India Government లాంచ్ చేసిన 'మేరా రేషన్' మొబైల్ యాప్‌ను ఉపయోగించడం ఎలా?

|

భారత ప్రభుత్వం దేశంలో 'వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్' వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి ఇటీవల 'మేరా రేషన్' అనే కొత్త రేషన్ యాప్‌ను విడుదల చేసింది. జీవనోపాధి కోసం కొత్త ప్రదేశాలకు వెళ్ళే రేషన్ కార్డుదారులకు ఈ కొత్త మొబైల్ యాప్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది.

మేరా రేషన్

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సిస్టమ్ దేశంలో 69 కోట్ల లబ్ధిదారులను కలిగి ఉంది. అలాగే NFSA కింద సుమారు 81 కోట్లకు పైగా ప్రజలకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా ప్రభుత్వం 'అధిక సబ్సిడీ కలిగిన ఆహార ధాన్యాలు' కిలో రూ.1-3 ధరలకు అందిస్తున్నది. ఇది దేశంలో 32 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో రేషన్ కార్డ్ పోర్టబిలిటీ సేవలను ONORC (వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్) ను కూడా అందిస్తుంది. ఈ కొత్త 'మేరా రేషన్' మొబైల్ యాప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మేరా రేషన్ మొబైల్ యాప్ అంటే ఏమిటి?

మేరా రేషన్ మొబైల్ యాప్ అంటే ఏమిటి?

రేషన్ హోల్డర్లు ONORC- సంబంధిత సేవల నుండి లబ్ది పొందటానికి కొత్త మేరా రేషన్ మొబైల్ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో లబ్ధిదారులు తమకు సమీపంలో గల రేషన్ డిస్ట్రిబ్యూషన్ దుకాణాన్ని గుర్తించవచ్చు. అలాగే వారి అర్హత మరియు ఇటీవలి లావాదేవీల వివరాలను కూడా తనిఖీ చేయగలరు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో అందుబాటులో ఉంది. వలసదారులు ఎక్కువగా వెళ్ళే ప్రదేశాల ఆధారంగా 14 వేర్వేరు భాషల్లో ఈ యాప్‌ను పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మేరా రేషన్ యాప్‌ను ఉపయోగించడానికి అనుసరించవలసిన అనుమతులు

మేరా రేషన్ యాప్‌ను ఉపయోగించడానికి అనుసరించవలసిన అనుమతులు

కొత్త మేరా రేషన్ మొబైల్ యాప్ నుండి అన్ని రకాల ప్రయోజనాలను పొందడానికి వినియోగదారులు మొదట వారి యొక్క రేషన్ కార్డు చురుకుగా ఉందో లేదో తనిఖీ చేయాలి. అంటే వారు నివసించే రాష్ట్రంలోని ఆహార, పౌర సామాగ్రి మరియు వినియోగదారుల వ్యవహారాల విభాగం యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయాలి. కార్డు స్టేటస్ ను తనిఖీ చేసిన తర్వాత యాప్‌ను వినియోగించడానికి ఈ సాధారణ దశలను అనుసరించండి.

మేరా రేషన్ యాప్‌ను ఉపయోగించే విధానం

మేరా రేషన్ యాప్‌ను ఉపయోగించే విధానం

*** మొదట గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి సెర్చ్ బార్‌లో 'మేరా రేషన్' అని టైప్ చేయండి.

*** మేరా రేషన్ (CENTRAL AEPDS TEAM) యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.

*** డౌన్‌లోడ్ అయిన తర్వాత మీ మొబైల్‌లో యాప్‌ను ఓపెన్ చేసి మీ రేషన్ కార్డు నెంబర్ ను నమోదు చేయండి.

*** రిజిస్టర్ చేయడానికి మొదట రిజిస్ట్రేషన్ ఎంపికపై నొక్కండి మరియు మీ రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.

*** రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత 'సబ్మిట్' బటన్ మీద నొక్కండి.

*** తరువాత 'మీ అర్హత తెలుసుకోండి' ఎంపికను నొక్కడం ద్వారా మీరు మీ అర్హతను కూడా తనిఖీ చేయవచ్చు. అలా చేయడానికి మీరు మీ రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాలి.

*** ఈ యాప్ ONORC అర్హతను తనిఖీ చేయడానికి కూడా అనుమతిస్తుంది. అర్హత ప్రమాణాలను ఎంచుకుని అవసరమైన సమాచారాన్ని పూరించడం ద్వారా మీరు వివరాలను తనిఖీ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Use 'Mera Ration' Mobile App Launched by India Government

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X