Google Pay ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

డిజిటల్ చెల్లింపులకు విపరీతమైన ఆదరణ నెలకున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. Google Pay పేరుతో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

|

డిజిటల్ చెల్లింపులకు విపరీతమైన ఆదరణ నెలకున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. Google Pay పేరుతో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్‌లోకి వెళ్లిన తరువాత యూజర్ తనకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్ ఇంకా రికార్డ్ కార్డ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని స్టోర్ చేసుకుని వాటిని అన్ని రకాల ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పేమెంట్‌లకు వినియోగించుకునే వీలుంటుంది. ఈ పేమెంట్ సర్వీస్ ద్వారా చేపట్టే ప్రతి లావాదావీ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటుందని గూగుల్ భరోసా ఇస్తోంది.

 

ర్యామ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిర్యామ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

అఫీషియల్ యాప్ గూగుల్ ప్లేలో లభ్యమవుతోంది..

అఫీషియల్ యాప్ గూగుల్ ప్లేలో లభ్యమవుతోంది..

గూగుల్ పే సర్వీసును వినియోగించుకోవాలనుకుంటోన్న వారు ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్లి Google Pay యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తరువాత పేమెంట్ పద్ధతిని యాడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు యాప్‌ను ఓపెన్ చేసి మెయిన్ స్ర్కీన్ పై కనిపించే మెనూ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

మెనూలోని “My Cards” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని..

మెనూలోని “My Cards” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని..

మెనూలోకి ప్రవేశించిన తరువాత మీ ఫైనాన్షియల్ డిటెయిల్స్‌ను యాడ్ చేయాలనుకుంటోన్న గూగుల్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత మెనూలోని "My Cards" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని "+" సింబల్ పై టాప్ ఇవ్వాలి. సింబల్ సెలక్ట్ అయిన తరువాత మీ క్రెడిట్ కార్డ్ లేదా దెబిట్ కార్డ్‌లను పేమెంట్ సర్వీసులో యాడ్ చేసుకోవల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ సమయంలో...
 

వెరిఫికేషన్ సమయంలో...

కార్డ్ సమాచారం యాడ్ అయిన తరువాత payment methodను వెరిఫై చేసుకోవల్సి ఉంటుంది. వెరిఫికేషన్ సమయంలో మీ ఫోన్ లేదా కంప్యూటర్‌కు ఓ కోడ్ అనేది అందుతుంది. ఆన్ స్ర్కీన్ సూచనలను ఫాలో అవుతూ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయవల్సి ఉంటుంది. వెరిఫికేషన ప్రాసెస్‌ కంప్లీట్ చేయటానికి కొంత మేర ఛార్జ్‌ను గూగుల్ మీ నుంచి వసూలు చేస్తుంది.

గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నట్లయితే..?

గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయాలనుకుంటున్నట్లయితే..?

మీ కార్ట్‌లో ప్రొడక్ట్స్‌ను యాడ్ చేసుకున్న తరువాత పేమెంట్ పేజీలోకి వెళ్లి "Buy with GPay" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఆన్‌స్ర్కీన్ సూచనలను ఫాలో అవుతూ చెల్లింపును పూర్తి చేయండి.

 రిటైల్ స్టోర్‌లో షాపింగ్ చేస్తునపుడు..

రిటైల్ స్టోర్‌లో షాపింగ్ చేస్తునపుడు..

రిటైల్ స్టోర్‌లో షాపింగ్ చేస్తునపుడు గూగుల్ పే ద్వారా బిల్లు చెల్లించాల్సి వచ్చినట్లయితే ముందుగా మీ సమీపంలో కనిపిస్తోన్న జీపే లోగో లేదా ఎన్ఎఫ్‌సీ సింబల్‌తో కనిపిస్తోన్న NFC టెర్మినల్ వద్దకు వెళ్లండి. ఆ తరువాత ఫోన్‌ను అన్‌లాక్ చేసి టెర్మినల్‌కు దగ్గరగా ఉంచండి. ఆటోమెటిక్‌గా గూగుల్ పే లాంచ్ అవుతుంది. ఆ తరువాత ఆన్ స్ర్కీన్ సూచనలను ఫాలో అవుతూ చెల్లింపు ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

Best Mobiles in India

English summary
With rapid progress being witnessed in the digital payments market, it was high time that Google updated its online payment services. Finally, Google rolled out its own online wallet and digital payments system, Google Pay in February 2018.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X