ఇన్స్టాగ్రామ్ “నేం టాగ్” ఫీచర్ ఉపయోగించడం ఎలా ?

ఇన్స్టాగ్రామ్ ప్రతి దశలోనూ తన సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ, ప్రతి రోజూ కొత్తగా చేరుతున్న వేలకొలదీ వినియోగదారులతో ముందుకు దూసుకుని పోతూ ఉంది.

|

ఇన్స్టాగ్రామ్ ప్రతి దశలోనూ తన సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ, ప్రతి రోజూ కొత్తగా చేరుతున్న వేలకొలదీ వినియోగదారులతో ముందుకు దూసుకుని పోతూ ఉంది. ఆ విధంగా ఇన్స్టాగ్రామ్ పొందుపరచిన సరికొత్త ఫీచర్లలో “నేం టాగ్” ఫీచర్ కూడా ఒకటి. సాధారణంగా ఇతరులను మిమ్ములను అనుసరించడానికి, తరచుగా మీ ప్రొఫైల్ను వారితో పంచుకోవడం జరుగుతుంటుంది. కానీ, అది కూడా కొన్ని సమస్యలతో కూడుకుని ఉంటుంది. కొన్నిసార్లు, మీరిచ్చిన యూసర్ నేం కూడా వారికి, అర్ధం చేసుకోడానికి వీలుపడని కారణంగా, ఒకర్ని అనుసరించబోయి వేరొకరిని అనుసరించేలా తప్పిదాలు దొర్లుతుంటాయి.

how-to-use-instagram-nametag-feature

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వచ్చిందే ఈ “నేం టాగ్” ఫీచర్. ఈ ఫీచర్ స్నాప్ చాట్, మరియు ఫేస్ బుక్ మెసెంజర్ కోడ్లలో లభించే స్నాప్ కోడ్లను పోలి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రయోజనం ఏమిటంటే, మీ ప్రొఫైల్ కోడ్ ను సాధారణ స్కాన్ సహాయంతో సులభంగా గుర్తించే వెసులుబాటును కల్పిస్తుంది. అనగా మీ ప్రొఫైల్ గుర్తించడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS డివైజులలో అందుబాటులో ఉంటుంది. “నేం టాగ్” ఒకరకమైన పర్సనలైజ్డ్ గుర్తింపు కార్డు వలె ఉంటుంది. ప్రతి వినియోగదారునికి ప్రత్యేకంగా కేటాయించబడి ఉంటుంది. క్రమంగా, “యూసర్ నేం” సమస్యలకు చెక్ పెట్టగలరు. మీ “నేం టాగ్” పంచుకోవడం ద్వారా, కనీసం వివరాలను వీక్షించకుండానే, సులభంగా మిమ్ములను అనుసరించే వీలు కల్పిస్తుంది. “నేం టాగ్” ఫీచర్ గురించిన మరిన్ని వివరాలు మరియు ఉపయోగించే విధానం తెలుసుకొనేందుకు కింది స్టెప్స్ అనుసరించండి.

పోర్న్ బ్యాన్, వెబ్ అడ్రస్‌ను ఛేంజ్ చేసిన పోర్న్‌హబ్!పోర్న్ బ్యాన్, వెబ్ అడ్రస్‌ను ఛేంజ్ చేసిన పోర్న్‌హబ్!

2) మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి.

3) మూడు వరుసలుగల మెనులో (హాంబర్గర్ మెను) నొక్కండి.

4) మీ యూజర్ నేం క్రింద కనిపించే, మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇదే "నేం టాగ్".

5) ఇప్పుడు ఒక కొత్త విండో తెరవబడుతుంది. ఈ విండోలో ఒక బాక్స్ లో మీ యూసర్ నేం 'స్కాన్ ఎ నేం టాగ్' అన్న సందేశంతో కనిపిస్తుంది.

6) ఇతర ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు మిమ్ములని అనుసరించాలని కోరుకుంటున్నట్లయితే, కేవలం ఈ "నేం టాగ్" చిత్రాన్ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా అనుసరించవచ్చు.

7) ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన "నేం టాగ్" డీఫాల్ట్ సెటప్ నచ్చని పక్షంలో, దీనిని మీకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించింది. స్క్రీన్ పైభాగంలో, రంగు, సెల్ఫీ మరియు ఎమోజి అన్న ఎంపికలను అనుసరించి, మీ "నేం టాగ్" స్క్రీన్ బాక్ గ్రౌండ్ సెటప్ చేసుకోవచ్చు.

8) మీరు ఎవరినైనా అనుసరించాలని కోరుకుంటున్న ఎడల, "నేం టాగ్" స్క్రీన్ కు వెళ్లి, "స్కాన్ ఎ నేం టాగ్" అని పిలవబడే ఆప్షన్ ఎంచుకోవలసి ఉంటుంది. ఈ ఆప్షన్ "నేం టాగ్" స్క్రీన్ దిగువ భాగాన ఉంటుంది. ఇది ఇతర ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల "నేం టాగ్స్" స్కాన్ చేయడానికి మీకు అనుమతిస్తుంది.

9) మీ "నేం టాగ్" యొక్క ఎగువ భాగం కుడి మూలలో, షేర్ బట్టన్ నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా, ఫేస్ బుక్, స్నాప్ చాట్, వాట్సాప్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలలో లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లేదా మీ ఫీడ్ ద్వారా మీ "నేం టాగ్" షేర్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

10) ఎవరైనా మీతో వారి "నేం టాగ్" పంచుకున్న ఎడల, మీరు 'స్కాన్ ఎ నేం టాగ్' మీద క్లిక్ చేసి, ఎగువ కుడి మూలలో ఉన్న గాలరీ బటన్ క్లిక్ చేయడం ద్వారా గాలరీలో ఉన్న "నేం టాగ్" చిత్రాన్ని స్కాన్ చేయడం ద్వారా వారిని అనుసరించవచ్చు.

11) మీరు "నేం టాగ్" స్కాన్ కోసం అనుసరించాల్సిన మరొక మార్గం, కెమరా ఉపయోగించడం. రైట్ స్వైప్ చేయడం ద్వారా, కెమరా యాక్సెస్ తీసుకుని, ఇతరుల "నేం టాగ్" ని స్కాన్ చేయడం ద్వారా కూడా అనుసరించవచ్చు.

ఇన్స్టాగ్రామ్ ఇదివరకే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, లైవ్ టీవీ అంటూ అనేక సరికొత్త ఫీచర్లతో మిగిలిన సామాజిక మాధ్యమాలకు గట్టి పోటీని ఇస్తూ ముందుకు సాగుతుంది. అదేక్రమంలో భాగంగా ఇతర సామాజిక మాద్యమాలైన స్నాప్ చాట్, ఫేస్ బుక్ మెసెంజర్ లోని కోడ్ స్కానింగ్ ఫీచర్ ని కూడా పొందుపరిచింది.

ఇప్పటికే, ఇన్స్టాగ్రామ్ పొందుపరచిన అనేక ఫీచర్లలో చెప్పుకోదగిన ఫీచర్ గా "నేం టాగ్" ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఒకే "యూసర్ నేం" పోలి ఉండేలా అనేకమంది యూసర్ నేమ్స్ ఉండడం కారణంగా, మనకు తెలీకుండానే వేరొకరిని అనుసరించేలా పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఈ "నేం టాగ్" ఫీచర్ ద్వారా, ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం దొరికిందనే చెప్పవచ్చు. కానీ, వినియోగదారులు ఎంతమేర ఈఫీచర్ను ఆదరిస్తారో చూడాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
How to use Instagram Nametag feature.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X