మీరు తెలుగు మాట్లాడితే అదే టైప్ చేస్తుంది,ఈ యాప్ గురించి తెలుసా !

|

టెక్నాలజీ అమితవేగంతో దూసుకుపోతున్న నేటి ప్రపంచంలో పనులు చకచకా జరిగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడేవారికి టైపింగ్ అనేది చాలా సమస్యగా ఉంటుంది. మనం మాట్లాడితే టైప్ అయ్యే విధంగా ఏదైనా ఉంటే బాగుంటుదనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం మార్కెట్లో కొత్త యాప్ సిద్ధంగా ఉంది. ఈ యాప్ ద్వారా మీరు తెలుగులో ఏం మాట్లాడితే అదే మీకు టైప్ చేసి పెడుతుంది. అలాంటి ఓ యాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

వణికిస్తున్న వాట్సప్ పుకార్లు,హెచ్చరిస్తున్న కేంద్రం,ఈ వార్త వచ్చిందా!వణికిస్తున్న వాట్సప్ పుకార్లు,హెచ్చరిస్తున్న కేంద్రం,ఈ వార్త వచ్చిందా!

జీబోర్టు

జీబోర్టు

మీు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ జీబోర్టుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. లింక్ కోసం మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు
https://play.google.com/store/apps/details?id=com.google.android.inputmethod.latin&hl=en_IN

లాంగ్వేజ్ ఇన్ పుట్ ఆప్షన్..

లాంగ్వేజ్ ఇన్ పుట్ ఆప్షన్..

అది ఇన్ స్టాల్ అయిన తరువాత మీ ఫోన్లో సెట్టింగ్స్ లో లాంగ్వేజ్ ఇన్ పుట్ ఆప్షన్ కు వెళ్లాలి. అందులో డిఫాల్ట్ కీబోర్డు ఆప్షన్ ఉటుంది. దాన్ని క్లిక్ చేస్తే కింద వివిధ కీబోర్డులు కనిపిస్తాయి. అందులో తెలుగు జీబోర్డు అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి.

వాట్సప్ లేదా ఫేస్ బుక్
 

వాట్సప్ లేదా ఫేస్ బుక్

వాట్సప్ లేదా ఫేస్ బుక్ మరొక చోట ఎక్కడయినా టైప్ చేయాలనుకున్నప్పుడు జీఆకారంలో కీబోర్డు కనిపిస్తుంది. గ్లోబ్ ను క్లిక్ చేస్తే తెలుగు నుంచి ఇంగ్లిష్ కు ఇంగ్లిష్ సెలక్ట్ అయి ఉంటే తెలుగుకు మారిపోతుంది.

స్పేస్ బార్ పై ఇంగ్లిష్ అని ఉంటే

స్పేస్ బార్ పై ఇంగ్లిష్ అని ఉంటే

ఒకవేళ కీబోర్డులో కింద స్పేస్ బార్ పై ఇంగ్లిష్ అని ఉంటే గ్లోబ్ ను ఒకసారి సెలక్ట్ చేయాలి. దాంతో తెలుగులోకి మారుతుంది.

మైక్ సింబల్ ను ఆన్ చేసి..

మైక్ సింబల్ ను ఆన్ చేసి..

తర్వాత కీబోర్డులోనే పైన కనిపించే మైక్ సింబల్ ను ఆన్ చేసి నిదానంగా ఒక పదం తర్వాత ఒక పదం పెద్దగా పలుకుతుంటే తెలుగులో టైప్ అవుతూ ఉంటుంది.

మీరు స్వయంగా టైప్ చేయాలనుకుంటే

మీరు స్వయంగా టైప్ చేయాలనుకుంటే

ఒకవేళ తెలుగులో వాయిస్ టైపింగ్ కాకుండా మీరు స్వయంగా టైప్ చేయాలనుకుంటే పైన మైక్ సింబల్ తో పని లేకుండా కీ బోర్డులో తెలుగు ఎనేబుల్ అయిన తర్వాత ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగులో టైప్ అవుతుంది.

మరో ఆప్సన్

మరో ఆప్సన్

గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి గూగుల్ ఇండిక్ కీబోర్డు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా మీరు తెలుగు టైప్ చేయవచ్చు. సెట్టింగ్స్ లో లాంగ్వేజ్ అండ్ ఇన్ పుట్ లో గూగుల్ ఇండిక్ కీబోర్డు ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.

ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగులో..

ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగులో..

సెలక్ట్ చేసుకున్న తరువాత వాట్సప్ , ఫేస్ బుక్ లో ఏదైనా టైప్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. ఉదాహరణకు niku అని టైప్ చేస్తే తెలుగులో నీకు అని పడుతుంది.

Best Mobiles in India

English summary
How to use Google Keyboard on any phone More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X