యూట్యూబ్‌లో ఆటోప్లే ఫీచర్‌ను "Turn Off "చేసుకోవడం ఎలా ?
మార్కెట్లోకి కొత్తకొత్త వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లు పుట్టుకొస్తున్నప్పటికి యూట్యూబ్ హవాను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి.
మార్కెట్లోకి కొత్తకొత్త వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లు పుట్టుకొస్తున్నప్పటికి యూట్యూబ్ హవాను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. ప్రకటనల రూపంలో గూగుల్‌కు కాసలు వర్షం కురిపిస్తున్న యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. వీరిని మెప్పించేందుకు వేల సంఖ్యలో వీడియోలు ఇక్కడ జనరేట్ అవుతూనే ఉంటాయి.ఈ నేపథ్యం లో మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీడియోలు ఆటో ప్లే అవుతూ ఉంటాయి దీని వల్ల మనం చూడాలనుకున్న వీడియోస్ ను చూడకముందే డేటా అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ శీర్షికలో భాగంగా యూట్యూబ్ ఆటో ప్లే ఫీచర్ ను "Turn Off" ఎలా చేసుకోవాలో మీకు తెలుపుతున్నాము.

మొదట యూట్యూబ్ యాప్ ను అప్ డేట్ చేయండి:
1. గూగుల్ ప్లే స్టోర్ లో యూట్యూబ్ యాప్ ను ఓపెన్ చేయండి.
2.యూట్యూబ్ యాప్ 'ఇన్స్టాల్' బదులుగా 'అప్డేట్' బటన్ను ప్రదర్శిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
3. అప్ డేట్ బటన్ ను ప్రెస్ చేసి లేటెస్ట్ వెర్షన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

యాప్ లో ఆటో ప్లే ఫీచర్ ను ఎలా డిసేబుల్ చేయాలి :
1. షార్ట్ కట్ ద్వారానో లేక లాంచర్ ద్వారానో యూట్యూబ్ యాప్ ను ఓపెన్ చేయండి.
2. టాప్ కార్నెర్ దగ్గర ఉన్న అవతార్ ను క్లిక్ చేయండి.
3. అది మిమ్మలను అకౌంట్ సెక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది.
4. "Settings"ను క్లిక్ చేయండి.
5. "Auto-Play "అని ఉన్న ఆప్షన్ ను ఓపెన్ చేయండి.
6. "Autoplay next video"అనే toggle ఆప్షన్ మీకు కనిపిస్తుంది అది క్లిక్ చేయండి .

వెబ్ వెర్షన్ లో యూట్యూబ్ ఆటో ప్లే ఫీచర్ ను ఎలా డిసేబుల్ చేయాలి :
మీరు యూట్యూబ్ ను యాక్సిస్ చేయడానికి వెబ్ వెర్షన్ ను ఉపయోగిస్తుంటే చాలా సింపుల్ గా డిసేబుల్ చేసుకోవచ్చు మీ కుడి పక్కన ఉన్న 'Up Next' దగ్గర లిస్ట్ అఫ్ వీడియోస్ మరియు టైటిల్స్ ను గమనించండి అలాగే కుడి పక్కన "Autoplay next video"అనే toggle ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే ఆటో ప్లే ఫీచర్ "Turn Off " అయిపోతుంది.


Click it and Unblock the Notifications








