మీ అమెజాన్ అకౌంటులో ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం ఎలా?

|

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అమెజాన్ ఒకటి. అమెజాన్ కంపెనీ తన యొక్క వినియోగదారులకు అందరికి కూడా తన యొక్క యాప్‌ను మరియు వెబ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా యూజర్ ఫ్రెండ్లీగా మార్చింది. మీరు మీ చిరునామా మరియు ఫోన్ నంబర్‌తో సహా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయవచ్చు.

How to Update or Change Your Phone Number on Amazon Via App and PC

ఏదైనా అనివార్యకారణాలతో మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి మారినట్లయితే లేదా మీ కాంటాక్ట్ నంబర్‌ని మార్చినట్లయితే కనుక మీ యొక్క కొత్త ఫోన్ నెంబర్ ను చాలా సులభంగా అప్‌డేట్ చేయవచ్చు. అమెజాన్ మొబైల్ యాప్ ద్వారా మరియు మీ డెస్క్‌టాప్ ద్వారా మీ ఫోన్ నెంబర్ తో పాటుగా మీ యొక్క పర్సనల్ వివరాలను కూడా తాజాగా ఉంచడానికి సులభంగా మార్చవచ్చు. మీ ఫోన్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon యాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను మార్చే విధానం

How to Update or Change Your Phone Number on Amazon Via App and PC

** మీ ఫోన్‌లోని అమెజాన్ యాప్‌ని ఓపెన్ చేసి అందులో మీరు లాగిన్ అయ్యారని ముందుగా నిర్ధారించుకోండి.

** దిగువ భాగంలో కుడివైపు మూలలో ఉన్న మూడు క్షితిజ సమాంతర రేఖల మీద నొక్కండి.

** "మీ అకౌంట్"కి వెళ్లి "లాగిన్ & సెక్యూరిటీ" ఎంపికను ఎంచుకోండి.

** ప్రాంప్ట్ చేసినప్పుడు మళ్లీ సైన్ ఇన్ చేయండి.

** అప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడే SMS/ఇమెయిల్/టెక్స్ట్ నోటిఫికేషన్‌ను పొందుతారు.

** "ఆమోదించడానికి" లేదా "తిరస్కరించడానికి" లింక్‌పై క్లిక్ చేయండి.

** మీ అమెజాన్ పేజీకి తిరిగి వెళ్లండి. మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ ప్రక్కన "ఎడిట్" ఎంపికను చూస్తారు.

** స్క్రీన్‌పై సూచనలను అనుసరించండి మరియు "సేవ్ చేంజెస్" ఎంపిక మీద నొక్కండి.

** మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత "డన్" ఎంపికపై నొక్కండి.

PC ద్వారా Amazonలో మీ ఫోన్ నంబర్‌ను మార్చే విధానం

How to Update or Change Your Phone Number on Amazon Via App and PC

** అమెజాన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి కుడివైపు ఎగువ మూలలో ఉన్న "అకౌంట్స్ అండ్ లిస్ట్స్" విభాగానికి వెళ్లండి.

** మీ అకౌంట్ > లాగిన్ & సెక్యూరిటీ > సైన్ ఇన్ ఎంపికలను అనుసరించండి.

** మళ్లీ లాగిన్ చేసి ఫోన్ నంబర్ ముందు ఉన్న "ఎడిట్" ఎంపికపై నొక్కండి.

** కొత్త ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి.

** ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత "సేవ్ చేంజెస్" విభాగం మీద నొక్కండి.

మీరు అదే "లాగిన్ & సెక్యూరిటీ" విభాగం నుండి ఇమెయిల్ అడ్రస్, అడ్రస్, పేరు వంటి మరిన్ని వివరాలను కూడా అప్‌డేట్ చేయవచ్చు. ముఖ్యంగా మీరు ఈ సమాచారాన్ని ఎన్నిసార్లు అయినా కూడా అప్‌డేట్ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే అమెజాన్ ఒక ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ అడ్రసును మాత్రమే అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
How to Update or Change Your Phone Number on Amazon Via App and PC

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X