Instagram DMలను ఆటోమేటిక్‌గా మాతృభాషలోకి ట్రాన్సలేట్ చేయడం ఎలా?

|

మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ టిక్‌టాక్ కి పోటీగా రీల్స్ ని ప్రారంభించి అధిక మంది వినియోగదారులను ఆకట్టుకున్నది. ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌లు (DMలు) ప్లాట్‌ఫారమ్‌కు చాలా ముఖ్యమైనవిగా మారాయి. DMలు పీర్-టు-పీర్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడతాయి. అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ కూడా తమ కస్టమర్‌లతో కమ్యూనికేట్ చేయడానికి దీనిని ఉపయోగిస్తాయి. వినియోగదారులు వారి యొక్క ప్రాంతీయ భాషలో కమ్యూనికేట్ చేస్తూఉంటారు. ఇన్‌స్టాగ్రామ్ అటువంటి పరిస్థితిని గుర్తించి నిర్దిష్ట చాట్‌లో షేర్ చేయబడిన ప్రతి మెసేజ్ ని వినియోగదారుల యొక్క వారి భాషలోకి అనువదించగలిగే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

 
How to Translate Instagram DMs Automatically to Your Mother Tongue Language

Instagramలో DMలను స్వయంచాలకంగా అనువదించే విధానం

 

** మీరు అనువదించాలనుకునే బిజినెస్ టెక్స్ట్‌ల యొక్క చాట్‌ను ఓపెన్ చేయండి.

** పైన ఉన్న బిజినెస్ పేరుపై నొక్కండి.

** మీరు థీమ్, వానిష్ మోడ్ మరియు మోర్ వంటి బహుళ ఎంపికలతో కూడిన చాట్స్ సెట్టింగ్‌ల పేజీని చూస్తారు.

** 'మోర్ యాక్షన్' బటన్‌ కోసం క్రిందికి స్క్రోల్ చేసి దానిపై నొక్కండి.

** మీరు మోర్ యాక్షన్ ను ఓపెన్ చేసిన తర్వాత మీరు అన్ని మెసేజ్లను మీ యొక్క మాతృ భాషకు అనువదించే ఎంపికను చూస్తారు. 'Translate messages' ఎంపికపై టోగుల్ చేయండి.

** టోగుల్ చేసిన తరువాత బిజినెస్ అకౌంట్ ద్వారా పంపబడిన అన్ని మెసేజ్లు మీరు ఇష్టపడే భాషలోకి అనువదించబడతాయి.

** మీరు చాట్‌లో చదవడానికి వీలుగా మీ యొక్క భాషలో టెక్స్ట్ ని చూడగలరు.

మీరు Instagramలో ఉపయోగించే ప్రాథమిక భాషను కూడా మార్చవచ్చు. మీరు Instagram యాప్‌లో ఉపయోగించే భాషను మార్చడానికి, మీరు మీ భాష సెట్టింగ్‌లను సర్దుబాటు చేయవచ్చు.

Instagram యాప్‌లో ప్రాథమిక భాషను మార్చే విధానం

How to Translate Instagram DMs Automatically to Your Mother Tongue Language

** మీ ప్రొఫైల్‌ ఎంపిక కోసం వెళ్లడానికి దిగువ భాగంలో కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా మీ ప్రొఫైల్ ఫోటో మీద నొక్కండి.

** ఎగువభాగంలో కుడివైపున గల మోర్ ఎంపికల మీద నొక్కండి ఆపై సెట్టింగ్‌ల ఎంపికని ఎంచుకోండి.

** అకౌంట్ ఎంపిక మీద నొక్కండి. తరువాత లాంగ్వేజ్ ఎంపిక మీద నొక్కండి.

** మీరు ఉపయోగించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.

** iPhone లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో మీరు ఉపయోగించే భాషను మార్చడానికి ముందుగా మీరు మీ ఐఫోన్ యొక్క సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయాలి.

** మీ ప్రొఫైల్‌కి వెళ్లడానికి దిగువభాగంలో కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా మీ ప్రొఫైల్ ఫోటో మీద నొక్కండి.

** కుడివైపు ఎగువ భాగంలో ఉన్న మోర్ ఎంపికల మీద నొక్కండి. ఆపై సెట్టింగ్‌ల ఎంపిక మీద నొక్కండి.

** అకౌంట్ ఎంపిక మీద నొక్కండి. ఆపై లాంగ్వేజ్ ఎంపిక మీద నొక్కండి.

** కంటిన్యూ ఎంపిక మీద నొక్కండి మరియు స్క్రీన్‌పై సూచనలను అనుసరించండి.

Best Mobiles in India

English summary
How to Translate Instagram DMs Automatically to Your Mother Tongue Language

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X