Home
How to

PAN కార్డ్‌లో ఫోటోను మార్చాలని ప్రయత్నిస్తున్నారా?? అయితే ఇలా చేయండి...

శాశ్వత అకౌంట్ నెంబర్ (PAN) అనేది 10-అంకెల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక చరిత్ర యొక్క పూర్తి రికార్డును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. మీ ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని ధృవీకరించడానికి PAN కార్డ్ ఉపయోగించబడుతుంది కాబట్టి ఇందులో నమోదు చేసిన సమాచారం ఖచ్చితంగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ లేదా లోన్ తీసుకోవడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి మీ పాన్ కార్డ్‌పై మీ ఫోటో మరియు సంతకం ఖచ్చితంగా ఉండాలి. మీరు మీ పాన్ కార్డ్‌లో ఫోటో లేదా సంతకంలో ఏదైనా వ్యత్యాసాన్ని కనుగొంటే కనుక మీరు PAN కార్డ్‌లోని ఫోటో మరియు సంతకాన్ని మార్చడానికి లేదా అప్ డేట్ చేయాలని ఆలోచిస్తుంటే కనుక క్రింది విధానాన్ని అనుసరించి సులభంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Update Your Photo on PAN Card Step by Step

STEP1: ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

STEP2: ఆ తర్వాత అప్లికేషన్ టైప్ ఎంపికపై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న పాన్ డేటా ఎంపికలో మార్పులు లేదా సవరణను ఎంచుకోండి.

STEP3: ఇప్పుడు కేటగిరి మెను నుండి వ్యక్తిగత ఎంపికను ఎంచుకోండి.

STEP4: ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించండి మరియు సబ్మిట్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

STEP5: ఇప్పుడు పాన్ అప్లికేషన్‌కు వెళ్లి KYC ఎంపికను ఎంచుకోండి.

How to Update Your Photo on PAN Card Step by Step

STEP5: ఆ తర్వాత 'ఫోటో సరిపోలలేదు' మరియు 'సిగ్నేచర్ సరిపోలలేదు' ఎంపికను కనుగొంటారు.

STEP6: ఇక్కడ మీరు ఫోటోను మార్చడానికి 'ఫోటో సరిపోలలేదు' ఎంపిక మీద క్లిక్ చేయండి.

STEP7: ఇప్పుడు మీ యొక్క తల్లిదండ్రుల వివరాలను పూరించిన తర్వాత నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయండి.

STEP8: మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత దరఖాస్తుదారుడి యొక్క గుర్తింపు ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ రుజువును జతచేయాలి.

STEP9: దీని తర్వాత డిక్లరేషన్‌ను టిక్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

STEP10: ఫోటో మరియు సంతకంలో మార్పు కోసం దరఖాస్తు రుసుము GSTతో కలిపి రూ.101 చెల్లించాలి. అలాగే భారతదేశం వెలుపలి చిరునామా కోసం GSTతో కలిపి రూ.1011 చెల్లించాలి.

STEP11: ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత 15-అంకెల రసీదు అందుతుంది.

STEP12: అప్లికేషన్ ప్రింటౌట్‌ను ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కి పంపండి.

STEP13: దరఖాస్తును రసీదు సంఖ్య నుండి ట్రాక్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to Update Your Photo on PAN Card Step by Step
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X