ఇలా చేస్తే, మీ ఫోన్‌లోని మెమరీ కార్డు కూడా ఇంటర్నల్ స్టోరేజ్‌లా మారిపోతుంది

మెమరీ కార్డులోని ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌ స్పేస్‌ను సైతం ఇంటర్నల్ స్టోరేజ్‌ స్పేస్‌లా మార్చేవేయగలిగే సరికొత్త ఆప్షన్‌ను గూగుల్ తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. Android Marshmallow ఆపై వర్షన్ ఓఎస్ పై రన్ అయ్యే ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ ప్రత్యేకమైన ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులో ఉంచింది. క్రింది గైడ్‌ను ఫాలో అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఎస్డీ స్టోరేజ్‌ను ఇంటర్నల్ స్టోరేజ్‌‌లోకి మార్చేసుకోవచ్చు.

Redmi రికార్డులు బ్రేక్ చేస్తుందా?, టార్గెట్ 70 లక్షల Note 4 ఫోన్‌లు

ఇలా చేస్తే, మెమరీ కార్డు కూడా ఇంటర్నల్ స్టోరేజ్‌లా మారిపోతుంది

ముఖ్య గమనిక : మైక్రోఎస్డీ స్టోరేజ్‌ను ఇంటర్నల్ స్టోరేజ్‌‌లోకి మార్చే క్రమంలో మీ మైక్రోఎస్డీ కార్డులో ఇంతకుముందు స్టోర్ అయి ఉన్న డేటా మొత్తం చెరిగిపోతుంది. కాబట్టి, ఈ ప్రొసీజర్ కు ఉపక్రమించే ముందు మెమరీ కార్డులోని డేటా మొత్తం బ్యాకప్ చేసుకోండి.

స్టెప్ 1

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసిన మైక్రోఎస్డీ కార్డ్ మంచి వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి.

స్టెప్ 2

ముందుగా ఫోన్ 'Settings'లోకి వెళ్లి మెనూలోని 'Storage and USB'ని సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3

'Storage and USB' విభాగంలో 'Portable storage' సెక్షన్ క్రింద మీ ఎక్స్‌టర్నల్ మైక్రోఎస్డీ కార్డ్ కనిపిస్తుంది.

సామ్‌సంగ్‌కు షాక్, 10 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇవే

ఇలా చేస్తే, మెమరీ కార్డు కూడా ఇంటర్నల్ స్టోరేజ్‌లా మారిపోతుంది

స్టెప్ 4

External microSD విభాగంలోకి జంప్ అయిన తరువాత మీకు టాప్ రైట్ కార్నర్‌లో three-dot మెనూ కనిపిస్తుంది. ఆ డాట్స్ పై క్లిక్ చేసిన వెంటనే 'Settings' ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 5

మీ ఎక్స్‌టర్నల్ మైక్రోఎస్డీ కార్డ్‌కు సంబంధించి 'Settings' విభాగంలోకి వెళ్లిన తరువాత Eject, Format, Format as Internal, Movie Media పేర్లతో 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Format as Internalను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 6

Format as Internal ఆప్షన్ ను సెలక్ట్ చేసుకున్న వెంటనే మీ మైక్రోఎస్డీ కార్డులోని డేటా మొత్తం Erase కాబడుతుంది. ఒక వేళ అలా జరగని పక్షంలో 'Erase and Format' పై క్లిక్ చేయండి.

స్టెప్ 7

ఈ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయిన వెంటనే మీ ఎక్స్‌టర్నల్ ఎస్డీ కార్డ్ కాస్తా ఇంటర్నల్ స్టోరేజ్‌లా మారిపోతుంది.

SIM క్లోన్ చేసి 10 లక్షలు కాజేసారు, ఆ కాల్స్ నమ్మకండి

English summary
How to use external SD card as internal memory on your Android smartphone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot