Home
How to

ఎయిర్‌ కండిషనర్‌ (AC) లు వినియోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్‌ మీకోసమే..!!

ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా ‌అనేక మంది ప్రజలు తమ ఇళ్లలో ఎయిర్‌ కండిషనర్‌ లను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో మిగిలిన సమయాలతో పోలిస్తే ఈ వేసవిలో విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ వేసవిలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా విద్యుత్‌ బిల్లులను ఆదా చేయవచ్చు.

అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోకి అనేక ప్రాంతాలు సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో AC ల ద్వారా గదులను మరింత చల్లగా మార్చే కంటే, AC ని పరిమిత పాయింట్ల వద్ద నియంత్రించాల్సి ఉంటుంది.

How to use Air conditioner efficiently

అయితే ముఖ్యంగా AC లను వినియోగిస్తున్న సమయంలో ఆ గదిలోని కిటికీలు పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. మరియు సూర్య కాంతి నేరుగా గదిలోకి ప్రవేశించకుండా కర్టెన్‌ లను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు గదిలోని చల్లని గాలి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.

దీంతోపాటు ఎయిర్‌ కండిషనర్ ను నిరంతరం వినియోగిస్తే .. అధిక విద్యుత్‌ ఛార్జీలకు అవకాశం ఉంటుంది. అందువల్ల టైమర్‌ ఏర్పాటు చేసుకొని.. గది అవసరమైన ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు ఆటోమేటిక్‌ గా లేదా మాన్యువల్‌ గా ఆఫ్‌ చేసుకొనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకొనే AC లకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. మరియు ఫిల్టర్లను శుభ్రం చేయడం లేదా అవసరం అయితే కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లీకేజీ సమస్యలు లేకుండా చూడాలి. లీకేజీతో ఎయిర్‌ కండిషనర్‌ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

దీంతోపాటు ఏసీలు వినియోగిస్తున్న సమయంలో గదులను త్వరగా చల్లగా మార్చేందుకు ఫ్యాన్‌ ను ఉపయోగించవచ్చు. ఏసీ ద్వారా గది అంతా చల్లదనం విస్తరించేందుకు ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం ఉంటుంది. ఫ్యాన్‌ లు ఉపయోగించడం వలన త్వరగా గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.

ఏసీలను కొనుగోలు చేసే సమయంలో గది విస్తీర్ణం, ఇతర అవసరాలు, ఇంటి నిర్మాణం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఏసీలు రెండు రకాలు.. విండో AC, స్ప్లిట్‌ AC రకాలుగా ఉంటుంది. వీటి ధరల్లోని వ్యత్యాసం ఉంటుంది. దీంతోపాటు సామర్థ్యం ఆధారంగా కొనుగోలు చేయాలి. చిన్న గదులకు 1 టన్ను సామర్థ్యం కలిగిన ఏసీ సరిపోతుంది. పెద్ద గదులకు 1.5 టన్ను సామర్థ్యం కలిగిన ఎయిర్‌ కండిషనర్ కావాల్సి ఉంటుంది.

దీంతోపాటు మంచి ఎనర్జీ రేటింగ్‌ కలిగిన ACను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధారంగా ఈ రేటింగ్‌ ఇస్తారు. అయితే విద్యుత్ ఛార్జీలను ఆదా చేసేందుకు 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన కొనుగోలు చేయడం ఉత్తమం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
How to use Air conditioner efficiently here are the telugu tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X