విండోస్ 7 నుంచి విండోస్ 10కు ఉచితంగా అప్‌గ్రేడ్ అవ్వటం ఎలా..?

|

ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో టెక్నాలజీతో పోటీపడాలంటే, ఎప్పటికప్పుడు లాంచ్ అవుతోన్న
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అప్‌ టు‌ డేట్‌గా ఫాలో అవ్వక తప్పదు. ముఖ్యంగా కంప్యూటింగ్ ప్రపంచానికి ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అనేవి చాలా కీలకం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా విండోస్ 7.1 లేదా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంను వినియోగించుకుంటోన్న యూజర్లు విండోస్ 10కు ఉచితంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను సూచించటం జరుగుతోంది...

 
విండోస్ 7 నుంచి విండోస్ 10కు ఉచితంగా అప్‌గ్రేడ్ అవ్వటం ఎలా..?

విండోస్ 10 అప్‌గ్రెడేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తవ్వాలంటే, మీ పీసీ విండోస్ 7 లేదా విండోస్ 8 ఒరిజినల్ వర్షన్ పై బూట్ అవుతుండాలి. వీటికి సంబంధిచిన లైసెన్స్ కీ కూడా తప్పనిసరిగా ఉండాలి. ప్రాసెస్‌ను స్టార్ట్ చేసే ముందు కంప్యూటర్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 1 :
ముందుగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్న మీ కంప్యూటర్ నుంచి విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్ పేజీలోకి వెళ్లండి.(https://www.microsoft.com/en-us/software-download/windows10ISO). ఆ పేజీలో కినిపించే "Download tool now" ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే "MediaCreationtool.exe" టూల్ మీ పీసీలో డౌన్‌లోడ్ కాబడుతుంది.

స్టెప్ 2 :
డౌన్‌లోడింగ్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే MediaCreationtoolను పీసీలో రన్ చేయండి. టూల్ లాంచ్ అయిన వెంటనే, ఓ సపరేట్ dialog box స్ర్కీన్ పై ఓపెన్ అవుతుంది. ఆ బాక్సులో upgrade this PC now, create installation media for another PC అనే రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో upgrade this PC now ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని Next బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3 : Next బటన్ పై క్లిక్ చేసిన వెంటనే MediaCreationtool, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను
డౌన్‌లోడ్ చేస్తుంది. ఓఎస్ డౌన్‌లోడ్ అయిన తరువాత యాక్టివేషన్‌కు సిద్ధమై, టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను యాక్సెప్ట్ చేసినట్లయితే మరో సపరేట్ dialog box స్ర్కీన్ పై ఓపెన్ అవుతుంది. ఈ బాక్సులో "Ready to Install" అనే ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 4 : "Ready to Install" ఆప్షప్ పై క్లిక్ చేసిన వెంటనే విండోస్ 10 ఎడిషన్, మీ పీసీలోని ప్రస్తుత విండోస్ ఎడిషన్ బట్టి ఇన్‌స్టాల్ కాబడతుంది. ఉదాహరణకు మీరు విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ వర్షన్‌లో ఉన్నట్లయితే విండోస్ 10 హోమ్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. విండోస్ 8.1 ప్రోలో ఉన్నట్లయితే విండోస్ 10 ప్రోకు అప్‌గ్రేడ్ కాబడతారు.

స్టెప్ 5 : వీండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, మీ కంప్యూటర్‌లో పర్‌ఫెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోటానికి Settings > Update & Security > Activation విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

విండోస్ 10 నచ్చని పక్షంలో విండోస్ 7కు తిరిగి వచ్చేయటం ఎలా..?

 

మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం అంతగా సంతృప్తినివ్వని పక్షంలో తిరిగి మళ్లి పాత ఆపరేటింగ్ సిస్టంకు వచ్చేయవచ్చు. ప్రీవియస్ వర్షన్‌ను తిరిగి రోల్ అవుట్ అయ్యే క్రమంలో పీసీలోని ముఖ్యమైన డేటాను ముందుగా బ్యాకప్ చేసుకోవల్సి ఉంటుంది.

ఆ తరువాత పీసీ Settings > Update & Security > Recovery విభాగంలోకి నేవిగేట్
అయినట్లయితే, back to Windows 7/8.1 అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బటన్ పై క్లిక్ చేసినట్లయితే రోల్ బ్యాక్ అవ్వటానికి గల కారణాలను విండోస్ అడుగుతుంది.

విండోస్ 10 నచ్చక పోవటానికి గల కారణాన్ని తెలియజేసి, Next బటన్ పై క్లిక్ చేసినట్లయితే రీఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఈ ప్రాసెస్‌లో మీ పీసీ అనేకసార్లు రీస్టార్ట్ అవటం జరుగుతుంది. అంతిమంగా మీ పీసీ పాత ఆపరేటింగ్ సిస్టంకు రోల్ అవుట్ కాబడతుంది.

రూ. 7800 ధరలో బ్లేడ్ ఎ3 స్మార్ట్‌ఫోన్ విడుదలరూ. 7800 ధరలో బ్లేడ్ ఎ3 స్మార్ట్‌ఫోన్ విడుదల

Best Mobiles in India

English summary
Everyone and everything needs to get updated once in a while in order to survive in this competitive environment. Today, we will guide you on how to install Windows 10 in your system from Windows 7.1 or 8

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X