మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను హోమ్ సెక్యూరిటీ కెమెరాలా మార్చాలనుకుంటున్నారా..?

|

నిరుపయోగంగా పడి ఉన్న మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హోమ్ సెక్యూరిటీ అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవాలనుకుంటున్నారా?, అయితే ఈ కథనం చదవండి. ఈ రోజుల్లో హోమ్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన విషయంగా మారిపోయింది. సెక్యూరిటీ కెమెరాలను ఫిట్ చేయటం వల్ల మన మన ఇళ్లకు పూర్తి భద్రతను ఇవ్వగలుగుతన్నాం. అయితే బడ్జెట్ ఎక్కువుగా ఉండటం కారణంగా సీసీ కెమెరా సిస్టమ్‌ను ప్రతిఒక్కరూ కొనుగోలు చేయలేక పోతున్నారు. ఇటువంటి పరిస్థితినే మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ క్రింది సూచనలను అనుసరించి మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హోమ్ సెక్యూరిటీ కెమెరాలా ఉపయోగించుకోండి..

 
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను హోమ్ సెక్యూరిటీ కెమెరాలా మార్చాలనుకుంటున్నారా.

స్టెప్ 1 :
సెక్యూరిటీ కెమెరా యాప్‌ అవసరం..
ముందుగా మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఓ సెక్యూరిటీ కెమెరా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇటువంటి యాప్స్ ప్లే స్టోర్‌లో ఇబ్బడి మబ్బడిగా లభ్యమవుతున్నాయి. వీటిని ఉచితంగా కూడా పొందే వీలుంటుంది. యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసి మీ పేరుతో అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ బేసిక్ సమాచారాన్ని యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.

ర్యామ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిర్యామ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

స్టెప్ 2 :
స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడ ఉంచాలన్నది ఫిక్స్ చేసుకోండి..
యాప్ ఇన్ స్టాలేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తయిన తరువాత మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కడ ఉంచాలన్నది నిర్థారణ చేసుకోండి. మీరు ఎంపిక చేసుకునే ప్లేస్ మంచి వ్యూవింగ్ యాంగిల్స్ ను కలిగి ఇదే సమయంలో సాధ్యమైన ఎక్కువ స్పేస్ ను కవర్ చేసేదిగా ఉండాలి. అటువంటి ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకుని అక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఫిట్ చేయండి.

స్టెప్ 3
ట్రైపోడ్ స్టాండ్ లేద సక్షన్ కప్ అవసరమవుతుంది..
కెమెరా ఉంచాల్సిన ప్లేస్‌ను నిర్థారించుకున్న దాన్ని మౌంట్ చేసేందుకు ట్రైపోడ్ స్టాండ్ లేదా సక్షన్ కప్ అవసరమవుతంది. మీ ఫోన్ 24x7 కెమెరాలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి లో బ్యాటరీ సమస్య అనేదే తలెత్తకుండా చూసుకోవాలి. పవర్స్ సోర్సుకు దగ్గరగా ఫోన్ ను ఉంచినట్లయితే ఛార్జింగ్ బెడద అనేదే ఉండదు.

Best Mobiles in India

English summary
Have a spare Android phone at home? You can put it to use now as a security camera to safeguard your home against unforeseen situations! Yes, it is possible.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X