మీకు నచ్చిన ఫొటోల్లో అవసరం లేని వస్తువులను తొలగించాలా.. గూగుల్ మేజిక్ ఎరేజర్ ఫీచర్ గురించి తెలుసుకోండి..!
మీకు బాగా నచ్చిన ఫొటోలు కొన్ని ఉంటాయి. అయితే వాటిలో మీకు నచ్చని వ్యక్తులు లేదా నచ్చని వస్తువులో ఉంటాయి. ఫలితంగా ఆ ఫోటోలను డిలీట్ చేయలేరు. అలాగని జ్ఞాపకంగా భద్రపరచుకోలేరు. ఈ సమస్యకు గూగుల్ చెక్ పెట్టింది. గూగుల్ మేజిక్ ఎరేజర్ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన ఫోటోల్లోని వ్యక్తులు లేదా వస్తువులను తొలగించవచ్చు. పూర్తి వివరాలు.
గూగుల్ ప్రస్తుతం అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. గూగుల్ మేజిక్ ఎరేజర్ ఫీచర్ (Google Magic Eraser) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా క్యాప్చర్ చేసిన ఫోటోలోని అవసరం లేని వ్యక్తులు, వస్తువులను తొలగించేందుకు అవకాశం ఉంది.

ఈ ఫీచర్ కోసం గతంలో గూగుల్ వన్ మెంబర్‌షిప్ లేదా పిక్సల్ స్మార్ట్‌ఫోన్ ను కలిగి ఉండాలి. ప్రస్తుతం ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీకు ఎడిట్ చేయాలని భావిస్తున్న ఫోటోను ఎంచుకోవాలి.
అనంతరం ఎడిట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మేజిక్ ఎరేజర్ టూల్‌ను ఎంపిక చేసుకోవాలి. మేజిక్ ఎరేజర్ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ సమయంలో ఫోటోలోని అవసరం లేని వాటిని తొలగించడంలో గూగుల్ ఫోటోస్ సలహా ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం మీరు తొలిగించాలని భావిస్తున్న వాటిని తొలిగించేందుకు 'Erase all' పైన క్లిక్ చేయండి.
ఆటోమేటిక్‌గా తొలగించడం సహా మాన్యువల్‌గానూ తొలగించవచ్చు. అందుకోసం ఫోటోలోని అవసరం లేని వస్తువులు లేదా గుర్తుల చుట్టూ సర్కిల్ గీయాల్సి ఉంటుంది. ఫలితంగా మీ ఫోటో నుంచి అవి తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లు మార్పులు చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లి్‌క్ చేయాలి.
గూగుల్ కొత్తగా ఏం అందిస్తోంది..?
ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో స్పామ్ కాల్స్ సమస్యకు చెక్ పెట్టనుంది. గూగుల్ ఫోన్ యాప్ అప్‌డేట్‌తో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం గూగుల్ నానో AI ను ఉపయోగిస్తోంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్‌ను గురించవచ్చు. ఇందులోని స్పామ్ డిటెక్షన్ సిస్టమ్ (స్పామ్ కాల్స్‌ను గుర్తించే వ్యవస్థ).. అవసరం లేని కాల్స్‌ను బ్లాక్ చేయడం లేదా ఈ తరహా కాల్స్ పట్ల అప్రమత్తం చేస్తుంది.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని నానో AI రియల్‌టైంలో స్కామ్ కాల్స్ పైనా అప్రమత్తం చేస్తుంది. ఈ చాట్‌బాట్‌ను ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ కోసమే అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ విధానం వల్ల వ్యక్తిగత భద్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ జెమిని నానో AI సర్వీసులు ఆప్షనల్‌గా మాత్రమే ఉంటాయని, తప్పని సరిగా ఉపయోగించుకోవాలనే నిబంధన విధించే అవకాశం లేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








