నొక్కండి.

*** మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అందుకొని ఇమెయిల్‌ను ఓపెన్ చేయండి. మెయిల్‌లో జతచేయబడిన చాట్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీరు మీ ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ కి బదిలీ చేయాల్సిన ప్రతి చాట్ కోసం ఈ ప్రక్రియ అవసరం. మీరు ఎక్సపోర్ట్ చేసే చాట్‌ల సంఖ్యను బట్టి మీరు ఇమెయిల్‌లతో ముగుస్తుంది.

*** మీరు ఇప్పటికే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే కనుక దాన్ని తొలగించి మరోసారి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. సెటప్ ప్రాసెస్‌ను ముగించండి మరియు పునరుద్ధరించడానికి ఎంపిక వచ్చినప్పుడు సెటప్‌ను పూర్తి చేయడానికి పునరుద్ధరించు ఎంపికను ఎంచుకొని 'నెక్స్ట్' ఎంపిక మీద క్లిక్ చేయండి.

*** ఇప్పుడు మీరు ఎక్సపోర్ట్ చేసిన అన్ని చాట్‌లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కనిపిస్తాయి

 

Best Mobiles in India

English summary
How to Transfer WhatsApp Chat Backup From iPhone to Android

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X