మీ స్మార్ట్‌ఫోన్‌ను అలెక్సాతో కనెక్ట్ చేసుకోండిలా...

|

సీటెల్ వరల్డ్ ఫెయిర్ 1962లో ఐబీఎం పెవిలియన్ తొలిసారిగా ఐబీఎం షూ బాక్స్ పేరిట ఒక సెల్ఫ్ స్పీకర్ ను తయారు చేసి ప్రవేశ పెట్టింది. ఆ బాక్స్ ను ప్రత్యేకంగా లెక్కలు చేసేందుకు రూపొందించారు. ఈ బ్యాంక్స్ మేథ్స్ ఆధారంగా ఉన్న 16 పదాలతో పాటు సున్నా నుంచి తొమ్మిది వరకూ అంకెలను సైతం గుర్తించేది. చిన్నపాటి గణిత సమీకరణాలను ఈ షూ బాక్స్ చేసి స్పీకర్ ద్వారా ఔట్ పుట్ అందించేది.

 
మీ స్మార్ట్‌ఫోన్‌ను అలెక్సాతో కనెక్ట్ చేసుకోండిలా...
సరిగ్గా అరవై సంవత్సరాల అనంతరం మొగ్గ తొడిగిన వాయిస్ అసిస్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో తయారు అయ్యింది. గూగుల్ ఇప్పటికే వాయిస్ అసిస్టెంట్ ద్వారా సంచలనం స్రుష్టిస్తోంది. ముఖ్యంగా గూగుల్ సెర్చింజన్ వాయిస్ కమాండ్స్ ద్వారా సెర్చి చేయడంతో పాటు గూగుల్ అందిస్తున్న పలు సర్వీసులను పూర్తి వాయిస్ కమాండ్స్ ద్వారానే అందిస్తోంది. ఉదాహరణకు టికెట్స్ బుకింగ్, మంచి రెస్టారెంట్లలో ఫుడ్ బుకింగ్ సహా పలు సర్వీసులను వాయిస్ అసిస్టెంట్ అందిస్తోంది.

జియోకి రాందేవ్ బాబా షాక్,మార్కెట్లోకి పతంజలి సిమ్‌కార్డ్స్,రూ.144కే అన్‌లిమిటెడ్జియోకి రాందేవ్ బాబా షాక్,మార్కెట్లోకి పతంజలి సిమ్‌కార్డ్స్,రూ.144కే అన్‌లిమిటెడ్

అయితే ప్రస్తుతం వాయిస్ అసిస్టెంట్ సర్వీసు అందిస్తున్న సంస్థల్లో అమెజాన్ ఎకో, గూగుల్ కస్టమర్లకు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అలెక్సా వాయిస్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుందాం.. అమెజాన్ ఎకో మొదటి సారిగా అలెక్సాను వాడింది. ప్రస్తుతం అమెజాన్ ఎకో, అలాగే ఎకో డాట్ ప్రాడెక్టులు మార్కెట్లో ఉన్నాయి వీటిని అమెజాన్ ల్యాబ్ 126 అభివ్రుద్ధి చేసింది. ప్రస్తుతం అలెక్సా ప్రపంచ వ్యాప్తంగా టెక్ ప్రియుల మది దోచుకుంటోంది. అమెజాన్ ఉత్పత్తి అయిన అలెక్సా మీ పెట్టుబడికి సరైన విలువ అనే చెప్పవచ్చు. అయితే అలెక్సాను ఆండ్రాయిడ్ కు కనెక్ట్ చేసుకునే వీలుంది.

1) ముందుగా అమెజాన్ అలెక్సా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
2) అనంతరం అమెజాన్ అకౌంట్ కు లాగిన్ అవ్వండి.
3) అనంతరం మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
4) అనంతరం డీఫాల్ట్ యాప్స్ లోకి వెళ్లి, అసిస్ట్ అండ్ వాయిస్ ఇన్ పుట్ లోకి వెళ్లి, అసిస్ట్ యాప్ ను క్లిక్ చేయండి
5) ఇప్పుడు అమెజాన్ అలెక్సా మీ ఫోన్ లో ఒక ఆప్షన్ గా వచ్చే లభిస్తుంది.
6) ఇప్పుడు అలెక్సా పనిచేసేందుకు మీ ఫోన్ హోమ్ బటన్ ను ప్రెస్ చేస్తే చాలు ఇక మీ మైక్రో ఫోన్ అలెక్సా తరహాలో కమాండ్స్ తీసుకుంటుంది.

Best Mobiles in India

English summary
How to use Alexa as default voice assistant on Android More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X