Home
How to

వాట్సాప్‌ కొత్త నంబర్‌కు మారుతున్నారా.. పాత చాట్‌ను ఎలా బదిలీ చేసుకోవాలో తెలుసా..!

పాత స్మార్ట్‌ ఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌ను మారాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే వాట్సాప్‌ నంబర్‌ను (Whatsapp) కూడా మార్చినప్పుడు మరియు అదే విషయాన్ని స్నేహితులు, బంధువులకు చెప్పాల్సి రావడం కూడా కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది.

పాత వాట్సాప్‌ నంబర్‌లోని చాట్, డాక్యుమెంట్లు, సహా అనేక వివరాలుంటాయి. అయితే ఆ వివరాలను కొత్త ఫోన్‌ నంబర్‌కు సులభంగా బదిలీ (Whatsapp Chat Transfer) చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో ప్రత్యేక ఫీచర్‌ ఉంది. ఈ చాట్‌ హిస్టరిని కొత్త ఫోన్ నంబర్‌కు బదిలీ చేసుకోవచ్చు.

how to transfer whatsapp chats to from old to new number

అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లోనే కొత్త వాట్సాప్ నంబర్‌కు మారాల్చి వచ్చినప్పుడు ఈ ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ చాలా సక్రమంగా పనిచేస్తుంది. అయితే మీరు పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారుతున్నప్పుడు పాత హ్యాండ్‌సెట్‌ డేటాను బ్యాకప్‌ చేసుకోవడం ఉత్తమం.

స్టెప్‌ 1 : తొలుత పాత స్మా్ర్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌ ను ఒపెన్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం ఆండ్రాయిడ్‌ ఫోన్ అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ కనిపించిన మూడు చుక్కలపై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అదే iOS అయితే కింద భాగంలో సెట్టింగ్స్‌ను గుర్తించవచ్చు.
స్టెప్‌ 3 : ఆ తర్వాత అకౌంట్‌పైన క్లిక్‌ చేసి Change Number ను ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది.

how to transfer whatsapp chats to from old to new number

స్టెప్‌ 4 : అనంతరం అక్కడ వచ్చిన సమాచారాన్ని సరిచూసుకోవాలి. నంబర్‌ను మార్చేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
స్టెప్‌ 5 : Next పైన క్లిక్‌ చేసి.. పాత, కొత్త ఫోన్‌ నంబర్లను నమోదు చేయాలి. అనంతరం నంబర్ల మార్పు విషయాన్ని ఫ్రెండ్స్‌, ఇతరులకు తెలియజేసేందుకు కొన్ని ఆప్షన్‌లు ఉంటాయి.
స్టెప్‌ 7 : ఆల్‌ కాంటాక్ట్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న అందరికి సమాచారం చేరిపోతుంది.

స్టెప్‌ 8 : చాట్‌ చేసిన వారితో మాత్రమే అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీతో పరస్పరం చాటింగ్‌ చేసిన వారికే సమాచారం వెళ్తుంది.
స్టెప్‌ 9 : Custom అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఎంపిక చేసిన వారికి మాత్రమే సమాచారం వెళ్తుంది. ఎంపిక పూర్తి చేసిన తర్వాత డేటా బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి.

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ మరియు సిమ్ కార్డు రెండింటిని మార్చాలని భావించినప్పుడు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ నుంచి డేటాను బ్యాకప్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఈ కింది ప్రక్రియను అనుసరించాలి.
స్టెప్‌ 1 : తొలుత వాట్సాప్‌ ఒపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

స్టెప్‌ 2 : అనంతరం చాట్‌ పైన క్లిక్‌ చేసి చాట్‌ బ్యాకప్‌ను ఎంచుకోవాలి. తర్వాత బ్యాక్‌ప్‌ ఎప్పుడు చేయాలని భావిస్తున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే రోజు, ప్రతి వారం, ప్రతి నెల.. ఇలా ఎప్పుడు బ్యాకప్‌ చేయాలని భావిస్తున్నారో ఎంపిక చేసుకోవాలి.

అనంతరం బ్యాకప్‌ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ డేటా అంతా ఫోన్ అంతర్గత స్టోరేజీలోకి బదిలీ అవుతుంది. అయితే బ్యాకప్‌ చేసే ముందు వీడియోలను కూడా బదిలీ చేసుకోవాలో లేదో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీడియోలతో బ్యాకప్‌ చేసుకొనేందుకు ఎక్కువ స్టోరేజీ కావాల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how to transfer WhatsApp chats to from old to new number here are the steps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X