Home
How to

Google Chromeలో డార్క్ మోడ్‌ని ఆన్ చేయడం ఎలా?

ఇంటర్నెట్ ఉపయోగం ప్రస్తుత రోజులలో అధికంగా ఉంది. తెలియని విషయాల గురించి సెర్చ్ చేయడం కోసం అధిక మంది గూగుల్ ని ఆశ్రయిస్తున్నారు. గూగుల్ ని కూడా ఓపెన్ చేయడం కోసం అధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో ఒకటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్. సురక్షితమైన బ్రౌజింగ్ అనుభవం కారణంగా ఇందులో అన్ని కార్యాచరణలు సులభంగా చేయగలుగుతున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యాప్ థర్డ్-పార్టీ ఎక్స్‌టెన్షన్‌తో కాకుండా ఇన్‌బిల్ట్‌తో డార్క్ మోడ్‌ను కూడా అందిస్తుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో అధిక సమయం గడుపుతున్న వారు కంటి యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం Google Chromeలో డార్క్ మోడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఆన్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Google Chrome (Windows)లో డార్క్ మోడ్‌ను ఆన్ చేసే విధానం

Google Chrome (Windows)లో డార్క్ మోడ్‌ను ఆన్ చేసే విధానం

మీరు విండోస్ 11 లేదా 10 తో రన్ అయ్యే PC/ల్యాప్‌టాప్ ని వినియోగిస్తుంటే కనుక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సిస్టమ్-వైడ్ డార్క్ థీమ్‌కు మద్దతు ఇస్తుంది. దాని కోసం మీరు చేయాల్సిందల్లా సెట్టింగ్‌లకు వెళ్లి మీ PC/ల్యాప్‌టాప్ డార్క్ మోడ్‌ను మార్చడం.

1. మీ విండోస్ PC/laptopలో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.

2. 'Personalization' ఎంపిక కోసం వెతకండి మరియు దానిని ఓపెన్ చేయండి.

3. కలర్ ఎంపికపై ట్యాప్ చేయండి.

4. ఇప్పుడు మీ మోడ్‌ని ఎంచుకోండి ఎంపికలో "డార్క్" ఎంపికని ఎంచుకోండి.

ఈ పద్ధతిని అనుసరించిన తర్వాత మీ క్రోమ్ బ్రౌజర్ డార్క్ లేఅవుట్‌కు మారుతుంది.

 

Google Chrome (Mac)లో అంతర్నిర్మిత డార్క్ మోడ్‌ని ఆన్ చేసే విధానం

Google Chrome (Mac)లో అంతర్నిర్మిత డార్క్ మోడ్‌ని ఆన్ చేసే విధానం

1. ఎగువ భాగంలోని బార్‌లో గల ఆపిల్ మెనుపై క్లిక్ చేయండి.

2. సిస్టమ్ ప్రిఫరెన్స్ ఎంపికలను ఎంచుకోండి.

3. జనరల్‌ ఎంపికపై ట్యాప్ చేయండి.

4. ఇప్పుడు అప్పీరియన్స్ విభాగంలో "డార్క్" ఎంచుకోండి.

 

Google Chrome ఎక్స్టెన్షన్ లో డార్క్ మోడ్‌ని ఆన్ చేసే విధానం

Google Chrome ఎక్స్టెన్షన్ లో డార్క్ మోడ్‌ని ఆన్ చేసే విధానం

1. మీ PC/laptop/Macలో గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి.

2. chrome.google.com/webstoreకి వెళ్లండి.

3. ఇక్కడ 'డార్క్ థీమ్' ఎంపిక కోసం వెతకండి.

4. డిస్ప్లే చేసిన విభాగంలో డార్క్ మోడ్ ఉన్న ఏదైనా ఒక థీమ్‌ను ఎంచుకోండి (మీరు "Google Chrome కోసం డార్క్ థీమ్" పొడిగింపుని ప్రయత్నించవచ్చు).

4. ఇప్పుడు యాడ్ టు క్రోమ్‌పై క్లిక్ చేసి సెటప్ చేయనివ్వండి.

 

Best Mobiles in India

English summary
How to Turn on Dark Mode Feature on Google Chrome
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X