ఆధార్ కార్డ్‌కు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను మార్చాలని చూస్తున్నారా? అయితే ఇలా చేయండి

|

ఆధార్ కార్డ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేయబడిన 12 అంకెల ప్రత్యేక నెంబర్. ఇది మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఫోటోగ్రాఫ్ మరియు బయోమెట్రిక్ డేటా వంటి అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో ఎవరైనా వ్యక్తి యొక్క గుర్తింపు మరియు చిరునామా యొక్క రుజువు అనేది ఆధార్ కార్డ్. మీ యొక్క ఆధార్‌లో ఏదైనా తప్పు జరిగిన సులభంగా మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. మీ యొక్క ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్ ఏదైనా అనుకోని కారణాల వలన మార్చవలసి వస్తే కనుక మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డ్‌లోని మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు అథారిటీ UIDAI ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

How to Update Your New Mobile Number on Aadhar Card?

ఆధార్ కార్డ్‌లో మీ యొక్క పేరు, చిరునామా మరియు పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయడానికి మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్ ఐడితో నమోదు చేయబడాలి. తద్వారా అప్‌డేట్ ప్రక్రియ సమయంలో ఆ నంబర్‌కు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) పంపబడుతుంది. రిజిస్టర్డ్ నంబర్ సక్రియంగా ఉందని మరియు మీ వద్ద ఉందని గుర్తుంచుకోండి.

స్టెప్ 1: మీ ఆధార్ కార్డ్‌లో మీ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి ముందుగా ask.uidai.gov.inలో UIDAI వెబ్ పోర్టల్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఫోన్ నంబర్‌ను జోడించండి.

స్టెప్ 3: మీరు ఇచ్చిన బాక్స్‌లలో సెక్యూరిటీ ప్రయోజనాల కోసం క్యాప్చాను టైప్ చేయాలి.

స్టెప్ 4: మీరు 'Send OTP' ఎంపికపై క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయాలి.

How to Update Your New Mobile Number on Aadhar Card?

స్టెప్ 5: ఇప్పుడు 'సబ్మిట్ OTP & ప్రొసీడ్' ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 6: తరువాత మీరు 'ఆన్‌లైన్ ఆధార్ సేవలు' అని సూచించే డ్రాప్‌డౌన్ మెనుని చూడవచ్చు.

స్టెప్ 7: ఇది పేరు, చిరునామా, లింగం, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్ మరియు మరిన్నింటితో సహా అనేక ఇతర ఎంపికలను చూపుతుంది.

స్టెప్ 8: ఆధార్‌లో ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి మొబైల్ నంబర్‌ను ఎంచుకోండి.

స్టెప్ 9: తదనుగుణంగా అవసరమైన అన్ని వివరాలను పూరించండి.

స్టెప్10: 'మీరు ఏమి అప్‌డేట్ చేయాలనుకుంటున్నారు' అనే ఎంపికను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.

స్టెప్ 11: కొత్త పేజీ చూపబడుతుంది మరియు మీరు క్యాప్చాను నమోదు చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 12: మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. OTPని ధృవీకరించండి మరియు 'సేవ్ అండ్ ప్రొసీడ్' ఎంపికపై క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Update Your New Mobile Number on Aadhar Card?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X