Just In
- 1 hr ago
Vivo V25 Pro 5G కలర్ మారే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- 1 hr ago
Airtel ముందస్తు స్పెక్ట్రమ్ చెల్లింపుగా DoTకి ఎంత చెల్లించిందో తెలుసా?
- 3 hrs ago
జియో రూ.700 ధర పరిధిలోని రెండు ప్లాన్లలో బెటర్ ఏది?
- 4 hrs ago
Realme 9i 5G లాంచ్ రేపే ! లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.
Don't Miss
- News
మధ్యప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న తెలుగు స్వామీజీ??
- Automobiles
వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?
- Sports
Mohammed Kaif : శిఖర్ విషయంలో జరిగింది కరెక్ట్ కాదు.. ధావన్ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ ఆడితే ఏంపోయేది
- Movies
Janaki Kalaganaledu August 17th: జానకిని సర్ప్రైజ్ చేసిన జ్ఞానాంబ.. అయినా కోపం తగ్గలేదు!
- Lifestyle
Janmashtami Decorations: శ్రీకృష్ణ జన్మాష్టమికి ఈ అలంకరణలు ప్రయత్నించండి
- Finance
Gold: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గోల్డ్ ట్రేడర్.. ఎలా కుప్పకూలింది..? ఆ మోసంతో..
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Apple iPhoneలోని యాప్‌లను సైన్ ఇన్ చేయడానికి క్రోమ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం ఎలా?
స్మార్ట్ఫోన్లను ఉపయోగించడం అనేది నేడు అధికమవుతున్నది. అయితే కొంత మంది ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తుంటే కనుక మరికొంత మంది ఐఫోన్ లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుండి ఐఫోన్ కి మారి ఉంటే కనుక మీరు మీ యొక్క ముందు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉపయోగిస్తున్న అన్ని యాప్‌లు, వెబ్సైట్లు మరియు సర్వీసులకు సైన్ ఇన్ చేయడానికి మీ ఐఫోన్ లో గూగుల్ క్రోమ్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత కంప్యూటర్ లోని క్రోమ్ లో అధికంగా యాక్సెస్ చేసిన మరియు అలవాటుపడిన సర్వీసులను ఇప్పుడు మీరు మీ యొక్క కొత్త ఐఫోన్ లో కూడా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందుకోసం మీరు గూగుల్ క్రోమ్ లో అన్ని పాస్‌వర్డ్‌లను సేవ్ చేసి ఆపై వాటిని మీ ఐఫోన్ లో యాక్సెస్ చేయవచ్చు. అయితే దీనిని ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే కనుక కింద గల దశల వారి గైడ్ ని అనుసరించండి.

Google Chromeలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసే విధానం
గూగుల్ క్రోమ్ మీ పాస్‌వర్డ్‌ను డిఫాల్ట్‌గా సేవ్ చేయడానికి ఆఫర్ చేస్తుంది. అయితే మీరు ఈ ఎంపికను ఎప్పుడైనా ఆఫ్ లేదా ఆన్ చేయవచ్చు. కాబట్టి మీరు డిఫాల్ట్‌గా ఈ ఎంపికను ఆఫ్ చేసినట్లయితే దీన్ని ఆన్ చేయడానికి ఈ విధానాన్ని అనుసరించండి.
స్టెప్ 1: మీ యొక్క వ్యక్తిగత కంప్యూటర్లో క్రోమ్ ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: బ్రౌజర్ యొక్క కుడివైపు ఎగువ మూలలో గల ప్రొఫైల్ ఎంపికపై క్లిక్ చేసి ఆపై పాస్‌వర్డ్‌ల ఎంపికను క్లిక్ చేయండి.
స్టెప్ 3: తరువాత పాస్‌వర్డ్‌ల చిహ్నాన్ని ఎంచుకోండి. ఒకవేళ మీరు కనుగొనలేకపోతే స్క్రీన్ ఎగువన ఉన్న 'మోర్' బటన్‌ను క్లిక్ చేసి ఆపై సెట్టింగ్‌ల బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: తర్వాత ఆటోఫిల్ ఆప్షన్‌కి వెళ్లి అక్కడి నుంచి పాస్వర్డ్స్ ఆప్షన్‌కు వెళ్లండి.
స్టెప్ 5: చివరగా 'ఆఫర్ టు సేవ్ పాస్వర్డ్లు' ఎంపికను ఆన్ చేయండి.

iPhoneలో క్రోమ్ నుండి పాస్‌వర్డ్‌లను ఉపయోగించడానికి ఇతర యాప్‌లను అనుమతించే విధానం
స్టెప్ 1: మీ ఐఫోన్ లో సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లి మీ డివైస్ యొక్క సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు పాస్వర్డ్స్ ఎంపికను ఎంచుకోండి.
స్టెప్ 3: మీ ఫోన్ ని అన్‌లాక్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించండి.
స్టెప్ 4: ఇప్పుడు ఆటోఫిల్ పాస్‌వర్డ్‌లను ఎంచుకోండి.
స్టెప్ 5: తరువాత ఆటోఫిల్ పాస్‌వర్డ్‌లను ఆన్ చేయండి.
స్టెప్ 6: కింది స్క్రీన్‌లో క్రోమ్ ఎంపికను ఎంచుకోండి.
స్టెప్ 7: సెటప్‌ని పూర్తి చేయడానికి స్క్రీన్‌పై సూచనలను అనుసరించండి.

iPhoneలోని ఇతర యాప్‌లలో క్రోమ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించే విధానం
స్టెప్ 1: మీ ఐఫోన్ లో మీరు సైన్ ఇన్ చేయాలనుకుంటున్న యాప్‌ని ఎంచుకోండి.
స్టెప్ 2: సైన్-ఇన్ పేజీలో యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ ఫీల్డ్‌ను నొక్కండి.
స్టెప్ 3: కీబోర్డ్‌లో పాస్‌వర్డ్‌లను ఎంచుకోండి.
స్టెప్ 4: ఆటోఫిల్ని అనుమతించడానికి మీరు మీ డివైస్ కి మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
స్టెప్ 5: మీరు ఉపయోగించాలనుకునే పాస్‌వర్డ్‌ను ఎంచుకోని మళ్ళి తిరిగి ఆన్ చేయడం మంచిది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086