Home
How to

మీ ఫోటోనే వాట్సాప్ స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్నారా?

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను ఉద్దేశించి స్టిక్కర్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలసిందే.

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్, ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను ఉద్దేశించి స్టిక్కర్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలసిందే. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్, వాట్సాప్ ఐఓఎస్ అలానే వాట్సాప్ వెబ్ యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని పలు డీఫాల్ట్ వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ఇవి కాకుండా పలు థర్డ్ పార్టీ స్టిక్కర్ ప్యాక్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఫోటోలనే స్టిక్కర్స్‌గా మలచుకునే అవకాశం..

ఫోటోలనే స్టిక్కర్స్‌గా మలచుకునే అవకాశం..

ఇవీ కాకుండా వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోటోలనే స్టిక్కర్స్‌గా మలచుకునే అవకాశాన్ని కూడా వాట్సాప్ కల్పిస్తోంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్యుటోరియల్‌లో ప్రధానంగా రెండు ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. అందులో మొదటది, ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవటం, రెండవది.. క్రియేట్ చేసిన ఇమేజ్‌ను వాట్సాప్ స్టిక్కర్స్‌లో యాడ్ చేయటం. ఈ ప్రొసీజర్‌ను పూర్తి చేసేందుకు అవసరమైన స్టెప్ బై స్టెప్ గైడ్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చేసుకోవాలి..

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చేసుకోవాలి..

వాట్సాప్ స్టిక్కర్స్ మీ ఫోన్‌లో ఓపెన్ అవ్వాలంటే, తప్పనిసరిగా మీ వాట్సాప్ వెర్షన్‌ను 2.18 లేదా అంతకంటే హయ్యర్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయి ఉండాలి. యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత స్టిక్కర్స్‌గా మలచాలనుకుంటోన్న ఫోటోలను సెలక్ట్ చేసుకోవాలి. సెలక్ట్ చేసిన ఫోటోలను PNG ఫైల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చేసుకోవాలి.

 

 

నచ్చిన విధంగా క్రాప్ చేసి స్టిక్కర్ లుక్‌ను తీసుకురాలి..

నచ్చిన విధంగా క్రాప్ చేసి స్టిక్కర్ లుక్‌ను తీసుకురాలి..

ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత, గూగుల్ ప్లే స్టోర్‌లోకి ఏదైనా background eraser యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ అయిన తరువాత స్టిక్కర్స్‌గా కన్వర్ట్ చేయాలనుకుంటోన్న ఫోటోను సెలక్ట్ చేసుకుని బ్యాగ్రౌండ్‌ను ఎరేజ్ చేయాలి. ఇందుకు ఆటో, మ్యాజిక్ లేదా మాన్యువల్ టూల్‌ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఆ తరువాత ఇమేజ్‌ను నచ్చిన విధంగా క్రాప్ చేసి స్టిక్కర్ లుక్‌ను తీసుకురాలి. ఇలా చేసిన ఇమేజ్‌ను PNG ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి.

 

 

స్టిక్కర్స్ ఆటోమెటిక్‌గా డిటెక్ట్ కాబడతాయి...

స్టిక్కర్స్ ఆటోమెటిక్‌గా డిటెక్ట్ కాబడతాయి...

ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మీ ఫోటో పర్సనలైజిడ్ స్టిక్కర్స్ జాబితాలోకి చేరిపోతోంది. ఇలాంటి స్టిక్కర్స్‌ను మూడు క్రియేట్ చేసుకున్న తరువాత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘Personal Stickers for WhatsApp' అనే యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ లాంచ్ అయిన వెంటనే మీరు క్రియేట్ చేసిన స్టిక్కర్స్ ఆటోమెటిక్‌గా డిటెక్ట్ కాబడతాయి. ఆ తరువాత స్టిక్కర్స్ పక్కన కనిపించే యాడ్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే అవి చాట్‌లోకి యాడ్ అయిపోతాయి. వీటిని ఎవరికి కావాలంటే వారికి షేర్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన పర్సనలైజిడ్ స్టిక్కర్స్ స్టిక్కర్ బ్యాంక్‌లో సేవ్ అయి ఉంటాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
How to turn your photos into WhatsApp Stickers.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X