ఆండ్రాయిడ్ ఫోన్‌ను పూర్తిస్థాయి కంప్యూటర్‌లా మార్చటం ఎలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఎలాంటి పనినైనా చక్కబెట్టేయవచ్చు. మీరు తలచుకుంటే మీ చేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్ పూర్తిస్థాయి కంప్యూటర్‌లా కూడా మారిపోగలదు. అప్పడు మీ డివైస్‌ను మానిటర్, కీబోర్డ్ ఇంకా మౌస్‌లకు కనెక్ట్ చేసుకని ఎంచక్కా పూర్తిస్థాయి కంప్యూటింగ్‌ను ఆస్వాదించవచ్చు.

Read More : ఫోన్‌లలో వాడే ప్రాసెసర్‌ల గురించి ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Andromium OS యాప్‌ ద్వారా సాధ్యమే..

మార్కెట్లో అందుబాటులో ఉన్న Andromium అనే ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ సాధ్యమవుతోంది. ఈ ఆపరేటింగ్ సిస్టం మీ స్మార్ట్‌ఫోన్‌లో రన్ అవ్వాలంటే మీ డివైస్ Snapdragon 800 అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాసెసర్‌‌ను కలిగి ఉండాలి.

లాలీపాప్ ఆపై వర్షన్ ఫోన్‌లను..

ఇదే సమయంలో ర్యామ్ కెపాసిటీ కూడా 2జీబికి మించి ఉండాలి. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై వర్షన్ ఫోన్‌లను ఈ Andromium సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌ను కంప్యూటర్‌లా మార్చేవేసే ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ 1

ముందుగా Andromium OS యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఫోన్‌ను రీస్టార్ట్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 3

ఫోన్ తిరిగి ఆన్ అయి యాప్ ఓపెన్ అయిన తరువాత "App Usage Access" ఆప్షన్‌ను ఓకే చేసి యాక్సిస్ కల్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత యాప్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లను యాక్సిస్ చేసుకునేందుకు యాప్ నోటిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.

స్టెప్ 4

ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత Andromium OS యాప్ హోమ్ స్ర్కీన్ పై "OK" బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి చూసినట్లయితే Andromium OS మీ ఫోన్‌లో రన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఆ నోటిఫికేషన్ పై క్లిక్ చేసినట్లయితే Andromium OS మీ ఫోన్‌లో విజయవంతంగా లాంచ్ అవుతుంది.

స్టెప్ 5

దీంతో మీ ఫోన్ కాస్తా కంప్యూటర్‌లా మారిపోతుంది. ఇప్పుడు మీ డివైస్‌ను మానిటర్, కీబోర్డ్ ఇంకా మౌస్‌లకు కనెక్ట్ చేసుకుని పూర్తిస్థాయి కంప్యూటింగ్‌ను ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Turn Your Android Device Into Full Functional Computer. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot