ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ చేసుకోవాలి అనుకుంటున్నారా.. ఎలా చేయాలో తెలుసా?
ఆధార్ కార్డులు ప్రస్తుతం కేవలం గుర్తింపు కార్డులగానే కాకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ప్రధానంగా ఉంది. ఈ కార్డులను జూన్ 14 వరకు ఉచితంగా వివరాలను Aadhaar Card Photo Update) అప్‌డేట్ చేసుకోవచ్చు. అనంతరం కూడా అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంత మంది ఆధార్ కార్డులు తీసుకొని 10 సంవత్సరాలకు పైగా సమయం అయింది. ఫలితంగా కార్డులోని ఫోటోలను అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
గతంలో ఆధార్ కార్డుల జారీ సమయంలో కొంత మంది తమ ఫోటోలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆధార్ కార్డులోని ఫోటోలను అప్‌డేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు జూన్ 14 వరకు ఆధార్ కార్డులోని అడ్రస్ సహా ఇతర వివరాలను సంబంధిత ధ్రువ పత్రాలను సమర్పించి ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు ఫోటోను ఎలా అప్‌డేట్ చేసుకోవాలి..
ఆధార్ కార్డులోని పేరు, అడ్రస్ సహా ఇతర సమాచారం కోసం ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులోని ఫోటోను అప్‌డేట్ చేసుకొనేందుకు కచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ ఆధార్ అప్‌డేట్ ఫారం తీసుకోవాలి. అందులో అవసరమైన వివరాలు నింపాలి. అనంతరం బయోమెట్రిక్ వివరాలను కూడా అందించాలి. అనంతరం అక్కడున్న ఆధార్ కేంద్రంలోని సిబ్బంది.. మీ ఫోటోలను తీసుకుంటారు.
ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ కోసం ఎటువంటి గుర్తింపు కార్డులు సమర్పించాల్సిన అవసరం లేదు. అప్‌డేట్‌కు సంబంధించి అక్కడున్న సిబ్బంది మీకు ఒక స్లిప్ ఇస్తారు. అనంతరం నిర్దిష్ట గడువు అనంతరం మీ ఫోటో ఆధార్ కార్డులో అప్‌డేట్ అవుతుంది. సిబ్బంది ఇచ్చిన స్పిప్‌లోని ఉన్న URN నంబర్ ఆధారంగా దరఖాస్తు పురోగతిని తెలుసుకోవచ్చు.
ఆధార్ కార్డులోని మీ ఫోటో అప్‌డేట్ అయ్యాక.. UIDAI నుంచి మీకు సమాచారం అందుతుంది. అనంతరం అదే పోర్టల్ నుంచి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ను.. ఆధార్ కార్డు సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది.
అయితే ఆధార్ కార్డులో ఫోటో, మొబైల్ నంబర్ మినహా ఇతర వివరాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డులు, మ్యారేజీ సర్టిఫికేట్‌లు, గత మూడు నెలల విద్యుత్, గ్యాస్ బిల్లులు, రేషన్ కార్డులను వినియోగించుకోవచ్చు.
ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేసుకోవాలి..
స్టెప్ 1 : ఆధార్ కార్డులను సొంతంగా అప్‌డేట్ చేసుకొనేందుకు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
స్టెప్ 2 : అనంతరం అక్కడ కనిపించిన లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను సహా ఇతర వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 3 : అనంతరం అక్కడ కనిపించిన 'Send OTP' పైన క్లిక్ చేయండి. తర్వార మీ ఫోన్‌కు వచ్చిన 6 అంకెల OTP ని ఎంటర్ చేయండి.
స్టెప్ 4 : అనంతరం అక్కడ కనిపించిన సర్వీస్ ట్యాబ్‌లో అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ అనే దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 5 : తర్వాత Proceed to Update Aadhaar అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
స్టెప్ 6 : అక్కడ మీ పేరు మరియు ఆధార్ నంబర్ కనిపిస్తాయి.
స్టెప్ 7 : అనంతరం అవసరమైన డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
స్టెప్ 8 : అన్ని వివరాలను తనిఖీ చేసి సమర్పించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications