యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయటం ఎలా..?

యూట్యూబ్, ఓ వీడియో ప్రపంచం. అంశం ఏదైనా సరే సెర్చ్ కొడితే చాలు కావల్సి వీడియోలను మీముందు ప్రత్యక్షమవుతాయి. మన స్మార్ట్‌‌ఫోన్ల ద్వారా చిత్రీకరించుకున్న వీడియోలను సైతం యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయవచ్చు. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు చూద్దాం..

Read More : ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వర్షన్ అయినట్లయితే యూట్యూబ్ అప్లికేషన్ అప్‌డేట్ అయి ఉంటుంది. ఒక వేళ మీది పాత వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అయినట్లయితే యూట్యూబ్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కొత్త వర్షన్‌ను అప్‌డేట్ చేసుకోండి.

స్టెప్ 2

వీడియో అప్‌లోడింగ్ ప్రాసెస్‌లో భాగంగా ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి యూట్యూబ్ అకౌంట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.

స్టెప్ 3

తదుపరి స్టెప్‌లో భాగంగా యూట్యూబ్ యాప్ మెనూ ఆప్షన్స్‌లోకి వెళ్లి ‘Upload' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మీరు అప్‌లోడ్ చేసే వీడియో మొబైల్ నెట్‌వర్క్ నుంచా లేక వై-ఫై నెట్‌వర్క్ నుంచా అనేది సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 4

తరువాతి చర్యగా అకౌంట్ టాబ్ లేదా హోమ్ స్ర్కీన్ పై కనిపించే కెమెరా ఐకాన్ పై క్లిక్ చేయండి. కొత్త వీడియోను రికార్డ్ చేయాలనుకుంటున్నట్లే కెమెరా ఐకాన్ పై క్లిక్ చేసి రికార్డింగ్ ప్రాసెస్‌ను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫోన్‌లో రికార్డ్ అయి ఉన్న వీడియోను అప్‌లోడ్ చేయాలనుకుంటున్నట్లయితే ఫోన్ గ్యాలరీలోకి వెళ్లి సంబంధిత వీడియోను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత వీడియో టైటిల్, డిస్క్రిప్షన్ ఇంకా ప్రైవసీ
సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకుని అప్‌లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5

మీరు అప్‌లోడ్ చేసే వీడియో పబ్లిక్ చూడదగినదయితే పబ్లిక్ అప్షన్‌ను సెలక్ట్ చేసుకుని సదరు వీడియో ఫైల్‌ను ఆటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్‌లోడ్ చేసే వీడియో సైజును బట్టి నెట్‌వర్క్ స్సీడ్ ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లయితే మీ వీడియో ఆన్‌లైన్ ప్రపంచంలోకి విజయవంతంగా అడిగిపెట్టినట్లే. ఈ వీడియోను మీ మిత్రులకు సైతం షేర్ చేుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Upload Youtube Videos on your Android Smartphone. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot