క్రోమ్ ఓఎస్ సిస్టంలలో ఎమోజీలను వాడటం ఎలా ?

|

సోషల్ మీడియాలో ఇమోజీలదే ఇప్పుడు రాజ్యం అని చెప్పవచ్చు. మీ భావాలను మాటల్లో కన్నా ఎమోజీల్లో ఎక్స్ ప్రెస్ చేస్తే చాలా ట్రెండీగానూ సమయానుకూలంగానూ ఉంటుంది. ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇలా చాలా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎమోజీలు రాజ్యమేలుతున్నాయి. అయితే మీ క్రోమ్ బుక్ నుంచి ఎమోజీలను ఎంపిక చేసుకొని పోస్ట్ చేయడం చిన్న ట్రిక్ తో కూడిన పని, అయితే ఆ సమస్యను ఇట్టే సాల్వ్ చేసేందుకు కొన్ని టిప్స్ మీకోసం..

 
క్రోమ్ ఓఎస్ సిస్టంలలో ఎమోజీలను వాడటం ఎలా ?

క్రోమ్ ఓఎస్ ను కలిగి ఉంటే ఎమోజీలను వాడటం ఎలా ?
క్రోమ్ ఓఎస్‌లో రకరకాల ఎమోజీలను వాడే అవకాశం ఉంది. ఇందు కోసం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..
స్టెప్ 1 : షెల్ఫ్ లోని ఇన్‌పుట్ ఆపరేషన్స్ ను ఎంచుకోండి.
ముందుగా క్రోమ్ ఓపెన్ చేసిన అందులోని షెల్ఫ్ లోకి వెళ్లండి, అయితే ఎలాంటి ఎక్స్‌టెన్షన్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయాల్సింది. క్రోమ్ ఓఎస్‌లోని కుడి మూల వైపు ఉన్న అవతార్ ను టాప్ చేయండి. అప్పుడు మీకు గేర్ ఐకాన్ అనేది ప్రత్యక్షం అవుతుంది. అనంతరం మెనూలో సెట్టింగ్స్ కనిపిస్తాయి. స్క్రోల్ డౌన్ చేసిన అనంతరం కింది వైపు సెట్టింగ్స్ లో అడ్వాన్స్ డ్ సెక్షన్ ను ఎంపిక చేసుకోండి. అనంతరం లాంగ్వేజ్ అండ్ ఇన్ పుట్ సెక్షన్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఇన్‌పుట్ మెథడ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో "show input options on the Shlef" ను ఎనబుల్ చేయండి.

స్టెప్ 2 : వర్చువల్ కీ బోర్డ్ లాంచ్ చేసుకోండి
ఇప్పుడు ఇన్‌పుట్ ఆప్షన్స్ ను మీరు సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసిన తర్వాత క్రోమ్ బుక్‌లోని షెల్ఫ్ ను ఓపెన్ చేయండి. అప్పుడు పాప్అప్ డైలాగ్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ టెక్స్ట్ లో వివిధ రకాల ఎమోజీలు ప్రత్యక్షమవుతాయి. మీరు ఎమోజీని కీ బోర్డును ఎంచుకోవడం ద్వారా పలు స్మైలీలను మెసేజీల రూపంలో పొందే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?

స్టెప్ 3 : మీకు కావాల్సిన ఎమోజీని ఎంచుకోండి
ఒక్కో సారి మీకు కావాల్సిన ఎమోజీలను వర్చువల్ కీబోర్డులో పొందలేకపొవచ్చు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సైతం ఇలాంటి ఇబ్బందే తలెత్తే ప్రమాదం ఉంది. అప్పుడు ఎమోజీల సెక్షన్ లోకి వెళ్లి " Three dot menu icon" ను క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కావాల్సిన బోలెడు ఎమోజీలు ప్రత్యక్సం అవుతుంది. వాటిని పోస్ట్ చేయడం ద్వారా మీరు వాటిని యాడ్ చేసుకునే అవకాశం దక్కుతుంది.

ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓఎస్ లో ఎమోజీలను ఎంపిక చేసుకోవడం ఎంతో సులువుగా మారిపోయింది కదా..

Best Mobiles in India

English summary
Emojis have made it so easy to express our feelings more efficiently. If you are like me, who cannot survive without emojis, then this post is for you.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X