యాప్ ద్వారా ఎటువంటి ఫ్రూఫ్స్ లేకుండా లక్షవరకు లోన్ పొందే అవకాశం

|

ఈ రోజుల్లో అత్యవసర సమయంలో లోన్లు కావాలంటే అందరూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఒక్కోసారి లోన్లు రావు. డాక్యుమెంట్లు సరిగా లేవు అని కుంటి సాకులు చెబుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం అనుకున్న పని కాక చాలా నిరాశలో ఉంటాం. అలాంటి వారికి ఇప్పుడు వరంలా మారింది మనీ ట్యాప్ యాప్. ఉన్నచోట నుంచే కదలకుండా కావాల్సిన రుణాన్ని అందించేలా ఈ మనీ ట్యాప్ యాప్ సేవలందిస్తోంది. ఈ యాప్ ద్వారా మీరు లక్షల్లో రుణాలు పొందవచ్చు. మరి అలాంటి యాప్ గురించి పూర్తి వివరాలు మీకోసం.

 

ఫ్లిప్‌కార్ట్‌లో మోటో సేల్ , తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే !ఫ్లిప్‌కార్ట్‌లో మోటో సేల్ , తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే !

 10 లక్షల మందికిపైగా వినియోగదారులను..

10 లక్షల మందికిపైగా వినియోగదారులను..

బాల పార్థసారథి, అనూజ్ కాకర్, కునాల్ వర్మ పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో ప్రారంభించిన ఈ సార్టప్ యాప్ ఇప్పుడు 10 లక్షల మందికిపైగా వినియోగదారులను ఆకర్షించి ముందుకు దూసుకుపోతోంది.

రూ. 300 కోట్ల రుణాలు..

రూ. 300 కోట్ల రుణాలు..

రూ. 300 కోట్ల రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో ప్రారంభించిన క్రెడిట్ లైన్ మనీ ట్యాప్ యాప్ ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో సేవలందిస్తోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అలాగే విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో కూడా వినియోగదారుల కోసం తమ సేవల్ని తెలుగులో ప్రారంభించింది.

రూ. 3000 నుంచి రూ. 5లక్షల వరకు..
 

రూ. 3000 నుంచి రూ. 5లక్షల వరకు..

ఈ యాప్ ద్వారా మీకు నిమిషాల్లో ప్రాసెస్ పూర్తి చేయడంతో పాటు లక్షల్లో లోను తీసుకునే అవకాశం ఉంది. ఈ మొబైల్ యాప్ ద్వారా రూ. 3000 నుంచి రూ. 5లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తాన్ని రెండు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చు.

బ్యాంకులో సమర్పించే వివరాలు సమర్పించి..

బ్యాంకులో సమర్పించే వివరాలు సమర్పించి..

ఎవరైనా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సాధారణంగా బ్యాంకులో సమర్పించే వివరాలు సమర్పించి లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తం చెల్లింపులపై ఆధారపడి క్రెడిట్ లిమిట్ పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం గల ఉద్యోగులు..

నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం గల ఉద్యోగులు..

నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం గల ఉద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఈ యాప్ ద్వారా క్రెడిట్ పొందవచ్చు. తీసుకున్న మొత్తం మీద వార్షికంగా 1.08 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి ఈఎంఐలు చెల్లించిన వాళ్లు తిరిగి అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

మీరూ మనీ ట్యాప్ సేవల్ని వినియోగించుకోవాలంటే..

మీరూ మనీ ట్యాప్ సేవల్ని వినియోగించుకోవాలంటే..

మనీ ట్యాప్ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకోండి

లోన్‌కి అప్రూవల్ పొందండి
డాక్యుమెంట్లు సమర్పించి తుది అనుమతి పొందండి
కావల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోండి
డ్రా చేసుకున్న మొత్తాన్ని మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి
తిరిగి వాయిదా పద్ధతిలో చెల్లించండి

రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ కి..

రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ కి..

మీ బ్యాంకు స్టేట్ మెంట్లను మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ కి పంపిస్తారు. ఇందులో మీరు నెట్ బ్యాంకింగ్ సేవలను కూడా పొందవచ్చు. మీ eKYC పూర్తి అయిన తరువాత మీ లోన్ మొత్తం వడ్డీ వివరాలతో కలిపి మీ అకౌంట్లోకి ట్రాన్సఫర్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే hello@moneytap.comకి మెయిల్ చేసి తెలుసుకోగలరు. ఇందులో కస్టమర్ కి పూర్తి భరోసా ఉంటుంది. మీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టెలికాలర్స్ కి షేర్ చేసే అవకాశం లేదు.

Best Mobiles in India

English summary
How to Use Money Tap app to Get Instant Cash loans in India More News at Gizot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X