Facebook Live ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

సోషల్ మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌ కోట్లాది మంది యూజర్లతో దూసుకుపోతోంది.

|

సోషల్ మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌ కోట్లాది మంది యూజర్లతో దూసుకుపోతోంది. ఈ సామాజిక సంబంధాల మాధ్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా యూజర్లు వినియోగించుకుంటున్నట్లు ఓ అంచనా. కొత్త స్నేహితులను యాడ్ చేసుకోవటం దగ్గర నుంచి వీడియో చాటింగ్ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను ఫేస్‌బుక్ తీర్చేస్తోంది.వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న ఫేస్‌బుక్ ఏప్రిల్ 2016లో Facebook Live పేరుతో ఓ విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలుఅత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో..

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో..

ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీసును ఉపయోగించుకోవటం ద్వారా మీ వీడియోను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ లైవ్ ఫీచర్‌ను వ్యక్తిగత అలానే కమర్షియల్ అవసరాలకు వినియోగించుకోవచ్చు. మొబైల్ ఫోన్‌లలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా Facebook Live ఫీచర్‌ను స్మార్ట్‌ఫోన్‌లలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేదాని పై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను మీ ముందు ఉంచుతున్నాం...

కెమెరా ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా...

కెమెరా ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా...

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి న్యూస్‌ఫీడ్ సెక్షన్‌లోకి వెళ్లండి. న్యూస్‌ఫీడ్ సెక్షన్‌లోకి వెళ్లిన తరువాత బోటమ్ లెఫ్ట్ కార్నర్‌లో చిన్న కెమెరా ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరొక పద్ధతిలో భాగంగా మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోని స్టేటస్ బార్ పై క్లిక్ చేసిన్లయితే డ్రాప్-డౌన్ మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. వాటిలో లైవ్ వీడియో ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. లైవ్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది.

 ఫేస్‌బుక్ లైవ్ ఫీచర్‌ను మొదటిసారి వాడుతున్నట్లయితే..
 

ఫేస్‌బుక్ లైవ్ ఫీచర్‌ను మొదటిసారి వాడుతున్నట్లయితే..

మీరు ఫేస్‌బుక్ లైవ్ ఫీచర్‌ను మొదటిసారిగా వినియోగించుకుంటున్నట్లయితే మీ ఫోన్ కెమెరా అలానే మైక్రోఫోన్‌ను యాక్సిస్ చేసుకునేందుకు పర్మిషన్‌ను ఇవ్వవల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ పూర్తి అయిన తరువాత బోటమ్ లెఫ్ట్ కార్నర్‌లో మీ ఫోటో వద్దకు వెళ్లి మీ లైవ్ ఫీడ్‌ను ఎవరు చూడాలనేదానికి సంబంధించి ప్రైవసీ సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకున్న తరువాత మీ వీడియోకు ఒక పేరు పెట్టాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆ వీడియోకు సంబంధించి కొంత డిస్క్రిప్షన్‌ను కూడా రాయవల్సి ఉంటుంది. ఇదే సమయంలో మీ వీడియోకు మిత్రులను ట్యాగ్ చేయటంతో పాటు లొకేషన్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు.

వీడియో క్వాలిటీ బాగుండాలంటే..?

వీడియో క్వాలిటీ బాగుండాలంటే..?

ఫేస్‌బుక్ లైవ్ వీడియోను స్టార్ట్ చేసే ముందు కెమెరాను సరైన డైరెక్షన్‌లో సెట్ చేసుకోవటంతో పాటు ఫిల్టర్స్‌ను యాడ్ చేసుకున్నట్లయితే వీడియో క్వాలిటీ మరింత బాగుటుంది. సెట్టింగ్స్‌తో మీరు సంతృప్తి చెందిన తరువాత "Go Live" బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ లైవ్ స్ట్రీమింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఇతరుల న్యూస్‌ఫీడ్‌లో మీ వీడియో అనేది ప్రత్యక్ష ప్రసారమవుతుంటుంది. వాళ్లు ఈ వీడియోను చూడటంతో పాటు డౌన్‌లోడ్ కూడా చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Facebook is one of the most popular social media networking platforms and is used by more than two billion users across the globe.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X