WhatsApp చాట్‌లను ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్‌కి బదిలీ చేయడం ఎలా?

|

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం అనేది సర్వసాధారణం అయింది. అయితే ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వంటి రెండు విభాగాలు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఐఫోన్ ని కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. అయితే వినియోగదారులకు సమస్య కలిగించే వాటిలో మొదటిది ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్‌కు మారినప్పుడు వాట్సాప్ యొక్క చాట్ లను కోల్పోవడం. అయితే దీనికి పరిష్కారం కొనుగొనడంలో వాట్సాప్ ఒక అడుగు ముందుకు వేసింది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ ఇప్పుడు వినియోగదారులు తమ వాట్సాప్ చాట్ హిస్టరీని బదిలీ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇందులో టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్ మెసేజ్‌లు వంటి అన్నిటిని కూడా తమ ఆండ్రాయిడ్ ఎనేబుల్డ్ డివైజ్ నుండి ఐఫోన్‌లకు బదిలీ చేయడానికి అనుమతిని ఇస్తాయి.

 

వాట్సాప్ చాట్ హిస్టరీ

వాట్సాప్ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్‌లకు బదిలీ చేసే డెవలప్‌మెంట్‌ను ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు "మేము ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ యొక్క ఫోన్‌ల మధ్య సురక్షితంగా మారడానికి అవకాశం కల్పిస్తున్నాము. మీ వాట్సాప్ చాట్ హిస్టరీలో ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్ మెసేజ్‌లను ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ మధ్య బదిలీ చేయగల ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సామర్థ్యాన్ని వాట్సాప్ కి జోడిస్తున్నాము. ముందు నుంచి అత్యధిక మంది అభ్యర్థించిన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మేము గత సంవత్సరం iPhone->Android మారే సామర్థ్యాన్ని ప్రారంభించాము మరియు ఇప్పుడు Android-> iPhoneని కూడా జోడిస్తున్నాము." అని ప్రకటించాడు.

WhatsApp చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుండి iOSకి మార్చడానికి కావలసిన అవసరాలు
 

WhatsApp చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుండి iOSకి మార్చడానికి కావలసిన అవసరాలు

** ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ OS లాలిపాప్‌లో రన్ అయ్యే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతూ ఉండాలి.

** iOS 15.5 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లో రన్ అయ్యే ఐఫోన్ ని కలిగి ఉండాలి.

** మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన iOS యాప్‌కి తరలించండి.

** మీ ఐఫోన్‌లో వాట్సాప్ యొక్క iOS వెర్షన్ 2.22.10.70 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి.

** మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.7.74 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి.

** మీ రెండు పరికరాలు తప్పనిసరిగా పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేయబడి ఉండాలి.

** మీ రెండు పరికరాలను తప్పనిసరిగా ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయాలి.

 

వాట్సాప్ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుండి iOSకి బదిలీ చేసే విధానం

వాట్సాప్ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుండి iOSకి బదిలీ చేసే విధానం

గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ OSలో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్ నుండి ఐఫోన్‌లకు మారాలని ప్లాన్ చేస్తుంటే కనుక వాట్సాప్ చాట్ హిస్టరీని బదిలీ చేయడానికి ఈ దశలను అనుసరించండి.

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో 'Move to iOS' యాప్‌ని ఓపెన్ చేసి స్క్రీన్‌పై ప్రాంప్ట్‌లను అనుసరించండి.

స్టెప్ 2: మీ ఐఫోన్‌లో ఒక కోడ్ ప్రదర్శించబడుతుంది. ప్రాంప్ట్ చేసినప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కోడ్‌ని నమోదు చేయండి.

స్టెప్ 3: కంటిన్యూ ఎంపిక మీద నొక్కండి మరియు ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను అనుసరించండి.

స్టెప్ 4: ట్రాన్సఫర్ డేటా స్క్రీన్‌లో వాట్సాప్ ని ఎంచుకోండి.

స్టెప్ 5: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టార్ట్ బటన్‌ను నొక్కండి. అలాగే ఎక్సపోర్ట్ కోసం డేటాను సిద్ధం చేయడానికి వాట్సాప్ కోసం వేచి ఉండండి. తర్వాత డేటా సిద్ధమైన తర్వాత మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుండి సైన్ అవుట్ చేయబడతారు.

స్టెప్ 6: ఇప్పుడు మూవ్ టు iOS యాప్‌కి తిరిగి రావడానికి నెక్స్ట్ బటన్‌ను నొక్కండి.

స్టెప్ 7: మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుండి మీ ఐఫోన్ కి డేటాను బదిలీ చేయడానికి 'కంటిన్యూ' బటన్‌ను నొక్కండి. అలాగే డేటా మొత్తం iOSకి ట్రాన్సఫర్ పూర్తయినట్లు నిర్ధారించే వరకు వేచి ఉండండి.

స్టెప్ 8: యాప్ స్టోర్ నుండి వాట్సాప్ తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 9: వాట్సాప్ ఓపెన్ చేసి మీ పాత ఆండ్రాయిడ్ పరికరంలో ఉపయోగించిన అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.

స్టెప్ 10: ప్రాంప్ట్ చేసినప్పుడు 'స్టార్ట్' ఎంపికను నొక్కండి మరియు ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతించండి.

 

Best Mobiles in India

English summary
How to Transfer Your WhatsApp Chat History From Android to iOS

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X