స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్‌ యాప్‌లో HD వీడియోలను అప్‌లోడ్ చేయడం ఎలా?

|

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు తమ ప్రియమైన వారితో తమ యొక్క ఫోటోలు మరియు వీడియోలను పంచుకోవడానికి ఇప్పటికీ ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. ఫోటోలు తక్కువ స్టోరేజ్ ను కలిగి ఉండడంతో మీరు ఎక్కువ రిజల్యూషన్‌ ఉన్న ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నప్పటికీ కూడా అవి తక్కువ డేటాను వినియోగిస్తాయి. మరోవైపు వీడియోలు కూడా డేటాను తక్కువ మొత్తంలోనే వినియోగిస్తాయి. చాలా మంది వ్యక్తులు ప్రత్యేకించి మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నప్పుడు స్టాండర్డ్ నాణ్యత గల వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ఇష్టపడతారు.

How To Upload HD Videos In Facebook App On Smartphone?

అయితే మీకు డేటా మరియు నెట్‌వర్క్ కనెక్టివిటీ వంటివి సమస్య కానట్లయితే ఫేస్‌బుక్‌ వినియోగదారులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో HD-నాణ్యత వీడియోలను అప్‌లోడ్ చేయడానికి సులభమైన మార్గం ఒకటి ఉంది. మీరు ఫేస్‌బుక్‌లో అధిక-నాణ్యత గల వీడియోలను అప్‌లోడ్ చేయాలని చూస్తుంటే కనుక దానికి గల కొన్ని చిట్కాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫేస్‌బుక్‌లో HD వీడియోలను అప్‌లోడ్ చేసే విధానం

How To Upload HD Videos In Facebook App On Smartphone?

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: యాప్‌లో కుడివైపు దిగువ మూలన గల మూడు క్షితిజ సమాంతర రేఖలలో గల మెనూ చిహ్నాన్ని నొక్కండి.
స్టెప్ 3: సెట్టింగ్‌స & ప్రైవసీ ఎంపికకు వెళ్లి కుడివైపున ఉన్న బాణం గుర్తును నొక్కండి.
స్టెప్ 4: ఇప్పుడు సెట్టింగ్‌ల ఎంపికను ఎంచుకోండి.
స్టెప్ 5: ప్రిఫరెన్స్ విభాగానికి క్రిందికి స్క్రోల్ చేయండి మరియు మీడియా ఎంపికను ఎంచుకోండి. ఇలా చేయడంతో మీరు వీడియోలు మరియు ఫోటోల సెట్టింగ్‌ల పేజీకి చేరుకుంటారు.
స్టెప్ 6: ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి వీడియో నాణ్యత విభాగంలో ఆప్టిమైజ్డ్ ఎంపికను ఎంచుకోండి.

ఆప్టిమైజ్డ్ ఎంపికను ఎంచుకోవడం వలన వినియోగదారులు అప్‌లోడ్ చేసే డిఫాల్ట్ వీడియో నాణ్యత వినియోగదారుల నెట్‌వర్క్ కనెక్షన్‌పై ఆధారపడి ఉంటుందని నిర్ధారిస్తుంది. అంటే వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఉపయొగిస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌ HD రిజల్యూషన్‌లో వీడియోను అప్‌లోడ్ చేస్తుంది. అయితే వినియోగదారులు నెట్‌వర్క్ కనెక్టివిటీలో హెచ్చుతగ్గులు ఉన్న ప్రాంతాల్లో లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ నెమ్మదిగా ఉన్న సమయంలో ఫేస్‌బుక్‌ తక్కువ రిజల్యూషన్‌తో వీడియోను అప్‌లోడ్ చేస్తుంది.

How To Upload HD Videos In Facebook App On Smartphone?

మరోవైపు ఆప్టిమైజ్డ్ ఎంపికకు బదులుగా డేటా సేవర్ ఎంపికను ఎంచుకోవడం వలన నెట్‌వర్క్ వేగంతో సంబంధం లేకుండా అన్ని వీడియోలు తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ చేయబడతాయని గుర్తుంచుకోండి.

Best Mobiles in India

English summary
How To Upload HD Videos In Facebook App On Smartphone?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X