Home
How to

WhatsApp చాట్‌లను టెలిగ్రామ్‌కు మార్చుకోవడం ఎలా??

వాట్సాప్ నుండి మరొక యాప్ లోకి మారాలని చూస్తున్న వినియోగదారులకు క్లౌడ్-బేస్డ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఒక మంచి ఎంపికగా ఉంది. ఇటీవలి అప్‌డేట్ లో భాగంగా ఈ మెసేజింగ్ యాప్ కొత్తగా మరొక ఫీచర్ ను జోడించింది. దీని యొక్క వివరాలలోకి వస్తే వాట్సాప్ వినియోగదారులు వారి యొక్క వ్యక్తిగత మరియు గ్రూప్ చాట్‌లను టెలిగ్రామ్‌కు సులభంగా బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. కావున మీరు టెలిగ్రామ్‌కు మారాలని చూస్తూ ఉంటే కనుక మీకు ఇష్టమైన వారి వాట్సాప్ చాట్ మొత్తం కావాలనుకుంటే కనుక సులభంగా పొందవచ్చు. క్రింద పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీ యొక్క డేటాను పొందవచ్చు.

How to Transfer WhatsApp Users Individual and Group Chats to Telegram

*** మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి.

*** ఇప్పుడు మీరు టెలిగ్రామ్‌కు బదిలీ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయండి.

*** ఇప్పుడు చాట్ విండో యొక్క కుడివైపు ఎగువ మూలలో గల మూడు చుక్కల డాట్ మెను మీద క్లిక్ చేయండి.

How to Transfer WhatsApp Users Individual and Group Chats to Telegram

*** ఇందులో డ్రాప్ డౌన్ విండోను సరిగ్గా గమనించి అందులో గల 'మోర్' ఎంపిక మీద నొక్కండి.

*** తరువాత దశలో 'ఎక్సపోర్ట్' ఎంపిక మీద నొక్కాలి.

*** మీరు చాట్ లోని మీడియా ఫైల్‌లను ఎక్సపోర్ట్ చేయాలనుకుంటున్నారా అని యాప్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది. మీ అవసరం ప్రకారం మీరు అవును అని ఎంచుకోవలసి ఉంటుంది.

*** ఏదైనా ఒక ఎంపికను ఎంచుకున్న తరువాత మీరు వాట్సాప్ మెనుని గమనించవచ్చు. అలాగే ఆ ప్రక్రియను ప్రారంభించడానికి మీరు టెలిగ్రామ్‌లో నొక్కాలి.

*** టెలిగ్రామ్‌లో ట్యాప్ చేసిన తర్వాత క్లౌడ్-బేస్డ్ మెసేజింగ్ యాప్ ఓపెన్ చేయబడుతుంది. మీరు చూడాలనుకునే చాట్‌ను ఎంచుకోమని అడుగుతుంది.

*** మీరు చాట్‌ను ఎంచుకుని ఆ తరువాత ఇంపోర్ట్ ఎంపిక మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇది మీ వాట్సాప్ చాట్‌ను పూర్తిగా ఆండ్రాయిడ్ కి బదిలీ చేస్తుంది.

How to Transfer WhatsApp Users Individual and Group Chats to Telegram

గమనిక

** మీరు చాట్‌లను ఒక్కొక్కటిగా ఎగుమతి చేయాల్సి ఉంటుందని గమనించండి. వాట్సాప్ గ్రూపులకు కూడా ఇది పని చేస్తుంది. ఇంపోర్ట్ అయిన మెసేజ్ లు వాటి అసలు టైమ్‌స్టాంప్‌లతో కూడా ఉంటాయి. మీ చాట్‌ల తేదీలు మరియు సమయాల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీని అర్థం.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Transfer WhatsApp Users Individual and Group Chats to Telegram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X