Home
How to

Google Lens ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన ప్రొడక్ట్ పోర్టిఫోలియోను మరింతగా విస్తరింపజేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ఈ సంస్థ లాంచ్ చేస్తోన్న ప్రొడక్ట్స్ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకార

By Bommu Sivanjaneyulu

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన ప్రొడక్ట్ పోర్టిఫోలియోను మరింతగా విస్తరింపజేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ఈ సంస్థ లాంచ్ చేస్తోన్న ప్రొడక్ట్స్ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా తన Google Lens ఫీచర్‌ను మరింతగా ఆధునీకరించి సరికొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీుసకువచ్చింది. ఈ విజువల్ సెర్చ్ టూల్ ద్వారా ఏదైనా ఫోటోలని ఆబెక్ట్స్ సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. గూగుల్ లెన్స్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఓఎస్ యూజర్లు కూడా ఉపయోగించుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ లెన్స్ ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ లెన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే..?

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ లెన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ఫోటోస్ యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. అప్‌డేట్ అయిన తరువాత స్ర్కీన్ పై యాప్‌ను మరోమారు లాంచ్ చేసి ఓ ఫోటోను సెలక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలక్ట్ అయిన తరువాత స్ర్కీన్ పై కనిపించే Google Lens ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మరో విండో ఓపెన్ అవుతుంది. ఈ స్ర్కీన్ పై ఆ ఫోటోకు సంబంధించి అన్ని యాక్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు కావల్సిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఎక్స్‌ప్లోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ గూగుల్ లెన్స్ యాక్టివిటీస్‌ను "My Activity" పేజీలోకి వెళ్లి ట్రాక్ చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ యూజర్లు గూగుల్ లెన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే..?

యాపిల్ ఐఫోన్ యూజర్లు గూగుల్ లెన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే..?

యాపిల్ ఐఫోన్ యూజర్లు గూగుల్ లెన్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా తమ డివైస్‌లోని గూగుల్ ఫోటోస్ యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. యాప్ అప్‌డేట్ అయిన తరువాత ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటోన్న ఫోటోను సెలక్ట్ చేసుకోండి. ఫోటో ఓపెన్ అయిన తరువాత స్ర్కీన్ పై కనిపించే Google Lens ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మరో విండో ఓపెన్ అవుతుంది. ఈ స్ర్కీన్ పై ఆ ఫోటోకు సంబంధించి అన్ని యాక్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు కావల్సిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఎక్స్‌ప్లోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

గూగుల్ ఫోటోస్ ఇప్పుడు మరిన్ని ఆధునిక హంగులతో..

గూగుల్ ఫోటోస్ ఇప్పుడు మరిన్ని ఆధునిక హంగులతో..

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో 'గూగుల్ ఫోటోస్' ఒకటి. ఈ క్లౌడ్ ఆధారిత స్టోరేజ్ సిస్టం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ పీసీల్లోని ఫోటోస్ ఇంకా వీడియోస్‌ను ఎప్పటికప్పుడు గూగుల్ ఫోటోస్‌లోకి బ్యాకప్ చేసుకోవటం వల్ల డేటా సేఫ్‌గా ఉండటంతో పాటు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించే వీలుంటుంది.

గూగుల్ ఫోటోస్‌లోకి బ్యాకప్ చేసుకోవాలంటే...

గూగుల్ ఫోటోస్‌లోకి బ్యాకప్ చేసుకోవాలంటే...

ఆండ్రాయిడ్ డివైసెస్‌లోని ఫోటోస్ అలానే వీడియోస్‌ను గూగుల్ ఫోటోస్‌లోకి బ్యాకప్ చేసుకోవాలంటే ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే మెనూ ఐకాన్ పై క్లిక్ చేయండి. మెనూ ఓపెన్ అయిన తరువాత సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసకుని బ్యాకప్ అండ్ సింక్ ను ఆన్ చేసుకోండి. గూగుల్ చెబుతోన్న దాని ప్రకారం 15జీబి వరకు స్టోరేజ్ స్పేస్‌ను మనం గూగుల్ ఫోటోస్‌లో ఉచితంగా వినియోగించుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Google is introducing new products based on Artificial Intelligence (AI), it is safe to say that the company wants to position itself as an AI-based search company.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X