Google Reply chat bot ఉపయోగించడం ఎలా ?

|

సోషల్ మీడియా అప్లికేషన్లలో వచ్చే మెసేజెస్ కు రిప్లైస్ ఇవ్వడానికి, మరియు మంచి రిప్లైస్ సజెస్ట్ చెయ్యడానికి కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన Google Reply అప్లికేషన్, అనతి కాలంలోనే వినియోగదారుల అభిమానాన్ని చూరగొంది. Google, ఈ Google reply అప్లికేషన్ యొక్క beta టెస్టింగ్ కోసం గతవారం రిలీజ్ చేసింది. ఈ అప్లికేషన్ apkmirror వెబ్ సైట్ లో మీకోసం ముందుగానే అందుబాటులో ఉంది. దీనిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రయత్నించి చూడండి.

లింక్ ఇదే. https://www.apkmirror.com/apk/google-inc/reply/reply-1-0-187136053-release/reply-1-0-187136053-android-apk-download/

ఈ అప్లికేషన్ కి కొన్ని మొబైల్స్ సపోర్ట్ అవడం లేదు, గమనించగలరు. మీరు ఇదివరకు APK ఫైల్ ను ఇన్స్టాల్ చెయ్యని ఎడల, మీకోసం ఈ విధానాన్ని కూడా పొందుపరిచాము. ఈ అప్లికేషన్ ను పూర్తిగా పరీక్షించిన తర్వాతే దీనిపై వివరణ ఇవ్వడం జరిగినది. సెక్యూరిటీ సంబంధమైన సమస్యలు ఏవీ లేనప్పటికీ, APK ఫైల్ ఇన్స్టాల్ చెయ్యడం మీ సొంత పూచీకత్తుతో కొనసాగించవలసి ఉంటుంది.

 

ఇండియాకి మరో 2 రోజుల్లో Xiaomi Mi TV 4A, ధర ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

ఇన్స్టాల్ చేయ్యండిలా:

ఇన్స్టాల్ చేయ్యండిలా:

మీరు ఈ అప్లికేషన్ ను పైన ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసిన తర్వాత , మొబైల్ లో ఈ అప్లికేషన్ ను ఉంచి, సెట్టింగ్స్ లో, సెక్యూరిటీలో "unknown sources" ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాతనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయుటకు సాధ్యమవుతుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాక , యధావిధిగా "unknown sources" ను టర్న్ ఆఫ్ చెయ్యండి.

అప్లికేషన్ ఇన్స్టాల్

అప్లికేషన్ ఇన్స్టాల్

అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత, మిమ్ములను మీ గూగుల్ ఖాతాతో అనుసంధానం చేయమని కోరుతుంది. గూగుల్ ఖాతాతో అనుసందానం చేసిన తర్వాత నోటిఫికేషన్, లొకేషన్ మరియు కాలెండర్ access ను కూడా ఇవ్వమని అడుగుతుంది. లొకేషన్ యాక్సెస్ తీసుకున్నందున, లొకేషన్ సజెషన్(work or home ) ఇస్తుందని భావించినట్లు ఇది పనిచెయ్యలేదు. మేము పరీక్షించినప్పుడు where are you? అన్న ప్రశ్నకు లొకేషన్ సజెషన్ ఇవ్వకుండా "At home " , "here" , "i'm here " అను సజెషన్లను మాత్రమే చూపింది. ఇంకా ఫీచర్లను add చేయవలసి ఉన్నది.

కొన్ని ప్రత్యేకమైన పనులను
 

కొన్ని ప్రత్యేకమైన పనులను

ఈ అప్లికేషన్ అనేకరకాల ఎంపికలను అందించడంతో పాటు, కొన్ని ప్రత్యేకమైన పనులను కూడా చేస్తుంది. ఈ అప్లికేషన్ మీ పని గంటలను అంచనా వేసి మీరు ఆఫీస్ లో లేని సమయంలో కూడా సరైన ప్రత్యుత్తరాలను పంపడం వంటివి చేస్తుంది. అదేవిధంగా తక్షణ సహాయం(emergency) అభ్యర్ధనలకు ప్రత్యేకించబడిన సౌండ్ ప్లే చెయ్యడం, ఎవరైనా హలో చెప్పినప్పుడు what's up? వంటి మెసేజెస్ పంపడం వంటివి చేస్తుంది. కాని దురదృష్టవశాత్తు స్థానభరిత(location based) ప్రత్యుత్తరాల వలె, ఇవి కూడా పూర్తిస్థాయి అందుబాటులోకి రాలేదు.

అప్లికేషన్ అవసరాల దృష్ట్యా..

అప్లికేషన్ అవసరాల దృష్ట్యా..

ఈ అప్లికేషన్ సెట్టింగ్స్ లో కొన్ని సెలెక్ట్ చేయబడి ఉండవు, అప్లికేషన్ అవసరాల దృష్ట్యా అవసరమైనప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకోమని Google మిమ్ములను కోరుతుంది. మీరు మొత్తం కాన్ఫిగర్ చేసిన తర్వాత ఏదైనా మెసేజ్ కోసం ఎదురుచూడడం కన్నా డెమోగా మీకు మీరే వేరే మొబైల్ ద్వారా whatsapp మెసేజ్ ప్రయత్నించడం కాని చెయ్యవచ్చు. తద్వారా ఈఅప్లికేషన్, ఆటోమేటిక్ గా మెసేజెస్ పంపడం కాని, 3 ఎంపిక చేయబడిన ప్రత్యుత్తరాలను చూపడం కాని చేస్తుంది.

automatic replies

automatic replies

ఈ స్వయంచాలక ప్రత్యుత్తరాలు(automatic replies) కేవలం నోటిఫికేషన్ బార్ వద్దనే చూపెడుతుంది. కావున ప్రత్యేకంగా నిర్దేశించిన అప్లికేషన్ ఓపెన్ చేసి ప్రత్యుత్తరాన్ని పంపవలసిన అవసరం లేదు. మా అనుభవంలో ఈ ఆటోమేటిక్ రిప్లైస్ మెసేజెస్ వచ్చిన వెంటనే కనపడలేదు. మెసేజ్ సంబంధిత అప్లికేషన్ నోటిఫికేషన్ కనుమరుగయ్యాక ఈ Google replies చాట్ బాట్ నోటిఫికేషన్ బార్ లో సజెషన్స్ తో చూపెడుతుంది. ఒక చిన్న అసౌకర్యం అయినప్పటికీ ఇది త్వరలోనే పరిష్కారం అవుతుంది అని ఆశిస్తున్నాం.

ఆ రిప్లైని కాన్సిల్(undo) చేసి వేరే మెసేజ్ ..

ఆ రిప్లైని కాన్సిల్(undo) చేసి వేరే మెసేజ్ ..

ఈ అప్లికేషన్ ద్వారా ఇచ్చిన రిప్లై, కొన్ని సెకండ్లు ఆగి పంపబడుతుంది. దీని కారణాన ఏక్షణాన అయినా ఆ రిప్లైని కాన్సిల్(undo) చేసి వేరే మెసేజ్ పంపవచ్చు. దీని ద్వారా ఒక్కోసారి అనుకోకుండా పంపిన సందేశాల వలన ఇబ్బందులపాలయ్యే సమస్యలు తప్పుతాయి. మీరు ప్రత్యుత్తరం ఇవ్వవలసినది అని అప్లికేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేస్తుంది. ఈ సజెస్ట్ చెయ్యబడిన ప్రత్యుత్తరాలు అర్ధవంతముగా అందంగా రాయబడి ఉండడం వలన సంబంధాలను దెబ్బతినకుండా చూస్తుంది. ఒక్కోసారి మన ప్రత్యుత్తరాలను దృష్టిలో ఉంచుకుని కూడా సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది.

whatsapp, Hangouts, Slack ..

whatsapp, Hangouts, Slack ..

మేము ఫేస్బుక్ మెసెంజర్ , whatsapp, Hangouts, Slack అప్లికేషన్ల పై పరీశీలించి చూశాము. బాగా పనిచేసింది. కాని ఇది twitter డైరెక్ట్ రెప్లై, ఆండ్రాయిడ్ మెసేజెస్ అప్లికేషన్ కు కూడా పని చేస్తుంది.

కాగా ఈ అప్లికేషన్ సరదాగానే ఉంటుంది. కాని ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉన్న కారణాన, అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. త్వరలో మరిన్ని ఫీచర్లతో ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ ముంగిట అడుగుపెట్టబోతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to try Google Reply the new social media chatbot that pretends to be you More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X