ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియోలను ట్రిమ్ చేయటం ఎలా..?

దాదాపుగా మార్కెట్లో లభ్యమవుతోన్న అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మంచి క్వాలిటీ కెమెరాలతోనే వస్తున్నాయి. ఈ కెమెరాల ద్వారా ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు మరింత పర్‌ఫెక్ట్‌గా కనిపించాలంటే కస్టమరీ టచప్ అనేది అవసరం. అంటే, వాటిని కావల్సిన విధంగా ఎడిట్ చేసుకోవటం అన్నమాట.

జియో కొత్త ఆఫర్లు , మరికొద్ది గంటల్లోనే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియోలను ట్రిమ్ చేయవల్సి ఉంటుంది

వీడియో ఎడిటింగ్ ప్రక్రియలో భాగంగా కొన్ని సందర్భాల్లో వీడియోలను ట్రిమ్ చేయవల్సి ఉంటుంది. వీడియో ఎడిటింగ్ అనేది పాత వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే కొత్త వర్షన్ ఫోన్‌లలో చాలా సులువుగా ఉంటుంది.

మోడ్రన్ వర్షన్ ఫోన్‌లలో...

మోడ్రన్ వర్షన్ ఫోన్‌లలో ఎడిటింగ్, ట్రిమ్మింగ్ టూల్స్ మరింత సులభతరంగా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియోలను ఎడిట్ లేదా ట్రిమ్ చేసేందుకు స్టెప్ టు స్టప్ ప్రొసీజర్....

స్టెప్ 1

ముందుగా మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ అయిన తరువాత,  వీడియో క్రింద కనిపించే పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2

పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియోకు సంబంధించిన టైమ్‌‌లైన్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఫ్రేమ్స్ రూపంలో కనిపిస్తుంది.

డ్యుయల్ కెమెరా ఫోన్‌ల గురించి 7 ఆసక్తికర విషయాలు

స్టెప్ 3

వీడియో టైమ్‌‌లైన్ ఫ్రేమ్స్‌కు సంబంధించిన ఎడ్జులను కావల్సిన విధంగా డ్రాగ్ చేసుకుంటూ వీడియోలో కావల్సిన ఫ్రేమ్స్ మాత్రమే ఉండేలా చూసుకోండి.

స్టెప్ 4

ట్రిమ్ కాబడిన వీడియోను వేరొక పేరుతో సేవ్ చేసుకున్నట్లయితే ఆ వీడియో గ్యాలరీలో సేవ్ కాబడుతుంది.

పోటాపోటీగా 4G Volte ఫోన్‌లు రిలీజ్, రూ.4000లోపే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to trim or shorten your videos on Android phone. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting