'Ok Google' వాయిస్ కమాండ్‌ను మీ పిక్సెల్ ఫోన్‌లలో ఆఫ్ చేయడం ఎలా?
టెక్నాలజీ అనేది రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నది. స్మార్ట్ ఫోన్లు మరియు స్మార్ట్ పరికరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత మీ యొక్క సందేహాలకు సమాదానాలు కనుగొనడానికి మరియు వాటిని పరిష్కరించుకోవడానికి గూగుల్ అసిస్టెంట్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఫోన్‌లలో గల గూగుల్ అసిస్టెంట్‌తో మీరు విభిన్న ప్రశ్నలు అడగవచ్చు, ఇంటిలో గల ఇతర స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించవచ్చు మరియు ముఖ్యంగా విద్యార్థులు తం యొక్క మాథ్స్ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీరు పిక్సెల్ డివైస్ ని కలిగి ఉన్నప్పుడు సహాయకారిగా కూడా ప్రతిస్పందిస్తుంది.

గూగుల్ అసిస్టెంట్ మరియు పిక్సెల్ ఫోన్ రెండింటిలోనూ ఒకే రకమైన టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసింది. కావున మీ పిక్సెల్ డివైస్లో గూగుల్ అసిస్టెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే మీరు మీ ఇంట్లో అనేక గూగుల్ హోమ్ డివైస్లను కలిగి ఉంటే కనుక వాయిస్ కమాండ్ ను ఉపయోగించాలనుకున్నప్పుడు మీరు -"Ok Google" అని చెప్పినప్పుడు అవన్నీ ఒకేసారి మేల్కొంటాయి. కావున మీరు "Ok Google" ఫీచర్‌ని మీ ఫోన్లో ఆఫ్ చేసి గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయడానికి ఫోన్ పవర్ కీని ఉపయోగించాలనుకుంటే కనుక ఈ పద్దతులను ఎలా అనుసరించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
పిక్సెల్ ఫోన్‌లలో "హే గూగుల్"ని ఆఫ్ చేసే విధానం

1. మీ పిక్సెల్ ఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
2. క్రిందికి స్క్రోల్ చేసి 'Apps' ఎంపికను కనుగొని దానిపై నొక్కండి.
3. ఇందులో 'అసిస్టెంట్' ఎంపికను కనుగొని దానిపై క్లిక్ చేయండి.
4. తరువాత "హే గూగుల్" ఎంపికపై క్లిక్ చేయండి.
5. చివరగా మీ పిక్సెల్ ఫోన్‌లో కమాండ్‌ను ఆఫ్ చేయడానికి "Ok Google" పక్కన ఉన్న టోగుల్ బటన్‌పై నొక్కండి.
ఈ పద్దతులను అనుసరించడంతో "Hey Google" ఫంక్షనాలిటీ డిసేబుల్ చేయబడుతుంది. దీని కారణంగా మీరు వాయిస్ కమాండ్ ద్వారా అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయలేరు. అయితే మీరు గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయడానికి పవర్ బటన్‌ని ఉపయోగించవచ్చు.
పిక్సెల్ ఫోన్‌లలో "Hey Google"ని యాక్టివేట్ చేయడానికి పవర్ బటన్‌ని ఉపయోగించే విధానం

1. ముందుగా మీ పిక్సెల్ ఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
2. క్రిందికి స్క్రోల్ చేసి 'సిస్టమ్' ఎంపికను కనుగొని దానిపై నొక్కండి.
3. తరువాత 'Gestures' ఎంపికను కనుగొని దానిపై నొక్కండి.
4. దిగువకు స్క్రోల్ చేసి 'పవర్ బటన్‌ను నొక్కి పట్టుకోండి' ఎంపికను కనుగొని దానిపై క్లిక్ చేయండి.
5. చివరగా అసిస్టెంట్ ఎంపిక కోసం హోల్డ్‌పై టోగుల్ చేయండి.
పైన తెలిపిన విధానాలను పాటించడంతో మీరు గూగుల్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయాలనుకునే సమయంలో మీ ఫోన్ పవర్ బటన్‌ను ప్రెస్ చేస్తే కనుక వెంటనే కమాండ్ యాక్టీవ్ అవుతుంది. దీనితో మీరు మీ ఇంటిలో ఉన్న ఇతర గూగుల్ హోమ్ పరికరాలకు "Ok Google" అని చెప్పినప్పుడు మీ ఫోన్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుందని మీరు చింతించాల్సిన పనిలేదు.


Click it and Unblock the Notifications