మీ యొక్క ఐఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం ఎలా?

|

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి భయంతో బాధపడుతున్నది. ప్రజలు అందరు తమ యొక్క ఆఫీసులకు పోకుండా ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారు. అయితే ప్రతి రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మీరు వాడుతున్న PC లేదా కంప్యూటర్ లలో పనిచేయని వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంటే కనుక కార్యాలయ సమావేశాలు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం క్రొత్త వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి బదులుగా మీ యొక్క ఆపిల్ ఐఫోన్ ను పూర్తిగా పనిచేసే వెబ్‌క్యామ్‌గా మార్చవచ్చు.

మీ యొక్క ఐఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం ఎలా?

 

ఆపిల్ ఐఫోన్ డిఫాల్ట్‌గా అంతర్నిర్మిత వెబ్‌క్యామ్ ఫీచర్‌తో రాదు కాబట్టి ఐఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా మార్చడానికి వినియోగదారులను అనుమతించే అనేక మూడవ పార్టీ యాప్ లు ఉన్నాయి. వెబ్‌క్యామ్ ఫీచర్‌లను అందించే ఎపోక్‌క్యామ్, డ్రాయిడ్ కామ్ వంటి యాప్స్ ద్వారా ఐఫోన్ ను వెబ్‌క్యామ్‌గా మార్చవచ్చు.

మీ యొక్క ఐఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం ఎలా?

ఐఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా మార్చే విధానం

స్టెప్ 1: మీ ఐఫోన్‌లో యాప్ స్టోర్ యాప్ ను ఓపెన్ చేసి "ఎపోకామ్" యాప్ ను డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు మీ Mac లేదా Windows PC లో 'www.kinoni.com కు వెళ్ళండి. తరువాత మీ సిస్టమ్ లో సంబంధిత కంపానియన్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 3: కంప్యూటర్‌లో కంపానియన్ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన తరువాత దాన్ని తిరిగి ప్రారంభించండి.

స్టెప్ 4: దీని తరువాత మీ ఐఫోన్‌లో ఎపోకామ్ యాప్ ను ఓపెన్ చేయండి.

మీ యొక్క ఐఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడం ఎలా?

స్టెప్ 5: ఇప్పుడు యుఎస్‌బి కేబుల్ ద్వారా ఐఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి లేదా కంప్యూటర్ మరియు ఐఫోన్ రెండింటినీ ఒకే వై-ఫై నెట్‌వర్క్ కనెక్షన్‌తో కనెక్ట్ చేయండి.

 

స్టెప్ 6: రెండిటిని సరైన పద్ధతి ద్వారా కనెక్ట్ చేసిన తర్వాత ఎపోక్యామ్ ఆటొమ్యాటిక్ గా కంప్యూటర్‌ను గుర్తించి ఐఫోన్ కెమెరా నుండి కనెక్ట్ చేయబడిన కంప్యూటర్‌కు వీడియోను ప్రసారం చేయడం ప్రారంభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to use iPhone as a Webcam For Video Calling

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X