SHAREitకి గూగుల్ షాక్, Files Go కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..
రోజు రోజుకు టెక్నాలజీలో కొత్త కొత్త మార్పులు వస్తున్న నేఫధ్యంలో గూగుల్ సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది.
రోజు రోజుకు టెక్నాలజీలో కొత్త కొత్త మార్పులు వస్తున్న నేఫధ్యంలో గూగుల్ సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. కొత్త కొత్త యాప్ లకు పోటీలుగా తన యాప్ లను బరిలోకి దింపుతోంది. ఇందులో భాగంగా షేర్‌ఇట్ యాప్ కి పోటీగా కొత్త యాప్‌ని మార్కెట్లోకి దించుతోంది. ఇప్పటికే ఈ యాప్ బేటా వర్షన్ గూగుల్ ప్లే స్టోర్‌లోకి వచ్చేసింది.

షేర్‌ఇట్‌తో బ్లూటూత్‌కి కష్టకాలం
కొన్నాళ్ల క్రితం వరకు ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు ఫొటోలు/ఫైల్స్ పంపించాలంటే బ్లూటూత్ ఒక్కటే దిక్కు. ఆ తర్వాత షేర్‌ఇట్ వచ్చి బ్లూటూత్‌ని పక్కకు నెట్టేసింది.

SHAREitకి పోటీగా ఫైల్స్ టు గో
అయితే ఇప్పుడు SHAREitని ఢీకొట్టేందుకు గూగుల్ తన ప్రయత్నాలు ప్రారంభించింది.ఫైల్స్ టు గో' పేరుతో ఓ యాప్‌ను సిద్ధం చేసి మార్కెట్లోకి వదులుతోంది.

షేర్‌ఇట్ తరహాలో..
దీని ద్వారా షేర్‌ఇట్ తరహాలో ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ పంపించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆప్ ప్రయోగాత్మకంగా కొందరికి అందుబాటులో ఉంది.
Image source : Google

అదనపు/అనవసర ఫైల్స్..
ఈ యాప్‌ను కేవలం ఫైల్స్ పంపించుకోవడానికే కాకుండా మీ మొబైల్‌లోని అదనపు/అనవసర ఫైల్స్ డిలీట్ చేయడానికి కూడా వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీని ద్వారా మీ ఫోన్ స్పేస్ పెరుగుతుందని గూగుల్ తెలిపింది.

200 రెట్లు కన్నా వేగంగా..
బ్లూటూత్ కంటే 200 రెట్లు వేగంగా షేర్‌ఇట్ ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తుందని, అయితే గూగుల్ ‘ఫైల్స్ టు గో' దానికి మించిన పని తీరు కనబరుస్తుందని గూగుల్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఎటువంటి మనీ పే చేయనవసరం లేదని..
ఇది వాడేందుకు మీరు ఎటువంటి మనీ పే చేయనవసరం లేదని, ఎటువంటి యాడ్స్ ప్లే కావని గూగుల్ చెబుతోంది. కాగా ఇది ఆండ్రాయిడ్ 5.0 వర్సన్ తరువాత మొబైల్స్ కు రన్ అవుతుంది.

6ఎంబి వరకు ఫైల్స్ స్టోర్..
కాగా ఈ యాప్‌లో మీకు 6ఎంబి వరకు ఫైల్స్ స్టోర్ చేసకోవచ్చు. కొన్ని బగ్స్ సమస్యలు ఉన్నాయని అయినా ఇది పూర్తిస్థాయి పనితీరు కనపరుస్తోందని, అతి త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని గూగుల్ తెలిపింది.

యాప్ డౌన్లోడ్
ఈ యాప్ డౌన్లోడ్ చేయాలనుకుంటే మీరు ఈ కింది లింక్ ద్వారా ప్రయత్నించవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.nbu.files


Click it and Unblock the Notifications