Home
How to

Meta Account Center ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను Unlink చెయ్యాలా.. పూర్తి వివరాలు?

మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లింక్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. రెండు ఖాతాలను సులభంగా నిర్వహించుకొనేందుకు కొంత మంది లింక్‌ చేసుకొని వినియోగిస్తారు. అయితే ఏదైనా వ్యక్తిగత లేదా ఇతర కారణాలతో ఈ రెండింటిని వేర్వేరుగా నిర్వహించేందుకు ( how to unlink facebook and instagram ) కూడా అవకాశం ఉంది. అయితే ఈ ఖాతాలను మెటా అకౌంట్‌ సెంటర్‌ నుంచి వేరు చేయవచ్చు (Unlink). పూర్తి వివరాలు.

ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ల నుంచి రెండు ఖాతాలను అన్‌లింక్ చేయవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ మరియు ఐఫోన్‌ లోనూ ఈ అవకాశం ఉంది. అయితే ఇలా చేయడం వల్ల వినియోగదారుల గత పోస్టులు కానీ ఇతర సమాచారం ప్రభావితం కాదు. గతంలో మీరు ఎలా ఉపయోగించుకున్నారు.. ఇక నుంచి కూడా అంతే సౌకర్యంగా వినియోగించుకోవచ్చు.

how to unlink facebook and instagram accounts

ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను ఎలా అన్‌లింక్‌ చేయాలి :
ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ద్వారా అన్‌లింక్‌ చేయడం :
స్టెప్‌ 1 : ఇన్‌స్టాగ్రామ్‌ లో కుడిపైపు కింద భాగాన ఉన్న ప్రొఫైల్‌ ఐకాన్‌ పైన క్లిక్ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం కుడి వైపు పైభాగాన కనిపించిన మూడు లైన్‌ల పైన క్లిక్‌ చేయాలి.

స్టెప్‌ 3 : అక్కడ కనిపించిన అకౌంట్‌ సెంటర్‌ పైన క్లిక్‌ చేసి అకౌంట్‌ పైన క్లిక్ చేయాలి.
స్టెప్‌ 4 : అక్కడ కనిపించిన ఫేస్‌బుక్ ఖాతా పై క్లిక్‌ చేసి తొలగించవచ్చు.
ఫేస్‌బుక్‌ యాప్‌ ద్వారా :
స్టెప్‌ 1 : ఫేస్‌బుక్‌ యాప్‌ ఓపెన్ చేసి ఫ్రొపైల్‌ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

స్టెప్‌ 2 : అనంతరం సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : అక్కడ అకౌంట్‌ సెంటర్‌ వద్ద see more అనే ఆప్షన్‌ ను గుర్తించాలి.
స్టెప్‌ 4 : అనంతరం స్క్రోల్‌ డౌన్‌ చేసి అకౌంట్‌ ను సెలక్ట్‌ చేసుకోవాలి.
స్టెప్‌ 5 : తర్వాత అక్కడ కనిపించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించవచ్చు.

వెబ్‌ బ్రౌజర్‌ నుంచి కూడా అన్‌లింక్‌ చేయవచ్చు :
స్టెప్‌ 1 : తొలుత ఫేస్‌బుక్‌ ఖాతాలోకి లాగిన్‌ కావాలి.
స్టెప్‌ 2 : ప్రొఫైల్‌ పైన క్లిక్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌ మరియ ప్రైవసీని ఎంచుకోవాలి.
స్టెప్‌ 3 : సైడ్ బార్‌లోని అకౌంట్‌ సెంటర్‌లో see more ను ఎంచుకోవాలి.
స్టెప్‌ 4 : అనంతరం అకౌంట్స్‌ పైన క్లిక్‌ చేసి అన్‌లింక్‌ చేయవచ్చు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to unlink facebook and instagram accounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X