వేరే సిమ్‌ ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్ అన్‌లాక్ చేయడం ఎలా..?

Posted By: ChaitanyaKumar ARK

మీ ఫోన్లు ఒక్కొక్కసారి నిర్ధిష్టమైన నెట్వర్క్ సిమ్ తో లాక్ చేయబడి ఉంటాయి. ఆసమయంలో మీ నెట్వర్క్ ప్రొవైడర్ ను మార్చాలని ఆలోచిస్తూ ఉండడం కానీ, లేక మీ ఫోన్ లో వేరే ఏదేని ఇతర సిమ్ కార్డుని ఉపయోగించడం గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఆందోళన చెందే అవకాశం ఉంది. ఎందుకంటే వేరొక నెట్వర్క్ నుండి సిమ్ ను ఆ మొబైల్ లో వినియోగించుటకు ఆ ఫోన్లు నిరాకరిస్తాయి. వేరే సిమ్ కార్డుని ఆ ఫోన్ లో వాడుకోవాలని చూసినా కూడా మీ కాల్స్ , డేటా, ఎస్‌ఎం‌ఎస్ సర్వీసులని వినియోగించుకోలేరు. కావున ఇక్కడ, మీ ఫోన్ను ఎలా అన్లాక్ చేయాలో మరియు ఏ SIM ను ఉపయోగించాలో మేము మీకు చూపుతాము.

ఆండ్రాయిడ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ఏమిటి?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్ను అన్లాక్ చేయడo చట్టబద్ధమైనదేనా?

మీరు మీ ఫోన్ కు సంబంధించిన పేమెంట్ లావాదేవీలన్నింటినీ పూర్తిచేసి ఉన్నట్లయితే, మీ ఫోన్ను అన్లాక్ చేయడానికి పూర్తిగా చట్టబద్దమైనది. అలాకాకుండా మీరు ఫోన్ సంబంధించిన పేమెంట్ ప్రక్రియను ఇంకా కలిగి ఉండి, మీరు సిమ్ కార్డుని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది చట్టరీత్యా నేరం మరియు శిక్షార్హులు అవుతారు. కావున మేము చూపబోయే ఈప్రక్రియలు చేయుటకు ముందు మీ నెట్వర్క్ కారియర్ యొక్క నియమనిభంధనలను పూర్తిగా తెలుసుకొనవలసినదిగా సూచిస్తున్నాము.

మీ ఫోన్ అన్లాక్ చేయడం ఎలా?

మీకు తెలిసిన తర్వాత ఫోన్ అన్లాక్ చేయడం ఆశ్చర్యకరంగా సులభం.

1.మొదట, మీరు మీ సర్వీస్ ప్రొవైడర్ని సంప్రదించి అన్లాక్ ను అభ్యర్థించాలి. మీరు తర్వాత ఉపయోగించే సిమ్ కూడా అదే నెట్వర్క్ సంబంధించింది అయి ఉండాలి, వేరే నెట్వర్క్ సంబంధించి కాకూడదు. అలా కాని పక్షంలో మీ అభ్యర్ధన తిరస్కరించబడుతుంది.

2.మీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీ ఫోన్ అన్లాక్ చేయబడిందని మీరు ధృవీకరించిన తర్వాత, మీ ఫోన్ ని టర్న్ ఆఫ్ చేసి, మీ కొత్త SIMకార్డ్ ని SIM కార్డ్ స్లాట్లో ఉంచి ఫోన్ ని తిరిగి ఆన్ చేయండి.

3.ఇప్పుడు, అన్లాక్ విజయం సాధించారా లేదా అనేది తెలుసుకోవడానికి కాల్ చెయ్యడమో, ఎస్‌ఎం‌ఎస్ పంపడమో, డేటా వినియోగించడమో చేసి తెలుసుకోండి. అన్లాక్ విజయవంతం కాని పక్షంలో, మరలా సర్వీస్ ప్రొవైడర్ ని సంప్రదించండి.

మీ నెట్వర్క్ ప్రొవైడర్ను సంప్రదించండి:

 

 

ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడర్

ఈ ఫోన్ అన్లాక్ చేయడానికి ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడర్ ఒక్కొక్క నిబంధనలని సూచిస్తుంది. ఉదాహరణకి వోడాఫోన్ నెట్వర్క్ అయితే మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత 10రోజులు అబ్సర్వేషన్ లో ఉంచిన పిదప మీకు ఫోన్ సంబంధించిన అన్లాక్ కోడ్ ని పంపడం జరుగుతుంది. ఈ పదిరోజులు మీరు మీ పాత సిమ్ నే ఉపయోగించి ఆ లావాదేవీలను పూర్తి చేయాల్సిఉంటుంది. వోడాఫోన్ ఇంటర్నేషనల్ సంస్థ కాబట్టి అన్నిటా ఇంచుమించు ఇలాంటి నిబంధనలే ఉండవచ్చు.

18నెలలు పూర్తిగా..

అదేవిధంగా కొన్ని నెట్వర్కులు 18నెలలు పూర్తిగా స్మార్ట్ ఫోన్ తో లాక్ చేసి ఇచ్చిన సిమ్ కార్డుని వాడినట్లయితే, మన ప్రమేయం లేకుండానే అన్లాక్ చేస్తుంటాయి. కానీ గత 6నెలలుగా ఇచ్చిన నెట్వర్క్ తో అదే ఫోన్ ఉపయోగిస్తూ, ఆలస్యం చేయకుండా సరైన సమయంలో రుసుమును చెల్లించేలా ఉండాలి. మరియు ఫోన్ దొంగిలించబడినట్లు కంప్లైంట్ ఎక్కడా రిజిస్టర్ కాకూడదు. ఇంగ్లాండ్ లోని టెస్కో సర్వీస్ ప్రొవైడర్ నిబంధన ప్రకారం 12నెలల తర్వాత అన్లాక్ రిక్వెస్ట్ వస్తే ఉచితంగా చేసిస్తారు, అలా కాకుండా 12నెలల ముందే రిక్వెస్ట్ చేసుకుంటే 10పౌండ్లు చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ IMEI తెలుపమని కోరుతాయి, కావున అన్లాక్ రిక్వెస్ట్ చేసే ముందు IMEI తెలుసుకోవలసి ఉంటుంది. *#06#అనే నంబర్ కు డైల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

 

 

Third party applications ఉపయోగించడం:

మీరు Third party applicationsద్వారా అన్లాకింగ్ కు ఉపక్రమించే ముందే మీ నెట్వర్క్ ప్రొవైడర్తో తనిఖీ చేయాలని మేము ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తాము, కానీ కొన్నిసార్లు ఈ Third party applications ఉపయోగించడం చాలా వేగంగా మరియు సులభతరంగా ఉంటుంది. కానీ సిమ్ అన్లాకింగ్ ప్రక్రియ ముగిసేలోపు వినియోగదారుల కదలికలపై కొన్ని నెట్వర్క్స్ నిఘా ఉంచే అవకాశం కూడా లేకపోలేదు. చెడుకార్యకలాపాలకు తావివ్వకుండా. కావున మీ సర్వీస్ ప్రొవైడర్ సంబంధించిన అన్నీ నిబంధనలను తెలుసుకొనుట మంచిది.

DOCTORSIM

దీనికై DOCTORSIM అని ఒక Third party application మార్కెట్లో లభ్యమవుతుంది, ఇది అన్లాక్ విజయవంతం కానట్లయితే డబ్బును వాపసు ఇస్తానని వాగ్దానం చేస్తుంది. మరియు ఎటువంటి hiddenఫీజులు కూడా ఉండవు. మీరు పైన జాబితా చేయబడిన పద్ధతులను ప్రయత్నించినట్లయితే ఇది ఒక ఎంపిక.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to unlock an Android phone and use any SIM more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot