Home
How to

ఆధార్‌ కొత్త యాప్‌.. మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌, డిజిటల్‌ షేరింగ్‌, కుటుంబ సభ్యుల వివరాలు స్టోరేజీ సహా..!

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ - ఉడాయ్‌ (UIDAI) గత సంస్థ చివర్‌ లో ఆధార్‌ కొత్త యాప్‌ ను లాంచ్‌ చేసింది. దీంతోపాటు mAadhaar యాప్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఆధార్‌ యాప్‌ తో అనేక వివరాలను ఆన్‌లైన్‌ లోనే అప్‌డేట్‌ చేసుకొనేందుకు వీలు కల్పించింది. దీంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలతోపాటు ఆధార్‌ వివరాలను డిజిటల్‌ గా సేవ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

యూజర్‌ ఫ్రెండ్లీగా ఆధార్‌ సేవలు :
అయితే నిన్న (జనవరి 28) ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆధార్‌ యాప్‌ తో మొబైల్‌ నంబర్‌ ను అప్‌డేట్‌ చేసుకొనే అవకాశం కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా ఆధార్‌ సర్వీసులు మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మారనున్నాయని భావిస్తోంది.

aadhaar new app uses

అనేక ఉపయోగాలు :
ప్రస్తుతం ఈ ఆధార్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌, iOS యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌తో అడ్రస్‌, మొబైల్ నంబర్‌ అప్‌డేట్‌, ఆధార్‌ వెరిఫికేషన్‌ను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఆధార్‌ వివరాలను డిజిటల్‌గా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇతరులకు షేర్‌ చేసుకోవచ్చు.

ఈ యాప్‌ను ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి? :
ప్రస్తుతం Aadhaar యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌, ఆపిల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అక్కడ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం మీ భాషను ఎంపిక చేసుకొని, 12 అంకెల ఆధార్‌ నంబర్‌, ముఖ గుర్తింపు (Face Recognition) తో లాగిన్‌ కావాలి, 4 అంకెల పాస్‌కోడ్‌ ను క్రియేట్‌ చేసుకోవాలి.

సులభంగా మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్ :
ఉడాయ్‌ కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ఈ యాప్‌ ద్వారానే మొబైల్‌ నంబర్‌ ను సులభంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఫలితంగా ఆధార్‌ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యాప్‌లోని Services ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. అనంతరం Update Mobile Number పైన క్లిక్‌ చేసి, కొత్త మొబైల్‌ నంబర్‌, OTP ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.

aadhaar new app uses

కుటుంబ సభ్యుల ప్రొఫైల్‌ను యాడ్‌ చేసుకోవచ్చు :
ఆధార్‌ యాప్‌లో గరిష్ఠంగా ఐదుగురు కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్‌ను యాడ్‌ (Add) చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం యాప్‌లోని ప్రొఫైల్‌ సెక్షన్‌లోని Add User ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలి.

అనంతరం OTP లేదా ముఖ గుర్తింపు ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ స్విచ్చింగ్‌ మెనూ ద్వారా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌లో ఆఫ్‌లైన్‌ మోడ్‌ ఆప్షన్ కూడా ఉంది. QR కోడ్‌ ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

డిజిటల్ షేరింగ్‌, బయోమెట్రిక్‌ లాక్‌ :
ఈ ఆధార్‌ యాప్‌ ద్వారా ఇతరులకు డిజిటల్‌గా షేర్‌ చేసుకోవచ్చు. పుట్టినరోజు లేదా అడ్రస్‌ వివరాలను Hide చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీ ఆధార్‌ వివరాలను ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Update mobile number and add family members profiles on new aadhaar app
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X