ఏవిధమైన డాక్యుమెంట్స్ లేకుండా Aadhaar Cardలో అడ్రసును అప్‌డేట్ చేయడం ఎలా?

|

ప్రస్తుతం ప్రతి ఒక్క విషయానికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయింది. ఆధార్ కార్డు ఇప్పుడు మన యొక్క జీవితంలో ఒక భాగం అయింది. ఇది మానవుడి యొక్క మొదటి గుర్తింపు కార్డు అయింది. ఇటువంటి ఆధార్ కార్డులో మీ యొక్క ప్రస్తుత చిరునామాను అప్ డేట్ చేయాలని చూస్తున్నారా?? ఆధార్ లో అడ్రస్ మార్పు చేయడానికి సాధారణంగా ఏదైనా డాక్యుమెంటరీ అడ్రస్ ప్రూఫ్ అవసరం అవుతుంది. కానీ ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కూడా ఆన్‌లైన్ అభ్యర్థన ద్వారా చిరునామాను మార్పు చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

 
డాక్యుమెంట్స్  లేకుండా Aadhaar Cardలో అడ్రసును అప్‌డేట్ చేయడం ఎలా?

డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ కార్డు చిరునామాను అప్ డేట్ చేసే దశలు

స్టెప్ 1: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) uidai.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. UIDAI వ్యక్తులకు 12-అంకెల ప్రత్యేక ID నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ను జారీచేస్తుంది.

స్టెప్ 2: ఇప్పుడు 'మై ఆధార్' మెనులోని 'అడ్రస్ ధ్రువీకరణ లెటర్' పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: 'రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ వాలిడేషన్ లెటర్' కోసం క్రొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో చెల్లుబాటు అయ్యే 12-అంకెల ఆధార్ నెంబర్ లేదా 16-అంకెల వర్చువల్ ఐడిని నమోదు చేయండి.

స్టెప్ 4: ధృవీకరణ కోసం 'క్యాప్చా కోడ్' ఎంటర్ చేసి 'సెండ్ OTP' బటన్ మీద క్లిక్ చేయండి.

డాక్యుమెంట్స్  లేకుండా Aadhaar Cardలో అడ్రసును అప్‌డేట్ చేయడం ఎలా?

స్టెప్ 5: రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు పంపిన 6-అంకెల OTP లేదా 8-అంకెల TOTP ని ఎంటర్ చేసి ఆపై 'లాగిన్' బటన్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 6: లాగిన్ అయిన తర్వాత 'వెరిఫైయర్ వివరాలను' ఇవ్వవలసి ఉంటుంది. అనగా 'అడ్రస్ వెరిఫైయర్ యొక్క ఆధార్ నంబర్' ను నమోదు చేయండి.

స్టెప్ 7: అప్ డేట్ కు సమ్మతి ఇవ్వడానికి అతను / ఆమె యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై లింక్‌తో వెరిఫైయర్‌కు ఒక SMS పంపబడుతుంది.

స్టెప్ 8: వెరిఫైయర్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత అతను / ఆమె OTP యొక్క ధృవీకరణ కోసం మరొక SMS ను అందుకుంటారు.

స్టెప్ 9: ధృవీకరణను పూర్తి చేయడం కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌లో పంపిన OTP ని నమోదు చేయండి.

స్టెప్ 10: దీనిని ధృవీకరించిన తర్వాత మీకు SMS ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ (SRN) లభిస్తుంది.

స్టెప్ 11: తరువాత 'SRN' సాయంతో లాగిన్ అవ్వండి. ఇప్పుడు కొత్త చిరునామాను అప్ డేట్ చేయండి. కావాలంటే స్థానిక భాషను కూడా సవరించండి. తరువాత డిక్లరేషన్ మీద టిక్ గుర్తును ఉంచి ఆపై 'సమర్పించు' బటన్ పై క్లిక్ చేయండి.

డాక్యుమెంట్స్  లేకుండా Aadhaar Cardలో అడ్రసును అప్‌డేట్ చేయడం ఎలా?

స్టెప్12: మీ యొక్క స్థానిక భాషలో అడ్రసును సవరించండి మరియు 'సేవ్' బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 13: ఇప్పుడు డిక్లరేషన్ మరియు 'సమర్పించు' అభ్యర్థనకు వ్యతిరేకంగా టిక్ చేయండి.

 

స్టెప్ 14: మీరు 'సీక్రెట్ కోడ్' సాయంతో పంపిన 'అడ్రస్ వాలిడేషన్ లెటర్' ని ధృవీకరణ చిరునామాకు పోస్ట్ ద్వారా అందుకుంటారు.

స్టెప్ 15: 'SSUP' (UIDAI) వెబ్‌సైట్‌ను తిరిగి ఓపెన్ చేసి, 'ప్రొసెస్డ్ అప్‌డేట్ అడ్రస్‌' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 16: మరోసారి ఆధార్‌తో లాగిన్ అయి 'సీక్రెట్ కోడ్ ద్వారా చిరునామాను అప్‌డేట్ చేయండి' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 17: మీ యొక్క 'సీక్రెట్ కోడ్' నమోదు చేయవలసి ఉంటుంది. పూర్తయిన తర్వాత క్రొత్త చిరునామాను ప్రివ్యూ చేసి 'సమర్పించు' బటన్ పై క్లిక్ చేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Update Your New Address on Aadhaar Card Through Online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X