అమెజాన్‌లో వస్తువులు కొనే ముందు శాంపిల్స్ ట్రై చేయడం ఎలా..?

|

ఆన్ లైన్ లో సరికొత్త షాపింగ్ అనుభూతి అందించేందుకు అమెజాన్ కొత్త కొత్త ఆఫర్లు, ఫీచర్లతో ముందుకు వస్తోంది. ఇఫ్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం మరిన్ని సౌలభ్యాలు దక్కేందుకు ఫ్రీ శాంపిల్స్ స్కీం ను మొదలు పెట్టింది. మనం ఏదైనా ఒక ప్రాడెక్టు వాడే ముందు దానికి సంబంధించిన శాంపిల్ లభిస్తే దాన్ని వాడిన తరువాత నచ్చితే ఇక ముందు ఆ ప్రాడెక్టు కంటిన్యూ చేద్దాం అనుకుంటాం. చాలా మంది కస్టమర్లకు ఇలాంటి కోరికలు ఉండటం సహజమే. కస్టమర్ల మనసును తెలుసుకున్న అమెజాన్ ఇప్పుడు ఫ్రీ శాంపిల్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. అయితే ఈ స్కీం అందరికీ కాదండోయ్ ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే ప్రత్యేకం.

 

సిమ్ లేని స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్, సిమ్‌కి RIP చెప్పేయండిక !సిమ్ లేని స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్, సిమ్‌కి RIP చెప్పేయండిక !

 అమెజాన్ ప్రైమ్ శాంపిల్స్

అమెజాన్ ప్రైమ్ శాంపిల్స్

మనకు నచ్చిన బ్యూటీ క్రీమ్, స్కిన్ కేర్, ఏదైనా ఫుడ్ ఐటమ్ ను ఫ్రీగా శాంపిల్ పొందడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం. సాధారణంగా కొన్ని ప్రాడెక్ట్స్ చాలా ఎక్కువ రేట్ ఉండటం లేదా మార్కెట్లోకి కొత్తగా వచ్చి ఉంటాయి. వాటిని టెస్ట్ చేయకుండా కొనాలంటే మనసు ఒప్పుకోదు. 

ప్రైమ్ మెంబర్స్ కు

ప్రైమ్ మెంబర్స్ కు

అలాంటి సమయంలోనే ప్రైమ్ మెంబర్స్ కు సదరు ఖరీదైన, లేదా కొత్త ప్రాడెక్టును చాలా తక్కువ ధరలో శాంపిల్ పొందే వీలుంది. అంటే మీరు కొనాలనుకున్న ప్రాడెక్టు ధర ఓ రూ.200 వందల ఉంది అనుకుంటే దానికి సంబంధించిన శాంపిల్ మీరు 2 లేదా 3రూ.లలో దొరుకుతుంది. ఇంకేంటి ఆ శాంపిల్ తెచ్చుకొని వాడుకోవచ్చు. వాడిన అనంతరం మీకు నచ్చితే మొత్తం ప్రాడెక్టును తెప్పించుకోవచ్చు.

పూర్తి ధరతో అసలు ప్రాడక్టు కొన్నట్లయితే
 

పూర్తి ధరతో అసలు ప్రాడక్టు కొన్నట్లయితే

అంతేకాదు మీరు పూర్తి ధరతో అసలు ప్రాడక్టు కొన్నట్లయితే మీరు ఇంతకు ముందు కొనుగోలు చేసిన శాంపిల్ ధరను ఈ మెయిన్ ప్రాడక్టులో డిస్కౌంట్ చేస్తారు. అంటే మీరు ఫ్రీగా శాంపిల్ పొందినట్లే.. మీరు కొనుగోలు చేసిన శాంపిల్ ధరను అమెజాన్ క్రెడిట్ గా పరిగణిస్తారు.

అమెజాన్ శాంపిల్ వాడుకోండిలా ?

అమెజాన్ శాంపిల్ వాడుకోండిలా ?

- ఈ స్కీమ్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స కు మాత్రమే లభ్యం

- శాంపిల్స్ పొందిన సమయంలో షిప్పింగ్ కూడా ఉచితం, 3-5 రోజుల్లో డెలివరీ అవ్వచ్చు

- మీరు ఎన్ని శాంపిల్స్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఒకే ప్రాడెక్టువి ఒకటి కన్నా ఎక్కువ శాంపిల్స్ కొనుగోలు చేసేవీలులేదు.

- మీరు కొన్న శాంపిల్స్ అమౌంట్ ను అమెజాన్ క్రెడిట్ గా పరిగణిస్తారు.

- అయితే ఈ క్రెడిట్ ను 180 రోజుల్లోగా వినియోగించుకోవాలి.

 

 ప్రస్తుతం ఎక్కువగా

ప్రస్తుతం ఎక్కువగా

ప్రస్తుతం ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్, ఆహార, పానీయాలు, పర్సనల్ కేర్ కు సంబంధించిన ఉత్పత్తుల శాంపిల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ సౌకర్యాలను వినియోగించుకోండి..

 

 

Best Mobiles in India

English summary
How to Try Samples of Amazon Items Before You Buy More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X