ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడుకోవటం ఎలా?

అతిపెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఒకటైన ఫేస్‌బుక్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉపయోగించు కుంటున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్న చాలా మంది యూజర్లు తన అకౌంట్‌లను ఏకకాలంలో ఒకేసారి, ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రన్ చేయాలనుకుంటారు. అటువంటి వారి కోసం రెండు రకాల ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా అమలు చేయాలంటే..?

Read More : ఎయిర్‌టెల్ 4జీ, ఏడాది పాటు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి పద్దతి..

స్టెప్ 1

ముందుగా అఫీషియల్ ఫేస్‌బుక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. డౌన్‌లోడ్ లింక్. ఈ యాప్‌‍లో మొదటి ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించుకోండి.

 

స్టెప్ 2

ఆ తరువాత Facebook Lite Appను కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందండి. డౌన్‌లోడ్ లింక్. ఈ యాప్‌ను 2015లో ఫేస్‌బుక్ లాంచ్ చేసింది. తక్కువ డేటాను మాత్రమే ఖర్చు చేసుకునే ఈ యాప్‌‍లో రెండవ ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించుకోండి.

స్టెప్ 3

ఈ రెండు యాప్స్ మధ్య యూజర్ ఎక్స్‌పీరియన్స్ కాస్తంత తేడాగా ఉంటుంది. మెయిన్ వర్షన్ ఫేస్‌బుక్ యాప్‌తో పోలిస్తే లైట్ వర్షన్ ఫేస్‌‍బుక్ యాప్‌ సింపుల్‌గా కనిపిస్తుంది. 2జీ నెట్‌వర్క్ పరిధిలోనూ లైటర్ వర్షన్ యాప్ పనిచేస్తుంది.

రెండవ పద్దతి

స్టెప్ 1

ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి Friendcaster అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

 

స్టెప్ 2

యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన వెంటనే, యాప్‌కు సంబంధించిన ఇంటర్‌ఫేస్‌ను మీరు చూడగలుగుతారు.

స్టెప్ 3

యాప్ పేజీలో కనిపించే లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ ప్రైమరీ ఫేస్‌బుక్ తాలుకా లాగిన్ సమాచారాన్ని ఎంటర్ చేసి OK బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు Friendcaster యాప్ ద్వారా మీ ప్రైమరీ ఫేస్‌బుక్ అకౌంట్లోకి విజయవంతంగా లాగిన్ కాబడతారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తరువాత యాప్ పై భాగంలో కనిపించే సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4

సెట్టింగ్స్ మెనూలో మీకు Accounts విభాగం కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయటం ద్వారా add another account అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ముందు సూచించిన ప్రోసీజర్‌నే మళ్లీ ఫాలో అవటం ద్వారా మీ సెకండరీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను విజయవంతగా సెటప్ చేయవచ్చు. మీ అవసరాన్ని బట్టి కావల్సిన అకౌంట్‌ను వాడుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Use Multiple Facebook Accounts On Android. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot