Apple ఐఫోన్ 'బ్యాక్‌గ్రౌండ్ సౌండ్' కొత్త ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?

|

స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమవుతున్న ప్రస్తుత రోజులలో కొంతమంది దీనిని పిన్-డ్రాప్ నిశబ్దంతో వినియోగించడానికి ఇష్టపడతారు. అయితే మరికొందరు తమ యొక్క రోజువారీ కార్యకలాపాలతో పాటుగా ఫోన్ మీద దృష్టి కేంద్రీకరించడానికి బ్యాక్ గ్రౌండ్ సౌండ్లపై ఆధారపడతారు. మీరు ప్రయత్నించిన తర్వాత కూడా దేనిపైనా దృష్టి సారించలేకపోతే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లు చాలా సహాయకారిగా ఉంటాయి. సోషల్ మీడియాలోని ట్రెండ్‌ల చుట్టూ మీ యొక్క మన మనస్సులు తిరుగుతూ ఉంటే కనుక మరియు మీరు ఏదైనా ఒకదానిపై దృష్టి కేంద్రీకరించడం కోసం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని ఉపయోగించడం ప్రారంభిస్తే కనుక అది మీ యొక్క అవసరాల మీద దృష్టి సారించవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను ఉపయోగించడం కోసం పర్ఫెక్ట్ ఆడియో కోసం యూట్యూబ్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా మీ ఐఫోన్‌లోని ఇన్‌బిల్ట్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను ఉపయోగించవచ్చు.

 
How to Use Apple iPhone New Feature Background Sound to Improve Focus

ఆపిల్ ఐఫోన్లు మీ పనిపై దృష్టి పెట్టడానికి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. iOS 15తో ఆపిల్ సంస్థ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఫీచర్‌ని యాక్సెసిబిలిటీ ఆప్షన్‌గా జోడించింది. ఐఫోన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఐఫోన్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఫీచర్‌ని ఉపయోగించే విధానం

How to Use Apple iPhone New Feature Background Sound to Improve Focus

ఐఫోన్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఫీచర్‌ని ఉపయోగించడానికి మీ యొక్క ఐఫోన్ తాజా iOS వెర్షన్‌లో ఉందని నిర్ధారించుకోండి. ఈ ఫీచర్ iOS 15 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వాటిలో మాత్రమే అందుబాటులో ఉంది.

** మీ ఐఫోన్ లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.

** తరువాత క్రిందికి స్క్రోల్ చేసి యాక్సెసిబిలిటీ ఎంపికను కనుగొని దాని మీద క్లిక్ చేయండి.

** క్రిందికి స్వైప్ చేసి ఆడియో/విజువల్ ఎంపిక కోసం వెతికి దానిపై క్లిక్ చేయండి.

** ఇందులో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

** ఫీచర్‌ని ఆన్ చేయడానికి కుడివైపు ఎగువ భాగంలో ఉన్న టోగుల్‌పై నొక్కండి.

** ఇప్పుడు బ్యాలెన్స్‌డ్ నాయిస్, బ్రైట్ నాయిస్, డార్క్ నాయిస్, ఓషన్, రైన్ మరియు స్ట్రీమ్ వంటి ఆరు విభిన్న సౌండ్స్ ఎంపికల మధ్య ఎంచుకోవడానికి సౌండ్స్‌పై క్లిక్ చేయండి.

How to Use Apple iPhone New Feature Background Sound to Improve Focus

గమనిక: మొదటిసారిగా ఐఫోన్ లాక్ చేయబడినా లేదా మరేదైనా యాప్‌లో ఉన్నప్పటికీ సౌండ్ కొనసాగుతుంది. కాబట్టి అది అధిక సౌండ్ తో లేనందున ఉపయోగంలో లేనప్పుడు దాన్ని ఆపివేయాలని గుర్తుంచుకోండి. అలాగే మీకు తెలియకుండానే చాలా గంటలపాటు దాన్ని ఆన్‌లో ఉంచవచ్చు. అలాగే ఈ ఫీచర్‌ని సులభంగా యాక్సెస్ చేయడానికి సెట్టింగ్‌లు > కంట్రోల్ సెంటర్ > యాడ్ (+) హియరింగ్ షార్ట్‌కట్‌ వంటి అన్ని కంట్రోల్‌లను ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కంట్రోల్ సెంటర్‌ను ఓపెన్ చేసే మీరు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను సులభంగా ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to Use Apple iPhone New Feature 'Background Sound' to Improve Focus

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X