WhatsApp లో కొత్త డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా??

|

ప్రపంచం మొత్తం మీద స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ యాప్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. పేస్ బుక్ యాజమాన్యంలో నడిచే వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తున్నది. అయితే సుదీర్ఘ నిరీక్షణ తరువాత వాట్సాప్ లో డిసప్పెరింగ్ ఫీచర్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ మరియు డెస్క్ టాప్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేసింది.

మెసేజ్ ను పంపిన ఏడు రోజుల తర్వాత
 

ఈ ఫీచర్ ఏదైనా మెసేజ్ ను పంపిన ఏడు రోజుల తర్వాత ఆటొమ్యాటిక్ గా తొలగిస్తుంది. డిసప్పెరింగ్ మెసేజ్ ఫీచర్ వ్యక్తిగత చాట్‌లు మరియు గ్రూప్ చాట్‌ల కోసం కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్లాట్‌ఫామ్‌లలోని వాట్సాప్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఒకరితో ఒకరు చాటింగ్ చేస్తున్నపుడు అదృశ్యమయ్యే మెసేజ్లను ప్రారంభించడానికి లేదా నిలిపివేయాలనుకునే వ్యక్తులను ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ తో గ్రూప్ చాట్లలో నిర్వాహకులకు నియంత్రణ ఉంటుంది.

Also Read: Amazon Alexa కొత్త అప్ డేట్!! హిందీ భాష మద్దతుతో ఆదేశాలు

Android, iOS మరియు వెబ్‌లో డిసప్పెరింగ్ మెసేజ్ లను ప్రారంభించే విధానం

Android, iOS మరియు వెబ్‌లో డిసప్పెరింగ్ మెసేజ్ లను ప్రారంభించే విధానం

*** వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ విండోకు వెళ్ళండి

*** తరువాత మీకు నచ్చిన ఏదైనా కాంటాక్ట్ పేరుపై నొక్కండి.

*** తరువాత కుడివైపు గల నిలువు మూడు చుక్కల మీద నొక్కి అందులో డిసప్పెరింగ్ మెసేజ్ ఎంపికపై నొక్కండి.

*** ప్రాంప్ట్ చేయబడితే ముందుకు కొనసాగించు ఎంపిక మీద నొక్కండి.

*** ఇప్పుడు నిర్దిష్ట చాట్ కోసం డిసప్పెరింగ్ మెసేజ్ లను ఆన్ చేయడానికి "ఆన్" ఎంపికను ఎంచుకోండి.

*** చాట్ విండోకు తిరిగి వెళ్ళండి. ఇప్పుడు మీరు ప్రొఫైల్ ఫోటోలో కొత్తగా డిసప్పెరింగ్ మెసేజ్ల లోగోను కనుగొంటారు.

డిసప్పెరింగ్ మెసేజ్ ల గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు

డిసప్పెరింగ్ మెసేజ్ ల గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు

*** డిసప్పెరింగ్ మెసేజ్ యొక్క స్క్రీన్ షాట్‌ను ఫార్వార్డ్ చేయవచ్చు లేదా తీసుకోవచ్చు. అది కనిపించకముందే దాన్ని సేవ్ చేయవలసి ఉంటుంది.

*** మరొక స్మార్ట్‌ఫోన్ లేదా కెమెరాను ఉపయోగించి కూడా ఫోటోను తీసుకోవచ్చు.

*** డిసప్పెరింగ్ మెసేజ్ల కంటెంట్‌ను కూడా కాపీ చేసి వాటిని డాక్యుమెంట్లో సేవ్ చేయవచ్చు.

*** డిసప్పెరింగ్ మెసేజ్ ఎంపికతో పంపబడిన మీడియా ఏడు రోజుల తర్వాత చాట్ నుండి తొలగించబడుతుంది.

*** కోట్ చేసిన మెసేజ్ ఏడు రోజుల తర్వాత కూడా చాట్‌లో ఉండవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Use New Disappearing Messages Feature in WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X