మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిట్నెస్ ట్రాకర్‌లా మార్చటం ఎలా..?

పని ఒత్తిడితో సతమతమయ్యే మన శరీరాలకు ఉపశమనం ఎంతో అవసరం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా మనలో చాలామందికి వ్యాయామం చేసే తీరిక కూడా ఉండదు.

|

పని ఒత్తిడితో సతమతమయ్యే మన శరీరాలకు ఉపశమనం ఎంతో అవసరం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా మనలో చాలామందికి వ్యాయామం చేసే తీరిక కూడా ఉండదు. ఇలాంటి వారు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఫిట్నెస్ ట్రాకర్స్‌గా మలచుకుని తమ ఫిట్నెస్‌ను ఏరోజుకారోజు ట్రాక్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌లను పూర్తిస్థాయి ఫిట్నెస్ ట్రాకర్‌ యంత్రాల్లా మార్చగిలిగే బెస్ట్ ఫిట్నెస్ ట్రాకర్ యాప్స్‌ వివరాలను మీముందు ఉంచుతున్నాం.

 

BSNL ఈద్ ముబారక్ ప్లాన్, రోజుకు 2జిబి డేటా,150 రోజుల వ్యాలిడిటీBSNL ఈద్ ముబారక్ ప్లాన్, రోజుకు 2జిబి డేటా,150 రోజుల వ్యాలిడిటీ

క్యాలరీ కౌంటింగ్ : మైఫిట్నెస్‌పాల్ (Calorie Counting: MyFitnessPal )

క్యాలరీ కౌంటింగ్ : మైఫిట్నెస్‌పాల్ (Calorie Counting: MyFitnessPal )

ఈ క్యాలరీ కౌంటర్ అప్లికేషన్‌లో 60 లక్షలకు పైగా ఆహారాలకు సంబంధించిన డేటా బేస్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌ను ఫాలో అవ్వటం ద్వారా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఫిట్నెస్ లెవల్స్‌ను మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. జిమ్ ట్రైనర్స్ కూడా ఈ యాప్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

 

(గూగుల్ ఫిట్ - ఫిట్నెస్ ట్రాకింగ్) Google Fit- Fitness Tracking

(గూగుల్ ఫిట్ - ఫిట్నెస్ ట్రాకింగ్) Google Fit- Fitness Tracking

గూగుల్ ఇంక్ అందిస్తోన్న అత్యుత్తమ అప్లికేషన్‌లలో గూగుల్ ఫిట్ ఒకటి. ఈ యాప్ మీ కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టగలుగుతుంది. ఉదాహరణకు మీరు వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తున్నట్లయితే దాన్ని రియల్ టైమ్‌లో రికార్ట్ చేసి మీరు ఎన్ని క్యాలరీలు ఖర్చు చేసారన్న వివరాలను వెల్లడిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్ట్రావా రన్నింగ్ అండ్ సైక్లింగ్ జీపీఎస్ (Strava Running and Cycling GPS)
 

స్ట్రావా రన్నింగ్ అండ్ సైక్లింగ్ జీపీఎస్ (Strava Running and Cycling GPS)

ఈ జీపీఎస్ యాప్ ద్వారా రన్నర్స్ ఇంకా సైక్లిస్ట్స్ తమ యాక్టివిటీస్‌ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుని వాటిని షేర్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా పొందవచ్చు.

 

 

 7 మినిట్ వర్క్ అవుట్ (7 Minute Workout)

7 మినిట్ వర్క్ అవుట్ (7 Minute Workout)

మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ స్టడీ ఆధారదంగా రూపుదిద్దుకున్న ఈ వ్యాయామ ఆధారిత అప్లికేషన్ వర్చువల్ ట్రైనర్‌లా వ్యహరించటంతో పాటు యూజర్లను ఆ దిశగా ప్రోత్సహిస్తుంది. ఈ యాప్ రోజుకు 7 నిమిషాల పాటు ట్రైనింగ్‌ను ఇవ్వటం జరుగుతుంది. ఈ యాప్ అందించే సలహాలు, సూచనలు పాటించటం ద్వారా త్వరితగతని బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇన్‌స్టెంట్ హార్ట్‌రేట్ (Instant Heart Rate)

ఇన్‌స్టెంట్ హార్ట్‌రేట్ (Instant Heart Rate)

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా హార్ట్‌రేట్ అలానే పల్స్ రేట్లను తెలుసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో వారి వారి వ్యాయామాలకు సంబంధించిన ప్రొగ్రెస్‌ను కూడా ఈ యాప్ రికార్డ్ చేసి చూపుతుంది.

Best Mobiles in India

English summary
ime to make your body fit to have a healthy mind setup in order to perform better in this world with the help of your android mobile that will be now act as an Ultimate fitness tracker and help you to get the healthy body.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X