క్రోమ్ బ్రౌజర్‌లోని ఇన్‌బిల్ట్ మాల్వేర్ స్కానర్‌ను అన్‌లాక్ చేయటం ఎలా..?

|

కొత్తరకం మాల్వేర్ ఒకటి కంప్యూటర్లను నాశనం చేస్తోందన్న వార్తలు నేపథ్యంలో ఇంటర్నెట్ ప్రపంచం అప్రమత్తమయ్యింది. రోమింగ్ మంటిస్ పేరుతో హల్‌చల్ చేస్తోన్న ఈ మాల్వేర్‌ను ఓ ప్రముఖ రిసెర్చ్ సంస్థ ముందుగా గుర్తించింది. వై-ఫై రౌటర్స్ ద్వారా ఈ మాల్వేర్ కంప్యూటర్‌లలోకి చొరబడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.కంప్యూటర్‌లోకి చొరబడిన వెంటనే యూజర్‌ వ్యక్తిగత డేటాను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకుంటోన్న ఈ మాల్వేర్ క్రోమ్ యూజర్లను మరింత కలవరపెడుతోంది. ఈ ప్రమాదకర మాల్వేర్‌కు దూరంగా ఉండాలనుకునే వారు తమ తమ కంప్యూటర్లను పూర్తిస్థాయిలో ప్రొటెక్ట్ చేసుకోవల్సి ఉంది. క్రోమ్ బ్రౌజర్‌లకు సంబంధించి మాల్వేర్ స్కానర్‌ను అన్‌లాక్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం...

 
క్రోమ్ బ్రౌజర్‌లోని  ఇన్‌బిల్ట్ మాల్వేర్ స్కానర్‌ను అన్‌లాక్ చేయటం ఎలా

సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత..
ముందుగా క్రోమ్ బ్రౌజర్ మీ కంప్యూటర్‌లో ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ అయిన తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రీ డాట్స్ మెనూ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో చిట్టచివరి ఆప్షన్ అయిన Advanced to show all the optionsను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

మార్కెట్లో వేడెక్కిన పోటీ, భారీగా తగ్గిన స్మార్ట్‌టీవీ ధరలు !మార్కెట్లో వేడెక్కిన పోటీ, భారీగా తగ్గిన స్మార్ట్‌టీవీ ధరలు !

ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది..ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత మరికొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో Reset and clean up header' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని Clean up computer కంప్యూటర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడుక్రోమ్ మాల్వేర్ స్కానర్ మీ కంప్యూటర్ లో ఏదైనా మాల్వేర్ ఉన్నట్లయితే వెంటనే దానిని తొలగించివేస్తుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ తరువాత నుంచి ఏదైనా మాల్వేర్ మీ క్రోమ్ బ్రౌజర్‌‌లోకి చొరబడిన వెంటనే మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది.

యాంటీ వైరస్ ప్రోగ్రామ్స్ తప్పనిసరి..
మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌ల కారణంగా కంప్యూటర్ల పనితీరు పూర్తిగా మందగిస్తుంటుంది. ఈ విధమైన ప్రమాదాల నుంచి మీ వ్యక్తిగత కంప్యూటర్లను సురక్షితంగా ఉంచుకోవాలంటే యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. అంతేకాకుండా వీటిని ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకుంటే మంచిది.

Best Mobiles in India

English summary
We must be aware of that the Chrome browser on Windows comes with its own malware scanner. This scanner runs periodically in order to clean the junk stored in your browser.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X