Facebook, Instagram,Twitterలో అవాంఛిత వీడియోలు ఆటోప్లే కాకుండా ఆఫ్ చేయడం ఎలా?
ప్రస్తుత రోజులలో ప్రజలు వీడియోలను చూడటానికి యూట్యూబ్ తో పాటు అనేక సోషల్ మీడియా వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లోని వీడియోలు వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు స్వయంచాలకంగా ప్లే చేయబడతాయి. సెల్ఫ్-ప్లే వీడియో ఫీచర్ అనేది వినియోగదారులకు కొద్దిగా ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది అనవసరమైన వీడియోలను స్వయంచాలకంగా ప్లే చేయడంతో మొబైల్ డేటాను అధికంగా వినియోగించడమే కాకుండా ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది. మీరు కావాలంటే ఈ ఫీచర్‌ను కూడా ఆఫ్ చేయవచ్చు. అలా చేయడంతో మీ యొక్క మొబైల్ డేటా ఆదా చేయబడుతుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Twitterలో ఆటొ -ప్లేయింగ్ వీడియోలను ఆఫ్ చేసే విధానం
స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ట్విట్టర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.
స్టెప్ 2: ఆపై సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: వీడియో విభాగంలో ఆటోప్లే ఎంపికకి వెళ్లి నెవర్‌పై క్లిక్ చేయండి.
iOS ప్లాట్‌ఫారమ్
స్టెప్ 1: కాగ్ (వీల్) చిహ్నంపై క్లిక్ చేయండి.
స్టెప్ 2: సెట్టింగ్‌లు -> డేటాపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: వీడియో ఆటోప్లేకి వెళ్లి, నెవర్‌పై క్లిక్ చేయండి.

Facebook ఆటో-ప్లేయింగ్ వీడియోలను ఆఫ్ చేసే విధానం
స్టెప్ 1: Facebook యాప్‌పై నొక్కండి మరియు స్క్రీన్ కుడివైపు ఎగువన గల మెను బటన్‌పై నొక్కండి.
స్టెప్ 2: సెట్టింగ్‌లు మరియు గోప్యత విభాగంను నొక్కిన తర్వాత సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్లాలి.
స్టెప్ 3: క్రిందికి స్క్రోల్ చేసి ‘మీడియా మరియు కాంటాక్ట్స్'పై ట్యాప్ చేయాలి.
స్టెప్ 4: ఆటోప్లే ఎంపికపై నొక్కి తర్వాత నెవర్ ఆటో ప్లే వీడియోను ఎంచుకొండి.
iOS ప్లాట్‌ఫారమ్ యాప్‌లో
స్టెప్ 1: Facebook యాప్‌ని ఓపెన్ చేసి స్క్రీన్ దిగువన చూపబడిన మెను బటన్‌పై నొక్కండి.
స్టెప్ 2: ఆపై సెట్టింగ్‌లు మరియు గోప్యతపై నొక్కండి ఆపై సెట్టింగ్‌లను ఎంచుకోండి.
స్టెప్ 3: ఇప్పుడు మీరు స్క్రోలింగ్‌లో మీడియా మరియు కాంటాక్ట్‌ల ఎంపికను కనుగొంటారు. ఇక్కడ మీరు ‘వీడియోలు మరియు ఫోటోలు'పై నొక్కాలి.
స్టెప్ 4: ఇప్పుడు మీరు ఇక్కడ చూపిన ఆటోప్లే ఎంపికను ఆఫ్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటోప్లే వీడియోలను ఆఫ్ చేసే విధానం
స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ప్రొఫైల్ పేజీకి వెళ్లండి.
స్టెప్ 2: కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: సెల్యులార్ డేటా వినియోగాన్ని ఎంచుకోండి.
స్టెప్ 4: తక్కువ డేటాపై క్లిక్ చేయండి.
iOS ప్లాట్‌ఫారమ్
స్టెప్ 1: ఇన్‌స్టాగ్రామ్‌లో కుడివైపు ఎగువ మూలలో ఉన్న కాగ్ (వీల్ ఐకాన్)పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: సెల్యులార్ డేటాపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆపై తక్కువ డేటాపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications